Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వదలలేని కౌగిళ్ళు...! వద్దంటే చిర్రు బుర్రులు...!
కొత్త జంట అంటే ఇరవై నాల్గు గంటలూ ఒకరినొకరు అంటిపెట్టుకొని ఆనందిస్తూనే ఉంటారు. ఇలా అంటిపెట్టుకోవటంలోనే వస్తుంది సమస్యంతా. ఒకరిలో మరి ఒకరు చిన్నపాటి తప్పులు చూసుకున్నా సరే అమ్మడు, చిన్నోడిపై, చిన్నోడు అమ్మడిపై ఫైర్ అయిపోతూంటారు. వాస్తవానికి హనీమూన్ అయిపోయిందంటే చాలు ఇక తగవుల ఛాప్టర్ వీరి మధ్య మొదలవుతుంది. హనీమూన్ అంటూ కొత్తలలో ఒక మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే తగవులు లేని ఆనందం వీరి మధ్య ఉంటుంది.

వివాహ జీవితంలో జంటల మధ్య తగవులు వివిధ దశలలో వివిధ కారణాలుగా, రకాలుగా మారతాయి. పదిసంవత్సరాల జీవితం తర్వాత పోట్లాడుకునే అంశాలు, కొత్తగా పెళ్ళి అయిన జంటల మధ్య ఉండవు. మరి కొత్త జంటలు ఏ కారణాలుగా తగవులాడుకుంటారు? ఒక జాబితాగా వీటిని పరిశీలిద్దాం.
చెడు అలవాట్లు -
పెళ్ళి అయిన కొత్తలలో, జంటలు ఒకరి చెడు అలవాట్లకు మరొకరు అలవాటు పడరు. కనుక చిన్నపాటి విషయాలైన సరిగా పడకలో పడుకోకపోవటం లేదా బాత్ రూమ్ సరిగా ఉంచకపోవడం వంటివాటిలో ఫైటింగ్ లు వస్తాయి. గతంలో ఒంటరిగా ఉన్నప్పటి అలవాట్లు ఇద్దరైనా పోవు. అలానే కొనసాగుతాయి. ఫలితంగా భాగస్వామి తప్పు పట్టటం తగవులాడటం జరుగుతుంది.
ఖర్చులు
పెళ్ళి అంటే ఖర్చుల మయం.మొదటగా ఇప్పటి జంటలు పెళ్ళి ఖర్చులను వారే భరించుకుంటారు. తర్వాత ఇల్లు ఏర్పరచుకోవడంలో, ఎక్కడైనా చిన్నపాటి పెట్టుబడి పెట్టటంలో, హనీమూన్ ఖర్చులు వంటివి వారి మధ్య అభిప్రాయ భేధాలు కలిగిస్తాయి. ఫలితం తగవులాడటం. ఒక్కోసారి వీరిపై ఎంతో తీవ్ర ప్రభావాన్ని కూడా చూపుతాయి.
కుటుంబ సభ్యులు - జంటలకు ఇరువైపులా గల తల్లి తండ్రి లేదా ఇతర కుటుంబ సభ్యులు వీరి మధ్య కొన్ని అంశాలలో విభేధాలు కలిగించేవారుగా కూడా ఉంటారు. ఉదాహరణకు ఈ వారం మీ తల్లి తండ్రులు రావాలంటే, మరో వారం మా తల్లి తండ్రులు రావాలని వీరు కొన్ని తగవులాడుకుంటారు. అలాగే, వారు వచ్చినపుడు వారికి పెట్టే బహుమతుల విషయంలో కూడా తగవులుంటాయి.
పని ఒత్తిడి - పెళ్ళి అయినంతలో ఆఫీస్ పని తగ్గిపోదు. కాని ఇంటిలో పార్టనర్ మాత్రం ఆఫీస్ నుండి లేట్ ఎందుకు అని ప్రశ్నిస్తాడు. దానికి కారణం ఆమె త్వరగా వచ్చి అతనితో సమయం గడపాలని, అర్ధం చేసుకోలేని ఆమె వెంటనే జగడం మొదలుపెట్టేస్తుంది. అది పెద్దదై అపార్ధాలకు కూడా దారి తీస్తుంది.
ఇంటిపని - పెళ్ళి తర్వాత జంటలు ఇంటిపని షేర్ చేసుకుంటారు. ఆ షేరింగ్ సరిలేకుంటే, నీకు పని తక్కువ, నాకు ఎక్కువ అంటూ కూడా తగవులు చేస్తారు. వంటలు ఎవరు చేయాలి, గది ఎవరు శుభ్రం చేయాలి. పడకలు ఎవరు సర్దాలి, వాషింగ్ ఎలా? వంటి పనులు చిన్నవి, పెద్దవి కూడా వారి మధ్య తగవులు తెస్తాయి.
తేలికగా కోపాలు - చిన్నపాటి వ్యత్యాసాలకు కోపాలు తెచ్చుకుంటారు. కొత్త కాపరం కావడంతో, అమ్మడు చిన్న విషయాలకే ఛర్రున లేచి పుట్టింటికి కూడా పోయే అవకాశాలుంటాయి. ఆఫీస్ నుండి వచ్చేటపుడు మల్లెపూలు మరచిపోయారా...మీకు ఫుడ్డూ, బెడ్డూ రెండూ ఆ రోజుకి నిల్ సుమా! అదే కొద్ది సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చేటపుడు ఏం మరచినా అసలు పట్టించుకోదు.



Click it and Unblock the Notifications