Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
విరహంలో కలహం ...కలహంలో సరసం!

సాధారణంగా వారాంతపు సెలవలలో జంటలు బయటకు వెళ్ళి ఆనందిస్తారు. దీనికి బదులుగా జంటలు కనుక తమ మధ్య కలహం లేదా తగవులు మొదలు పెడితే, అది కొంచెం జాగ్రత్తగా పరిశీలించి సరైన పరిష్కారం కనుక్కోవలసిందే.
జంటలు వారాంతపు సెలవులలో ఎందుకు కలహిస్తారు?
మేము కలిసేదే, వారం చివరలో - ఆశ్చర్య పడకండి!జంటల మధ్య ఈ కొత్తరకం భావన ఏర్పడి పోతోంది. నగరాలలో ఉండే వారు తాము కలిసేదే వారంతం లోనే అని భావిస్తూంటారు. కొంతమంది తమ పని కారణంగా వేరు వేరు ప్రదేశాలలో కూడా ఉండి వారం చివరలో ప్రయాణం చేసి ఒక చోటకు వచ్చి కలుసుకుంటారు. భార్యా భర్తలు వారాంతపు సెలవులలోనే కలుసుకుంటారు. దురదృష్టవశాత్తూ, వారికి వారం రోజులలో చేసిన పనికి విసుగు ఉంటుంది మరో విసుగుగా పార్టనర్ దగ్గర ఉండదు. ఇక వారం చివరలో ఆ విసుగంతా తమ పార్టనర్ తో పోట్లాటలో చూపుతారు.
ఎన్నో సమస్యలు వారి మధ్య అలానే ఉండిపోతాయి. పెరుగుతూంటాయి. వారం లో వారు వాటిని చర్చించుకోవటం కుదరదు. ఒక వేళ కుదిరినా చర్చించుకొని రాత్రులు ఆలస్యంగా పడుకోవటం వారికి ఇష్టం ఉండదు. చివరకు వారాంతంలో వారికి సమయం దొరికేసరికి అన్ని అంశాలూ చర్చించుకొని వారు తగవులాడుకుంటారు.
వారం చివరి నుండి వారం చివరి వరకు ఎలా?
నేటి రోజులలో చాలామంది ఉద్యోగాలు చేసే జంటలు తమ జీవితాలను వారం చివరి నుండి వారం చివరి వరకు గడుపుతున్నారు. యంత్రాలవలే 5 రోజులు వారం చివర వచ్చేస్తుందిలే అపుడు విశ్రాంతి తీసుకోవచ్చులే అంటూ గడిపేస్తారు. మరి వారాంతపు రెండు రోజులు త్వరగా వచ్చి వారు ఏమీ చేయకుండానే త్వరగా వెళ్ళిపోతాయి. వారు చేయాలనుకున్న పనులుచేయలేదనే బాధలో కూడా ఉంటారు. ఈ రకమైన ఆందోళన వారిలో కోపాన్ని తెప్పిస్తుంది. చిన్నపాటి విషయంలో కూడా వర్రీ అవుతారు. వారిమధ్య తగవులు పెంచుకుంటారు.
జంటలు వారం చివర సెలవులలో ఎక్కడికి వెళ్ళాలి అనే చిన్న అంశంపై కూడా తగవులాడుకుంటారు. నేటి రోరులలో ట్రావెలింగ్ అనేది ఎంతో ఒత్తిడి కలిగి ఉంటోంది. ప్రత్యేకించి వారంతంలో బస్ స్టేషన్, రైలు స్టేషన్, ఎయిర్ పోర్టు వంటివన్ని పూర్తిగా జనాలతో నిండి ఉంటాయి. ప్రయాణానికి రెడి అయినప్పటికి కెమేరా, లేదా చేతి బ్యాగ్ వంటివి మరచి దానికి మరో ఆందోళనలో ఉంటారు. అంత ఒత్తిడి లో వీరు తరచుగా ఒకరిపై మరి ఒకరు నిందలు వేసుకుంటారు. ఇక వారంతపు సెలవు తగవులకు నిలయంగా మారుతుంది. వారాంతపు సెలవులు వారంలో మీకు కలిగిన ఒత్తిడినుండి విశ్రాంతినివ్వాలని గుర్తించండి. అప్పటివరకు మీ చుట్టూ కలిగిన అసౌకర్యాలు మరచి పోయేటుందుకని గ్రహించండి. సెలవులు కనుక ఆనందంగా గడిపేస్తే, మరల సోమవారం ఎట్టి ఆందోళన లేకుండా గడిపేయవచ్చు.



Click it and Unblock the Notifications
