Latest Updates
-
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా
విడాకులకు దారి తీసే 10 అతి పెద్ద ముఖ్య సమస్యలు
ప్రేమ... పెళ్ళి రెండూ అవ్వగానే.. వెంటనే పిల్లలు..కొద్దిరోజూలు అన్యోన్యంగా గడిపిన వారు రెండు మూడు సంవత్సరాలకే విడిపోవడంతో తీవ్రంగా నష్టపోయేది వారి పిల్లలు. వారి జీవితాలకు కావలసిన రక్షణ కరువైపోతోంది. ఈ విషయంపై విడాకులు తీసుకునే దంపతులు ఆలోచించే స్థితిలో ఉండరు. పెళ్లనేది ఆట కాదు. తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుని తర్వాత విచారిస్తే ప్రయోజనం ఉండదు.
కలలు కనే జీవితానకి, నిజజీవితం భిన్నంగా ఉంటుంది. చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో పూలపాన్పుల కన్నా ముళ్లబాటలే ఎక్కువగా ఉంటాయి. సినిమాల్లో చూపించినట్లు జీవితాలు ఉండాలని తప్పటడుగులు వేయకూడదు. భార్యాభర్తల మధ్య సామాజిక, ఆర్థిక, ఆవేశ, మేథో పరమైన సమతుల్యత ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంఘటనలే పెద్ద పెద్ద అగాధాలు సృష్టించే ప్రమాదం ఉంది.
విడాకులు ఒక్క రోజులో జరగవు. చిన్న చిన్న అపార్ధాలు పెద్దవి అయ్యేదాకా పరిష్కరించుకోక పొతే విడాకులకు బీజాలు పడినట్టే. విడాకులుగా పరిణమించే 10 అతి పెద్ద సమస్యలేవో తెలుసుకోవడానికి ఇది చదవండి.

వివాహమైన కొన్ని సంవత్సరాల తరువాత శృంగార రంగుల ప్రపంచం చల్లగా, నిరుత్సాహంగా మారుతుంది. ఇది కేవలం విసుగుదల, బాధ్యతల భారం వలన ఏర్పడుతుంది. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి భార్యా భర్తల మధ్య సమయం తగ్గుతుంది. ప్రేమను పంచుకోవడం, శృంగారం స్థిరంగా లేకపోతే తరచుగా విస్తృత విభేదాలు ఏర్పడి చివరికి విడాకులకు దారితీస్తుంది.

ఎప్పుడైతే డబ్బు మీ చర్చలకు, వాదనలకు కేంద్రంగా ఉంటుంది, అపుడు మీ ప్రేమ తరచుగా కిటికీలోనుండి ఎగిరిపోతుంది. నిరంతర ఆర్ధిక కొరత మరో సమస్య అయితే అది మీ వివాహ ఆనందాన్ని ముక్కలుచేసి విడాకులకు దారితీస్తుంది. నియంత్రణలేని ఖర్చు అలవాటు, ఆర్ధిక బాధ్యత లేకపోవడం వంటి సమస్యలు తీవ్ర స్తాయిలో ఉన్నపుడు విడాకులే దీనికి పరిష్కారంగా కనిపిస్తుంది.

ప్రేమ కొత్తగా ఉన్నపుడు, మీకు ఇష్టమైన తప్పులను తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ కొన్నాళ్ళ ప్రేమ తరువాత, మీరు జీవిత వాస్తవికతలో మునిగిపోయి, మీ తప్పులు కనిపించని కళ్ళకు కష్ట౦ అవుతుంది. దీని ఫలితంగా - అహం వల్ల ఘర్షణలు, ఎగతాళి వాదనలు. కొన్నిసార్లు అది ఎవరిదీ తప్పు లేదా ఒప్పు గురించి కాదు. ఈ సమస్య కేవలం భార్యాభర్తల భావోద్వేగం, ప్రవర్తనా అననుకూలత వల్లే. వారు ఎప్పటికీ ఒకరినొకరు అర్ధంచేసుకోరు, మంచికోసం వారు విడిపోయే వరకు పోరాటం ఆపరు.

జీవిత భాగస్వామిని మోసంచేస్తూ, అదనపు వివాహ వ్యవహార౦లో మునిగి ఉండడం వివాహ బంధానికి ఒక ఘోరమైన పరిణామం. ఈ సందర్భంలోనే అనేక జంటలు విడాకులను కోరుకుంటాయి.

ఇది నమ్మండి, నమ్మకపోండి, కానీ విడాకులకు అత్తమామలు కూడా కారణమే. అత్తమామలు ఎక్కువగా జోక్యం చేసుకోవడం, సాధారణ అననుకూలత వల్ల భార్యాభర్తల మధ్య తరచుగా వాదనలు, తగాదాలు ఏర్పడి చివరికి విడాకులకు దారితీస్తుంది.

కొన్నిసార్లు జీవితం ప్రేమ మార్గంలో వస్తుంది. మీరు అక్కడ మీ జీవిత లక్ష్యాలను సాధించేందుకు, ప్రతిఘతించలేని పరిస్థితి ఉన్నపుడు, వ్యక్తిగత త్యాగాలు అవసరమైనపుడు అది మీ సంబ౦దాన్ని దుర్భరమైన పరిస్థితుల్లో నెడుతుంది. తరచుగా ప్రయాణాలు లేదా వివిధ నగరాలకు/దేశాలకు పోస్టింగ్ మీ వివాహ ముగింపుకు దారితీస్తాయి. వివాహ జీవితం ఇప్పటికే అనేక సమస్యలతో భారంగా ఉండడం, వివాహ జీవితం కోసం వృత్తిపరమైన త్యాగాలకు సిద్ధం కాకపోవడం అనేవి ఇలాంటి సందర్భాలలో జరుగుతాయి.

సంతానప్రాప్తి సమస్యలు, గర్భం ధరించలేకపోవడం అనేవి కొన్నిసార్లు వివాహానికి విపత్తు అని అర్ధం. తరచుగా ఏమీ సహాయపడకపోవడం, జంటలు ఎప్పటినుండో ప్రయత్నించడం, సంబంధంలో తేడాలు కనిపించడం ప్రారంభమౌతుంది.

దుర్వినియోగ సంబంధం నుండి బైటికి రావడం చాలా కష్టం, కానీ పరిస్థుతులు భారించేవిగా మారినపుడు ఇటువంటి సందర్భాలలో విడాకులు మాత్రమే సరైన పరిష్కారం. గృహ హింస, దూకుడు, మానసిక హింస, మానసికంగా భయపెట్టడం ఇవ్వన్నీ సంబంధాలను దుర్వినియోగం చేస్తాయి.

అనవసరమైన అనుమానం, నమ్మకం లేకపోవడం అనేవి తరచుగా అనేక వివాహాల పతనానికి దారితీస్తాయి.

అనేక జంటలు విడిపోవడానికి కారణం, ప్రతివారూ ఇతరులకు కొంచెం స్థలం ఇవ్వకపోవడం, ఒకరి గోప్యాన్ని మరొకరు ఎలా గౌరవి౦చుకోవాలో తెలుసుకోలేక పోవడ౦. వారు ఒకరికొకరు శారీరక, భావోద్వేగ స్పేస్ ఇచ్చుకోలేకపోవడం వల్ల వారి వైవాహిక ఆనందం నాశానమవ్వచ్చు.



Click it and Unblock the Notifications
