Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
మీ వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసే 10 విషయాలు.. !
చాలా సార్లు మీరు బయటి ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంలో మీ లోపల దాగి వుండే సంక్లిష్ట ప్రపంచాన్ని విస్మరిస్తారు. మీ అంతరంగాన్ని మీరు తెలుసుకోవడానికి మీరు నిజంగా ఎన్ని ప్రయత్నాలు చేసారు? సరే, ఇప్పటిదాకా చేయకపోతే, మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీ జీవితంలో అంతర్భాగమైన విషయాలను విశ్లేషించుకోవడానికి ఇదిగో మీకు ఇదొక అవకాశం. మీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే విషయాల జాబితా ఇదిగో :

మీకు ఇష్టమైన సినిమాలు :
మీరు చూసే సినిమాలు కూడా మీరు ఎలాంటి వ్యక్తో తెలియచేస్తాయి. మీరు ప్రేమ సినిమాల వీరాభిమాని అయితే, మీరు ఒక ప్రేమికుడై వుంటారు, అలాగే జీవితం పట్ల ఒక సరదా వైఖరి కలిగి వుంటారు. మీరు సాహస లేదా భయానక సినిమాలు అభిమానిస్తే, మీరు అధ్బుతమైన అనుభవాలు కోరుకునే సాహసికులు. మెడకు మేత కావాలనుకునే మేథావులు సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడతారు.

మీకు ఇష్టమైన రంగు:
రంగుల లోకంలోని రంగులన్నిటి లోంచి మీకిష్టమైన రంగును ఎంచుకోండి. అది కూడా మీరు ఎలాంటి వ్యక్తో యిట్టె చెప్పేస్తుంది. మీకు ఎరుపు, పసుపు లాంటి ముదురు రంగులు ఇష్టమైతే, మీరు బహిర్ముఖంగా వుండే, స్నేహశీలి, ప్రేమికులు అయి వుంటారు. లవేండర్, పింక్ లేదా తెలుపు లాంటి రంగులు ఇష్టపడే వారు బిడియస్తులు, కలలు కనే స్వభావం కలవారు, మెత్తటి వారు అయి వుంటారు.

మీ సెల్ ఫోన్:
మీరు వాడే సెల్ ఫోన్ ను బాగా గమనించండి. అది స్టైల్ గా వుంటే మీరు ఫాషన్ ట్రెండ్ లను పాటించేవారు అయి వుంటారు. అది కాలింగ్, టెక్స్ట్ మెసేజింగ్ లాంటి మౌలిక సేవలు అందించే సాదా సీదా ఫోన్ అయితే మీరు జీవితాన్ని మామూలుగా గడిపేవారన్నమాట. మీకు సరికొత్త ట్రెండ్ ల పట్ల ఏ మాత్రము ఆసక్తి వుండదు. క్వేర్టీ కీ పాడ్ ఉండే సెల్ ఫోన్ వాడే వారైతే, అది మీరు స్నేహశీలి అని తెలియచేస్తుంది. మీ సెల్ ఫోన్ లో ఒక గొప్ప కెమెరా వుంటే మీరు జ్ఞాపకాలను సంపదగా భావించేవారు అయి ఉంటారు.

మీకు ఇష్టమైన వంటకం:
మీకిష్టమైన వంటకం కూడా మీ గురించి ఎంతో కొంత చెప్తుంది. మీకు మెక్సికన్ ఆహారం ఇష్టమైతే మీరు సాదా సీదా జీవితం గడపడానికి ఇష్టపడతారు, చారిత్రిక ప్రదేశాలు సందర్శించి వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. చైనీస్ ఆహారాన్ని ఇష్టపడే వారు చాలా ఓపిగ్గా, సరదాగా వుంటారు. కళాత్మకంగా, కాల్పనికంగా వుండే వారు పెస్త్రీ లను ఇష్టపడతారు. ఐస్ క్రీములను ఇష్టపడే వారు చిన్నపిల్లలలాగా అమాయకంగా, ఉత్సాహంగా, స్పూర్తిమంతంగా వుంటారు. వారు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటారు. పిజ్జా లను ఇష్టపడే వారు నలుగురితో కలుపుగోలుగా, బహిర్ముఖంగా వుంటారు.

కార్యాలయం లో మీ డెస్క్ :
కార్యాలయంలో శుభ్రంగా లేని, తీర్చిదిద్దని డెస్క్ వుంటే మీరు అక్కడ ఎక్కువ సేపు పని చేయడానికి ఇష్టపడటం లేదన్నమాట. అందుకు విరుద్ధంగా మీరు మీ డెస్క్ ను మొక్కలు లేదా బొమ్మలతో అలంకరించుకుంటే దాన్ని మీ స్వంత ఆస్తిగా భావించి అక్కడ ఎక్కువసేపు పని చేయాలనుకు౦టున్నారన్నమాట .

మీకు ఇష్టమైన కార్:
మీకు ఇష్టమైన కార్ కూడా మీ వ్యక్తిత్వం గురించి తెలియచేస్తుంది. బీటిల్ నచ్చేవారు చాలా సుతారంగా, సుకుమారంగా వుంటారు. గమనింపు, శ్రద్ధ కలిగిన వ్యక్తీ ఒక BMW 7 శ్రేణి వాహనాన్ని ఇష్టపడతారు. ఒక హైబ్రీడ్ కార్ ను ఇష్టపడేవారు చాలా ఆధునికంగా, దర్జాగా, తెలివిగల వ్యక్తీ అయి వుంటారు. సాహసికులకు కియా సోల్ కారు, నిత్య ప్రేమికులకు స్మార్ట్ ఫోర్త్వో కార్ ఉండనే వున్నాయి.

మీకు ఇష్టమైన షూ:
మీ పాదరక్షలు కూడా మీ అభిరుచుల గురించి తెలియచేస్తాయి. ఉత్సాహవంతులు, అల్లరి చేస్తూ సరదాగా వుండే వారు స్నీకర్స్ ను కోరుకుంటారు, సుతారంగా వుండే వారు తెల్లటి బాలే షూ ఎంచుకుంటారు. నలు చదరపు కాళ్ళు వుండే విక్టోరియన్ లు బ్రాగ్స్ తెచ్చుకుంటే, సరదాగా జాలీగా వుండే వారు స్లిప్పర్లు కోరుకుంటారు. స్టిలెతో ఇష్టపడేవారు అందమైన వారని లెక్క.

మీకు ఇష్టమైన జంతువు:
గమనింపు కలిగి, కలలు కనే వారు పక్షులను ఇష్టపడతారు. అంతర్ముఖులు, విరామంగా వుండే వారు చేపలను ఇష్టపడతారు. స్నేహంగా, నలుగురితో కలిసే వారికి కుక్కలంటే ఇష్టం, కాగా బద్ధకంగా, స్వార్ధంగా వుండే వారు పిల్లులను ఇష్టపడతారు. నలుగురినీ దబాయించి, అధికారం కోరుకునేవారికి సింహాలంటే ఇష్టం. ఇతరులచేత శాసింపబడి తన కాళ్ళ మీద తానూ నిలవలేని వారికి ఎలుకలంటే ఇష్టం.
అందువల్ల, మీ నిజ స్వరూపాన్ని దాచి వుంచాగలరని ఎప్పుడూ అనుకోవద్దు. గుర్తుంచుకోండి, దాన్ని కనిపెట్టడానికి చాలా మార్గాలు వున్నాయి.

నిద్ర: సాధారణంగా వ్యక్తులు వేసుకునే దుస్తులు, వారి ప్రవర్తన వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయన్న విషయమే చాలా మందికి తెలుసు. అయితే మనం నిద్రపోయే భంగిమ కూడా మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుందన్నది ఎక్కువమందిక తెలియకపోవచ్చు. కానీ ఇది నిజమని అంటున్నారు నిపుణులు. నిద్రపోయే భంగిమను బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని వారు చెబుతున్నారు.

ఫెర్ఫ్యూమ్: శరీరం విషయంలో చాలా మంది ఒకే రకమైన సంట్ ను తరచూ వాడుతుంటారు. దీన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు. వాళ్లు ఎలాంటి ఆశయాలు కలిగినవాళ్ళ?మొదలైన విషయాలను వాళ్లు ఉపయోగించి సుగంధాలతో తెలుసుకోవచ్చు. ఫ్లోరల్: ఇందులో మీకు రకరకాల సంప్రదాయ పుష్పాల సుగంధాలు వస్తాయి. ఇది మనషి మెదడులో స్త్రీ సంబంధ ఆలోచనలను కలిగిస్తాయి. వీటిలో గులాబీ, మల్లెపూల సువాసనలు ఎక్కువ జనాదరణ పొందాయి. గ్రీన్: రోజ్ మెరీ, చామోమిలీ, యూకలిప్టస్ ఎక్కువ ప్రజాదరణ పొందినవి, వీటిని ఉపయోగించి రిలాక్సింగ్, బాతింగ్ ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి గ్రీన్ సువాసనలు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి

హెయిర్ స్టైల్: విలువెై న, అందమై న దుస్తులు ధరించినా మీ హెయిర్‌స్టైల్ సరిగా లేకపోతే వాటికి విలువ పోతుందట. దీంతోపాటు మీ అందం కూడా కాస్తా తగ్గుతుందని వారంటున్నారు. మీ హెయిర్‌స్టైల్ మీ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుందనడంలో సందే హం లేదంటున్నారు. తల వెంట్రుకలు పొట్టిగా ఉన్న మహిళల్లో ఆత్మ విశ్వాసం మెం డుగా ఉంటుందని, అదే పొడవెైన వెంట్రు లు న్న మహిళలు స్మార్ట్‌గా ఉండేందుకు ఇష్ట పడ తారని తమ పరిశోధనల్లో తేలినట్లు పరిశో దకులు తెలిపారు.హెయిర్‌స్టైల్ అనేది వాతావరణాన్ని బట్టి మార్చా ల్సి ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో వె ంట్రుకలను ముడి వేయకుండా గాలికి వదిలేస్తే మీరు మీ వ్యక్తిత్వంలో నిలకడలేనివారిగా, న లుగురిలో తక్కువగా చూడబడతారట.



Click it and Unblock the Notifications