Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
చాలా వివాహ బంధాలు ఎందుకని విజయవంతం కావు ?
ప్రియమైన స్నేహితులారా కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ మీరు మీ వివాహానికి ముందు వదిలిపెట్టిన, పట్టించుకోని ఏదైనా విషయం మూలకారణం కావచ్చు. కొన్ని సూచనలు, సంకేతాలు మీకు పంపి ఉండవచ్చు, కానీ మీరు ప్రేమలో గుడ్డివారయ్యారు కాబట్టి ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. జంటలను ఇలాంటి విషమ పరిస్థితులలోకి నెట్టే కొన్ని సాధారణ కారణాలను చూద్దాం.

ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా మీకు వేర్వేరు ఆలోచనలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉండవచ్చు, పెళ్ళయ్యాక అవన్నీ మారాలని లేదు. ప్రేమికులుగా వున్నప్పుడు మీరు వారిని, వారి విధానాలను అంగీకరించ కలిగినప్పుడు పెళ్ళయ్యాక ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఇలాంటి మార్పులను స్వీకరించలేక పోయినప్పుడే పరిస్థితులు గాడి తప్పుతాయి. ఒక బంధం విచ్చిన్నం అవడం ప్రారంభం అవుతుంది.

ఒక విషయం మరో దానికి దారి తీస్తుంది, పైగా మీ ఇద్దరూ సఖ్యంగా లేరని మీకు తెలుసు. ప్రతి బంధంలోనూ అర్ధం చేసుకోవడం అనేది అవసరమే, అపోహలు మొదలయ్యాక మీ భాగస్వామి గురించి అన్నీ తప్పుగానే కనపడతాయి. అపోహల వల్ల అపార్ధాలు వచ్చి బంధం బీటలు వారడం మొదలు పెడుతుంది.

ఒక జంట మధ్య మంచి అవగాహన ఉండాలంటే సమాచార వినిమయం చాలా కీలకం. సగానికి పైగా వివాహాలు సమాచార వినిమయం లేకపోవడం వల్లనే విచ్చిన్నమౌతాయి. వివాదాలను, అభిప్రాయ భేదాలను పరిష్కరించుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పరిష్కారం కాని చిన్న విషయాలే భాగస్వాములు మాట్లాడుకోక పోవడం వల్ల తరువాత పరిష్కరించలేని పెద్ద సమస్యలుగా మారిపోతాయి. దంపతులు ఇద్దరూ కూర్చుని, మాట్లాడుకుని, చర్చించుకుని, అవతలి వారి కళలు, భావనలు, ఆకాంక్షలు, కోరికలు, పరస్పరం వుండే ప్రేమల గురించి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చుకోవాలి.

పిల్లలు - తల్లిదండ్రులు, గురుశిష్యులు, భార్యా భర్తలు, ఎలాంటి బంధం లోనైనా నమ్మకం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. మీరు దాన్ని నింపాదిగా అలవరచుకుని, పెంచి పోషించుకోవాలి. జంటల మధ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు వెంటనే వాటిని పరిష్కరించుకోవాలి, ఆలస్యమైతే అసంతృప్తికి దారి తీసి నమ్మకం కోల్పోతారు. నమ్మకం పొతే అన్నీ పోయినట్టే, ఇక ఆ బంధంలో ఏమీ మిగిలినట్టే కాదు.

ఒక జంటగా మీరు పరస్పరం అనుకూలంగా వుండాలి. అసంబద్ధమైన భావాలు, అభిప్రాయాలు, విశ్వాసలేమి, కృతఘ్నత లాంటి వాటి వల్ల అనుకూలత పోతుంది. లియో టాల్స్టాయ్ అన్నట్టుగా "మీరు ఎంత అనుకూలంగా వున్నారనే దాని వల్ల కాక, అననుకూలత వున్నప్పుడు మీరు ఎలా వ్యవహరిస్తున్నారు అనే దాన్ని బట్టి వివాహాలు ఆనంద బంధాలు అవుతాయి"

పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయమౌతాయంటారు, కానీ అవి విజయవంతం అయ్యేలా మనం ఇక్కడ చూసుకోవాలి. కేవలం మూడు ‘ఎఫ్' లను గుర్తుంచుకుంటే పెళ్ళిళ్ళు విజయవంతం అవుతాయి.
ఫ్రెండ్ షిప్ - స్నేహం
ఫ్రీడం - స్వేచ్చ
ఫర్ గివ్ నెస్ - క్షమించడం
మీరు ఒకరి కోసం ఒకరున్నారు కనుక స్నేహంగా వుండండి, స్వేచ్చ ఇవ్వండి, అలాగే ఒక్కోసారి క్షమించుకోండి. ఏ బంధం అయినా పని చేయాలంటే దాని నుంచి మరీ అతిగా అపేక్ష వుండకూడదు. మీరు ఆశించిన దానికన్నా మీరే ఎక్కువ ఇవ్వగలిగితే మీరు ఎప్పుడూ సంతోషంగానే వుంటారు.



Click it and Unblock the Notifications