Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
ఖర్చులేకుండా వండర్ ఫుల్ గా డేటింగ్ చేయడం ఎలా...!
మీరు బాగా కఠినమైన బడ్జెట్ మీద వున్నారా? అయినా కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే, ఏ మాత్రం ముక్కుసూటిగా వుందేవరైనా ఒక మంచి డేట్ చేసి ఇంకా కొంత డబ్బులు జేబులో మిగుల్చుకోవచ్చు.
పైగా, మీరు బంగారు గని తవ్వే వారితో డేట్ చేయట్లేదని నిర్ధారించుకోవడానికి ఇదో మంచి మార్గం!
చర్యలు:

పార్క్ లో పిల్లగాలులు ఆస్వాధించండి: ఓ పార్క్ లోనో లేదా అలా వీధుల వెంటో నడవడం కోసమే నడవడం వల్ల మీరు, మీ భాగస్వామి ఒకరితో ఒకరు ఎలా ఉండగలరో తెలుస్తుంది. మీరిద్దరూ ఒక సంభాషణ కొనసాగి౦చగలరా? మీ మౌనాలు అసౌకర్యంగా ఉన్నాయా లేక మీరు పరస్పరం చిరునవ్వుతో చూసుకున౦టున్నారా?

హైకింగ్ చేయండి: మీరు, మీ డేట్ ప్రకృతి ప్రేమికులైతే ఇది అన్నిటి కన్నా చౌకైన డేట్. కేవలం హైకింగ్ ట్రయిల్ దాకా గ్యాస్ కొట్టించడానికి, స్నాక్స్ కి మాత్రమె ఖర్చు అవుతుంది. మీరు సిద్ధంగా వున్నారని నిర్ధారించుకోండి.

ఒక ఫోటోగ్రఫీ టూర్ చేయండి: మీ దగ్గర డిజిటల్ కెమెరా లేకపోతె డిస్పోసబుల్ వి కొనండి - అవి పెద్ద ఖరీదేమీ కావు. ఇక తిరుగుతూ చిత్రాలు తీయండి. సృజనాత్మకత వున్న సరదా రాయుళ్ళకు ఇది ఉత్తమం. మీరు కూడా ఒకరినొకరు వివిధ భంగిమలలో ఫోటోలు తీసుకోవచ్చు.

పుస్తకాల షాప్ కి వెళ్ళండి: స్థానిక పుస్తకాల దుకాణం లేదా గ్రంధాలయంలో కొన్ని గంటలు గడపండి. మీకిష్టమైన పుస్తకాల గురించి మాట్లాడండి. కళ, చాయాచిత్రాల మీద వున్న పుస్తకాలు తిరగేసి మీకు నచ్చి౦దేమిటో చెప్పండి. మీరు పుస్తకాల పురుగు కాకపొతే సంగీతం షాప్ కి వెళ్ళండి.

మీ డేట్ కోసం మీరే డిన్నర్ వండి పెట్టండి. మొదటినుంచి అన్ని పదార్ధాలతో వండితే పెద్ద ఖర్చూ కాదు, రుచిగా కూడా వుంటుంది. కొన్ని కొవ్వొత్తులు పెట్టండి (అలాగే కొద్దిగా బ్రూ చేసిన వైన్ కూడా) - దీంతో మీరు ఒక అనురాగపూర్వక విందుకు సిద్ధం.

ఐస్ స్కేటింగ్ చేయండి: చేయి చేయి పట్టుకోడానికి ఇదో మంచి వంక.

పూల్ లేదా డార్ట్స్ ఆడండి: దీనికి బార్ ని మించిన ప్రదేశం లేదు. హాపీ అవర్స్ లో వెళ్ళారంటే పానీయాలు, భోజన పదార్ధాలు కూడా చౌకగా కొనవచ్చు.

మీ పొలానికే వెళ్ళండి: బెర్రీలో, గుమ్మడికాయలో, పళ్ళో కోయండి. లేదా పాలు పితకండి. అలా తీసిన వాటితో ఒక భోజనం కూడా వండారంటే అదనపు మార్కులు కొట్టేసినట్టే.

వైనరీలు సందర్శించండి: కొన్ని చోట్ల ఉచితంగా రుచి చూడడానికి ఇస్తారు, ఇతరులు కొద్దిగా రుసుం వసూలు చేస్తారు. దాంతో మీకు ఉచితంగా వైన్ గ్లాసులు వచ్చాయంటే అవే మంచి జ్ఞాపికలుగా ఉండిపోతాయి.

స్థానిక సంగీత ప్రదర్శనలు చూసిరండి: మీరు ఒక మోస్తరు నుంచి పెద్ద నగరంలో నివసిస్తుంటే ఉచిత ప్రదర్శనలిచ్చే చాలా బాండ్లు వుండే వుంటాయి - లేదా తక్కువ ఖర్చుతో మంచి ప్రదర్శన కూడా చూడవచ్చు.

ఇద్దరూ కలిసి డాన్స్ శిక్షణ కు హాజరు కండి: చాలా డాన్స్ స్టూడియో లు, శిక్షకులు ఉచిత లేదా తక్కువ రుసుముతో ప్రాధమిక శిక్షణ నిర్వహిస్తారు. స్వింగ్, సాల్సా, (ఇంకా సన్నిహితంగా ఉండాలంటే)టాంగో లాంటివి ప్రయత్నించండి.

జిమ్ కి వెళ్ళండి: చాలా జిమ్ములు సౌకర్యాలు పరీక్షించడానికి మీకు ఉచిత పాస్ ఇస్తాయి. బరువు శిక్షణ తో ఒకరినొకరు సవాల్ చేసుకోండి, యోగా లేదా ఏరోబిక్స్ లేదా స్పిన్నింగ్ శిక్షణకు హాజరు కండి - ఆ పూల్ లో తిరుగుతూ వుండండి. వ్యాయామం చేస్తే ఇద్దరికీ కాలరీలు కరిగి హాయిగా వుండే అనుభూతి కలుగుతుంది.

ఆమెను విహారయాత్రకి తీసుకు వెళ్ళండి: అందరి ఫ్రిజ్ లలో రకరకాల ఆహార పదార్ధాలు వుంటాయి - వాటితో ఆమెను ఆశ్చర్య పరచండి. ఒక చాకొలేట్ కేక్ కొన్నా పెదా ఖరీదేమీ కాదు. ఆమెకు నచ్చవచ్చు, మీరు చాలా రొమాంటిక్ అని కూడా అనుకోవచ్చు.

ఒక ఈత కొలను లేదా బీచ్ లో మునక వేయండి. మీరు పబ్లిక్ పూల్ సౌకర్యం వున్న ప్రాంతంలో నివసిస్తుంటే అక్కడే జలకాలాడుతూ దగ్గరలోని మీ ఇంటి నుంచే భోజనం తెచ్చుకుని చేస్తూ కబుర్లాడుకోంది. లేదా స్థానిక బీచ్ విహార కేంద్రానికి తీసుకు వెళ్ళండి. వీటిలో కొన్ని ఉచితంగానూ కొన్ని కొద్దిపాటి రుసుముతోనూ ప్రవేశం కల్పిస్తాయి. అలా అయితే మీరు కాటేజ్ కి అద్దె కట్టక్కరలేదు, తీరం వెంట కూర్చొని ఉండవచ్చు. మీ ఇంటి నుంచి భోజనం లేదా ఆహారం తేవచ్చు లేదా స్థానిక స్టోర్ లో కూడా చౌకగా కొనవచ్చు.



Click it and Unblock the Notifications
