Latest Updates
-
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.!
దేముడే కరుణిస్తే....మనిద్దరిని కలిపేస్తే?

వీరికి ఒక చక్కని పరిష్కారం అంటే.....సరైన మ్యాచ్ అంటూ బయట వెతక వద్దు. మీరు ఆ వెతికే చర్యలమీద పెట్టే ఎనర్జీలతో మీలోనే అన్వేషించండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీకై మీ శరీరంపై ప్రేమను చూపండి మీ ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ లు ఖచ్చితంగా ఏర్పరచుకోండి ప్రేమ భావాల తరంగాలను మీ మనసులో పెంచుకోండి. ఎవరికైనా ఖచ్చితమైన భాగస్వామి అంటే మనసుకు నచ్చిన వాడుగా ఉండాలి. వారి కలయిక అన్వేషణ లేకనే జరగాలి.
ఒక్కో సారి ఈ మనసుకు నచ్చిన వాడు లేదా సోల్ మేట్ అనేవారు త్వరగా కనపడరు. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. వేచి ఉండాల్సి వస్తుంది ప్రతి ఒక్కరిని బాహ్యంగానే చూస్తాము. వారి అంతరాత్మలను గ్రహించలేము.చివరకు అది అతికష్టంపై దొరుకుతుంది. కొన్ని సార్లు ఎంతో చెడు సంబంధం వలలో పడిపోతాము. బయటకు లేవటం మహా కష్టం అవుతుంది. మరోసారి ఎవరిని నమ్మాలో కూడా తెలియదు.
ఒక సారి మోసపోయిన తర్వాత మరో సంబంధం మనకు నచ్చినది దొరకాలంటే ముందుగా మనం మనసు మార్చుకోవాలి. ప్రతి ఒక్కరిని అనుమానించటం తగదు. మన పరిస్ధితి ముందు చక్కబడితే సరైన పార్టనర్ మీ ముందుంటాడని గ్రహిచండి. ఈ సంబంధాలన్ని భగవంతుడి దయ వలన ఏర్పడుతూంటాయని వారి వారి అదృష్టంపై ఆధారపడి ఉంటాయని చెపుతారు. ఒక్కో సారి సీనీ ఫక్కీలో చెడు లేదా మంచి సంబంధాలే రావచ్చు. వేలాది ప్రేమికులు మోసపోయిన లేక విజయం పొందిన తమ వివిధ లవ్ స్టోరీలు చెపుతూనే ఉంటారు.
వారంతా వారి సోల్ మేట్స్ కొరకు అన్వేషించలేదు. వారి మధ్య ప్రేమ అంకురించింది. అది ఎపుడు, ఎలా? ఎక్కడ ? అనేది వారికే తెలియకుండా జరిగింది. మరి మీ సోల్ మేట్ ను మీరు ఎలా కలిశారు? అతని కొరకు మీరు చూశారా? మీకొరకు అతను అన్వేషించాడా? లేక ఇద్దరి మధ్య దేముడి కరుణ వలన సంబంధం ఏర్పడిందా? మీ కధలు మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications