For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యదగ్గర ప్రస్తావించకూడని కొన్ని అంశాలు

By Super
|

భార్య భర్తల మధ్య ఉన్న బంధం పటిష్టంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు ఇరువైపులా నుండీ తీసుకోవాలి. అటువంటి వాటిలో భర్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైనవి. ప్రేమగా చూసుకుంటున్న భార్యని బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు. భార్యదగ్గర ప్రస్తావించకూడని కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వు డైటింగ్ చెయ్యాలి

నువ్వు డైటింగ్ చెయ్యాలి

ఇంటినీ, మిమ్మల్నీ చక్కదిద్దడంలో మునిగిపోవడం వల్ల ఆమె తన గురించి శ్రద్ద తక్కువ తీసుకోవడం సహజం. అటువంటప్పుడు, మీరు ఆమె మీ కోసం పడే తపనని పొగడాలి కానీ నువ్వు డైటింగ్ చెయ్యాలి వంటి మాటలు మాట్లాడకూడదు. వీలయితే ఆమెకు కావలసిన వాటి గురించి మీరు స్వయంగా తెలుసుకుని తగిన విధంగా మరల్చుకోండి

నేను పనిచేసెంత సమయం నువ్వు పనిచేయ్యవెందుకు?

నేను పనిచేసెంత సమయం నువ్వు పనిచేయ్యవెందుకు?

అవును, ఇది నిజమే. భార్యా భర్తల మధ్య పనులకు సంబంధించిన సంభాషణ వచ్చినప్పుడు భర్త నోటి వెంట నుండి మొట్ట మొదటిగా వచ్చే వాఖ్యం "నేను చాలా కష్టపడుతున్నాను. నువ్వు నా అంత సేపు పనిచేయ్యవెందుకు" అనే మాట. ఒక వేళ ఆమె కనుక తన బాధ్యతని విస్మరిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా తయారవుతుందో ఉహించడం కష్టం.

ఆఫీసు విషయాలు మాట్లాడవద్దు

ఆఫీసు విషయాలు మాట్లాడవద్దు

మీ ఆఫీసు లో ని గాసిప్స్ గురించి వినడానికి మీ భార్య ఆసక్తి కనబరచదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు సమస్యలని వినాలని తను కోరుకోదు.

ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది

ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది

పరాయి ఆడవాళ్ళ గురించి తన భర్త పొగడడం ఏ భార్యకీ నచ్చదు. అన్యోన్యమైన దాంపత్యం లో పాటించదగిన ముఖ్య విషయం ఇది. భర్త ఎప్పుడూ భార్య ముందు పరాయి స్త్రీ అందం గురించి పొగడకూడదు.

నాకు మాట్లాడాలని లేదు

నాకు మాట్లాడాలని లేదు

"నాకు మాట్లాడాలని లేదు" అనే ఒక్క వాఖ్యం భార్యా భర్తల సంబంధం లో ని ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఇలా అనే బదులు అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలని చక్కగా మాట్లాడుకుని సర్దుకుపోవాలి.

మానసికంగా ఇబ్బందిని కలుగచేస్తున్నావు.

మానసికంగా ఇబ్బందిని కలుగచేస్తున్నావు.

ఈ మాటని వాడడం మానుకోండి. ఇటువంటి మాట భార్య చెవిలో పడితే కనీసం అప్పటి వరకు ఉన్న ప్రశాంతత కూడా ఉండదు. ఆమెని బాధపెట్టే వాఖ్యలు చెయ్యడం మానేసి ఆమెని మార్చుకునే మాటలు వాడండి. మాటే మంత్రము అనే విషయాన్నీ జ్ఞప్తికి తెచ్చుకోండి.

మళ్ళీ షాపింగ్ కి ఎందుకు

మళ్ళీ షాపింగ్ కి ఎందుకు

మీకు నచ్చదని ఆమెకి తెలుసు. కాని ఆమెకి నచ్చిన విషయాలను మీరు కొట్టిపారేయకూడదు. ఆమెకి షాపింగ్ చెయ్యడం ఇష్టమైతే తీసుకువెళ్ళండి. లేకపోతె, తెలివిగా వ్యవహరించి షాపింగ్ మానిపించండి.

నీకు సరిపోయే దుస్తులు నువ్వు వేసుకోవట్లేదు

నీకు సరిపోయే దుస్తులు నువ్వు వేసుకోవట్లేదు

ఆమెకి నప్పేవి మీరే ఎంచి సహకరించండి. అంతే కానీ, ఆమె ఛాయస్ తప్పు అని ఆమెకి నప్పట్లేదని అనకూడదు. ఇలా అనడం వల్ల అనవసరంగా ఇరువురి మధ్య గొడవలు మొదలవుతాయి.

నువ్వు చాలా బాడ్ మూడ్ లో ఉన్నట్టున్నావు

నువ్వు చాలా బాడ్ మూడ్ లో ఉన్నట్టున్నావు

ఈ వాఖ్యాన్ని ఆయుధంగా ప్రదర్శిచడం తెలివైన విషయం అని భావిస్తే మీరు ఖచ్చితంగా తెలివి తక్కువ వాళ్ళు. ఇది చాలా అవమానకరమైన మాట. మీ భార్య తో ఈ మాట ని అనకూడదు. ఆమె బాడ్ మూడ్ లో ఉంటే ఆమెని మంచి మూడ్ లో కి మార్చాలి.

నువ్వు మీ అమ్మలా ప్రవర్తిస్తున్నావు

నువ్వు మీ అమ్మలా ప్రవర్తిస్తున్నావు

ఏ భార్యా తనని వేరే ఇతర స్త్రీలతో పోల్చాలని అనుకోదు. ప్రత్యేకించి తన అమ్మతో. ఎందుకంటే, ఈ మాట అనడం ద్వారా మీరు మీ భార్య నీ కాకుండా తన అమ్మగారిని కూడా అవమానపరుస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి అన్యోన్యమైన దాంపత్యం కోసం ఇటువంటి మాటలని పదే పదే ప్రయోగించకూడదు.

వివాహం అనేది ఇద్దరు వేరు వేరు వ్యక్తుల కలయిక. వారిద్దరూ ఒకరిని ఒకరుగా అంగీకరించినప్పుడే సంసారం కలకాలం సుఖంగా సాగుతుంది.

English summary

10 Things You Should Never Say to Your Wife

But if we had to had to bribe the pundit to read out the top 10 commandments of what a husband must never mention to his wife instead of wedding vows, this is what it would look like.
Desktop Bottom Promotion