Latest Updates
-
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.! -
మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం! -
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు! -
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.!
ప్రేమిస్తున్నాను కానీ..అది ప్రేమో..ఏమో..తెలియదు
నేను అతన్ని ప్రేమిస్తున్నాను... అంటారు.! అయితే ప్రేమిస్తున్నానో లేదో ఖచ్చితంగా తెలియదు.... ఇది ప్రస్తుత రోజుల్లో చాలా మంది టీనేజ్ గర్ల్స్ నుండి వినబడుతున్న మాటలు. కాలం మారే కొద్ది సంబంధాలు కూడా సమయానికి మారుతూ వాటిపై చాలా అవగాహనలు కలిగిస్తున్నాయి. అయితే కొన్ని జంటల మధ్య సంబంధాలు దీర్ఘ కాలం కొనసాగినా కూడా వారిలో కలిగే కొన్ని సందేహాల నుండి మాత్రం బయట పడలేకపోతున్నారు. ప్రస్తుత జనరేషన్ లో చాలా మంది రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడానికి చాలా అలోచిస్తున్నారు.
ప్రేమ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అంతెందుకు చాలా కాలం నుండి ప్రేమించుకొంటున్న వారు, డేటింగ్ చేసే వారి మధ్య కూడా సరైన అవగాహన లేక, వారిలో కలిగే అనేక రకాలైన అనుమానులతో వారి సంబంధాలను తెగతెంపులు చేసుకొంటున్నారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లైతే ఈ క్రింది కొన్ని విషయాలను మీరు తెలుసుకోండి...

1. అతని ప్రేమిస్తున్నాను... కానీ నాకు అతని కుటుంబం అంటే ఇష్టం లేదు: మహిళల విషయంలో మొదటిగా చెప్పే విషయం ఇది. అయితే ప్రేమించే ప్రతి మహిళ అతను అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అని గుర్తించాలి. మీరు కనుక అతని కుటుంబాన్ని ఇష్టపడక పోతే, అతన్ని ఎప్పటికీ ప్రేమించలేరు, ఇష్టపడలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు కనుక పాజిటివ్ పర్సన్ అయితే అతన్ని ఇష్టపడినట్లే అతని కుటుంబాన్ని కూడా ఇష్టపడుతున్నట్లు తెలియజేస్తారు.
2. నేను అతన్ని ప్రేమిస్తున్నాను అయితే అతను ఎక్కువగా సంపాదించలేడు: ఇది ఒక గమ్మత్తైన విషయం. ప్రతి ఒక్క మహిళకి కొన్ని కలలు ఉంటాయి. మరి మీకు ఆ డ్రీమ్ ఉంటే కనుక మీరు అతన్ని ప్రేమించడానికి కంటే మీ కలలు నెరవేర్చుకోవడమే శక్తివంతమైనవిగా భావిస్తున్నారా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. బహుశా అతను ప్రస్తుతానికి మీరు అనుకొన్నంత సంపాదిస్తుండకపోవచ్చు. అయితే భవిష్యత్తులో మీరనుకున్నంత లేదా అంతకంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉందా లేదా? అన్న విషయం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మీరు మాత్రమే నివృత్తి చేసుకోగలరు.
3. నేను అతన్ని ప్రేమిస్తున్నాను..కానీ అతనికి నామీద ప్రేమ లేదు: ఈ విషయంలో మాత్రం అతన్ని మర్చిపోవాల్సిందే. ఎందుకంటే మీరు ఎల్లప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తితో ఉన్నప్పుడే మీ జీవితం హ్యాపీగా గడుస్తుంది.
4. నేను అతన్ని ప్రేమిస్తున్నాను..కానీ అతను నా సోల్మేట్ కాదు: మీరు ప్రేమించే వ్యక్తితో దీర్ఘకాలం సంబంధం నిలబడాలంటే మీ ప్రేమ కంటే మీరు అతన్ని అర్థం చేసుకోవడంలోనే ఉన్నది అసలైన ప్రేమ. అలాగే అతను కూడా మీ ఆలోచనలకు, మీకు విలువ ఇచ్చేవాడై ఉండాలి. అప్పుడే మీ మద్య బంధం చిరకాలం పాటు నిలబడుతుంది. అటువంటి వారిని ఎంపిక చేసుకోవడానికే ప్రాధాన్యతను ఇవ్వండి.
5. నేను అతన్ని ప్రేమిస్తున్నాను అయితే ఆ ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుందా అనేది నాకు తెలీదు: ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. ఇదే విధంగా మీరు ప్రేమించే వ్యక్తి కూడా మీలాగే ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తే అయితే...? ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు..ఎవ్వరూ వారు విడిపోవాలని అనుకోరు. జీవితాంతం కలిసుండాలనే కోరుకుంటారు. కాబట్టి ప్రేమ అనేది తాత్కలికంగా చూపించకపోయినా శాశ్వసతంగా అలాగే ఉంటుంది.
6. నేను అతన్ని ప్రేమిస్తున్నాను కానీ అతనితో జీవించలేను(కలిసి ఉండలేను): మీరు ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నారో.. ఖచ్చితంగా అంతే మీరు అతనితో జీవించాలని కోరుకుంటారు. సంబంధబాంధవ్యాలనేవి ఎప్పుడూ రాజీ పడటం మరియు సర్ధుబాట్లు అనేవి ఉంటేనే జీవితం సాఫీగా కొనసాగుతాయి. వాటిని నుండి మీరు తప్పించుకోలేరు. ఎప్పుడో ఒక సారి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా రాజీ పడటం, సర్దుకుపోవడం అనేవి జరిగితేనే దీర్ఘకాలం పాటు కలిసి ఉండగలుగుతారు. ఇద్దరి విషయంలోనూ స్వార్థ ప్రయోజనాలను చూపించకూడదు.
ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ‘అనుమానం' అనేది ఉండకూడదు. దాంతో పాటు ‘కానీ', ‘అయితే' అనేవాటికి తావివ్వకూడదు. అయితే చాలా సందర్భల్లో మహిళలకు వారికి ఏం కావాలో అనేది తెలియదు. కాబట్టి సంబందబాంధవ్యాలు నిలబడాలంటే ఇటువంటి విషయాలను తెలుసుకోవడం వల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది మీ సందేహాలను తీర్చుకోగలుగుతారు. జీవితంలో సరైన నిర్ణయం తీసుకొని హ్యాపీగా గడుపగలుగుతారు.



Click it and Unblock the Notifications