Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
భార్య ‘హౌజ్ వైఫ్’అయితే పర్వాలేదు, కానీ ఉద్యోగస్తురాలైతే..!

మనిషి వ్యక్తిత్వంలో ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనే మూడు కంపొనెంట్స్ ఉంటాయి. ఇడ్ కోరికలకు నిలయం. అది మంచి చెడులను పట్టించుకోదు. సమాజ నిబంధనల గురించి ఆలోచించనివ్వదు. కోరికలు తీర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఈగో పరిసరాలకు, నిబంధనలకు... ప్రాముఖ్యతనిస్తాయి. సూపర్ ఈగో నీతి, నియమాలకు ప్రాముఖ్యతనిస్తాయి. ఇవి మనిషి తప్పు చేస్తే పశ్చాత్తాప భావనలను కలిగిస్తాయి.
అయితే ప్రతి మనిషిలో ఈ మూడూ సమపాళ్లలో ఉండవు. హెచ్చుతగ్గులు సహజం. 'ఇడ్' ప్రభావమెక్కువగా ఉంటే తమ కోరికలు, అవసరాలే ముఖ్యం. అందుకే తమ తీరుతో మిగతావాళ్లకి ఇబ్బంది కలిగినా పట్టించుకోరు . ఇలాంటి వాళ్లలో సూపర్ ఈగో బలహీనంగా ఉండటం సహజం. దానివల్ల తప్పు చేస్తున్నానన్న పశ్చాత్తాప భావనలు రావు.
చిన్న, చిన్న మాట పట్టింపులతోనే చాలా కుటుంబాలలో విభేదాలు తలెత్తుతున్నాయి. భార్యాభర్తల మధ్య ‘ఇగో'ల వల్ల చిన్న మాటలే పెడర్థాలకు దారి తీసి ‘విడాకుల'వరకు వస్తున్నాయి. నేటిసమాజంలో అందరు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. టైమ్ కి ఏది లేక ఆందోళన చెందుతున్నారు. ఆఫీసు పనులతో అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తను ఇంటి వాతావరణం తనకు అనుకూలంగా లేకపోయినా, భార్య ఏ మాట అన్నా తప్పుగా అనిపిస్తుంది.
దాంతో కోపంగా అరవడం, తిట్టడం, వస్తువులను విసిరివేయడం చేస్తుంటారు. భార్య ‘హౌజ్ వైఫ్'అయితే పర్వాలేదు, కానీ ఉద్యోగస్తురాలైతే ఇక చెప్పేదేముంది? ఆ ఇల్లు రణరంగమే. అయితే ఇలాంటి గొడవలు జరిగినపుడు కొద్దిసేపు నిదానంగా ఆలోచించాలి. ఇలా అనకుండా ఉండాల్సిందని మథనపడుతూ కూర్చోకుండా, ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలి.
భర్త అయినా, భార్య అయినా ఒకరు అన్నమాటల్లో ఇంకొకరికి ఎన్నో రకాల అర్థాలు గోచరించవచ్చు. కానీ మనం అన్నమాటలు ఏ విధంగా అన్నామో మన మనస్సాక్షికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడు ఎదుటి వారికి ‘సారీ'చెప్పాలి. నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి అని అడిగితే చులకన అవుతామని అనుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సమస్య ఒక భార్యాభర్తల మధ్యనే జరుగుతున్నది కాదు.
ఆఫీస్ కొలీగ్స్ మధ్యన, ప్రాణ స్నేహితుల మధ్య కూడా ఈ ‘ఇగో'ల ప్రాబ్లం తలెత్తి దూరం పెరుగుతోంది. అప్పుడప్పుడు ఎవరైనా నోరు జారడం వల్ల ఎదుటి వాళ్లు బాధపడవచ్చు. ఒకరిమాట ఒకరికి నచ్చక మాటా, మాట అనుకుంటారు. అప్పుడు ఎవరో ఒకరు బాధపడుతుంటారు.
వయసులో మనకన్నా చిన్నవాళ్లు అయినా, పెద్దవారైనా తప్పు ఒప్పుకోవడం మంచి లక్షణం. ఈ మంచి అలవాటు వల్ల భార్యాభర్తల సంసారం బాగుపడొచ్చు, ఆఫీసు కొలీగ్స్ మధ్య మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కలిగించవచ్చు. ఒక ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టవచ్చు. ఎంత ధనాన్ని వెచ్చించినా కొనలేని ఒక మంచి స్నేహాన్ని కాపాడుకోవచ్చు. ఆలోచించండి..



Click it and Unblock the Notifications