Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఆడాళ్లూ.. మగాళ్లు తరచూ చెప్పే అబద్దాలు ఇవే..
మగవారిలో, ఆడవారిలో ఎవరెక్కువ అబద్దాలు చెబుతారో ఊహించండి...?ఇంకెవరు ఆదవారంటార...!కాదండోయ్ అది సామెత వరకే పరిమితం కావాలంటే చూడండి ఆడవారికన్న మగవారే ఎక్కువ అబద్ధాలు చెబుతారంటున్నాయి అధ్యయనాలు. నిజం నమ్మరా..? సరే ఇంతకీ మగవారు ఆడవారితో ఎందుకు అబద్దాలు చెబుతారో తెలుసా?ఆడవాళ్లు ఏదైనా గొడవ మొదలు పెడితే ఆ గొడవను ఆపడానికి, తమ తమ గర్ల్ ఫ్రెండ్స్ ను సంతోషరచడానికి, భార్యకు తప్పు చేసి దొరికిపోయినప్పుడు, స్నేహితుల కోసం ఇలా మరికొన్ని సమయాలలో మగవారు అబద్దాలు అతి సుళువుగా చేప్పేస్తారు. మరి అవేంటో చూద్దామా...
నేను ఆమెను చూడడం లేదు: మగవారు తమ పార్ట్ నర్లతో ఉన్నప్పుడు, ఎవరైనా అందమైన మరో అమ్మాయి లేదా అమ్మాయిలు వారి ముందుగా వెళితే కళ్లు వాటంతటవే వారి వైపు తిరుగుతాయట. ఆడవారు ఈ విషయం గమనించి అడిగితే చూసి కూడా చూడలేదనీ, నువ్వు పక్కనుండగా మరొకరెందుకని, అయినా ఆ అమ్మాయి డ్రెస్ చూసాననో, హెయిర్ చూసాననో ఏదో ఒక విధంగా చెప్పి బుకాయించేస్తారు.

ఛా నా కలలో ఇంకో అమ్మాయినా నో ఛాన్స్: ఛా నా కలలో ఇంకో అమ్మాయినా నో ఛాన్స్! నీకు తప్ప మరో అమ్మాయికి కలలో కూడా చోటు లేదు. మగవారు తమ కలలో వారి వారి స్వప్న సుందరులను ఊహించుకుంటూ కలలు కంటారు. ఒక వేళ నిద్రలో కలవరిస్తూ దొరికిపోయినా.. అటువంటి సందర్భ ఎదురైనా ఛా..ఛాఛా.. నా జీవితంలోనే కాదు కలలో కూడా నీకు తప్ప మరొకరికి చోటులేదు. అంటూ మభ్యపెడుతారట. వాస్తవానికి ఏ భర్తకూ భార్య కలలో రారట. ఎందుకంటే భార్య వాస్తవం కాబట్టి అంటున్నారు.
మర్చిపోలేదు నాకు గుర్తుంది: మగవారు మరీ తరచుగా ఈ పదాన్ని ఆడవారి వద్ద వాడేస్తుంటారు. ఆడవారు ఏమైనా తీసుకురమ్మని చెబితే అవి మరిచిపోవడమే కాక నువ్వు చెబితే మరిచిపోతానా ఓ పనుండి అటువైపుగా వెళ్లలేదు. రేపు ఎంతపని ఉన్నా ఖచ్చితంగా తీసుకుస్తానంటారు కొందరు. ఇంకొందరు ఈ పని చేసి పెట్టండి అంటే అయ్యే నాకు ఇవాల అర్జెంట్ పనుంది అందుకు చేయలేక పోయా..ఖచ్చితంగా రేపు చేస్తానంటారు.
నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బ్రతకలేను: నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బ్రతకలేనంటారు. కానీ వాస్తవమేంటంటే మగవారు ఒక్కసారి విందు వినోదాలలో మునిగితే ఆడవారు అసలు గుర్తుకే రారు.
నేనా నిద్రపోవడం లేదు నువ్వు చెప్పేవి వింటూ ఆలోచిస్తున్నా: తమ గర్ల్ ఫ్రెండ్స్, పార్టనరో ఏవైనా అనవసర విషయాల గురించి మాట్లాడుతుంటే అవి వింటున్నట్లు తల ఊపుతూ తమ లోకంలో తాముంటారు మగవారు. ముఖ్యంగా టీ చూస్తూ, పేపర్ చదవుతూ వారిని అవాయిడ్ చేస్తుంటారు. ఒక వేళ ఆడవారి ఆ విషయం కనిపెట్టి అడిగితే, లేదు లేదు నువ్వు చెప్పినవి వింటూ ఆలోచిస్తున్నా అంటారు. పొరపాటున ఆమేగాని సరే ఏమి చెప్పానో చెప్పు అంటే ఇక అంతే అయ్యగారి సంగతి.. అడ్డంగా దొరికిపోయినట్లే...
ఆ విషయం నాకు తెలియదనుకుంటున్నావా..? ఏదైనా విషయం తెలియదు అని ఆడవారి ముందు ఒప్పుకోవడానికి మగవారికి నామోషీ. ఆడవారికి తెలిసిన విషయాన్ని మగవారు తమకు తెలియకపోయినా తెలుసని బుకాయిస్తారు. అలా ఇలా మాటల్లోకి దింపి ఆ విషయాన్ని మొత్తానికి ఆడవారి నుండే రాబడుతారు.
తాగడం నీకు ఇష్టం లేదనే చెప్పా కానీ నా ఫ్రెండ్స్ బలవంతంగా తాగించారు: ఇంకెప్పుడు తాగను. అప్పటికీ నీకు నేను మందు తాగడం ఇష్టం లేదనే చెప్పా. కానీ వాళ్లు వింటేగా బలవంతంగా తాగిచేశారు అంటూ మగవారు ఇలా మొదలెడతారు. కాని వాస్తవమేంటంటే ఒకరు బలవంతంగా పెట్టే విషయం పక్కన పెడితే మందు తాగేప్పుడు భార్యకు ఇష్టం లేదన్నా మాట మగవారికి గుర్తుకేరాదట. ఒకవేళ వచ్చినా పైన చెప్పినట్లు సాకు చెప్పి తప్పించుకోవచ్చనే ధీమాతో ఫుల్లుగా ఫుల్ బాటిల్ కొట్టేస్తారట... ఇవి మగవారి నిజ స్వరూపాలు..



Click it and Unblock the Notifications
