Latest Updates
-
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.! -
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు! -
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త! - శుక్రవారం, 19 జూన్ 2026 -
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో
మీ గర్ల్ ఫ్రెండ్ తన సెల్ ఫోన్ తాకనీయకపోవడానికి గల 10 కారణాలు
ఫోన్లు ఇప్పుడు మన జీవితంలో సహజ అవయవాలలా అయిపోయాయి, అందువల్లే జనం మునుపటికన్నా ఎక్కువ బలవంతంగా తమ ఫోన్లను కాపాడుకుంటున్నారు. అయితే, మీరు ఒక బంధంలో వున్నప్పుడు ఆ తెరలు తొలగుతాయని మీరు భావించవచ్చు. అలా ఏమీ లేదండీ! ఆమె మిమ్మల్ని మోసం చేస్తోందని కూడా కాదు, మీ గర్ల్ ఫ్రెండ్ తన ఫోన్ మిమ్మల్ని తాకకుండా ఎందుకు వుంచుకోవాలనుకు౦టో౦దో మీకు అర్ధం కాకపొతే, ఇదిగో మేం ఒక అయిడియా ఇస్తున్నాం.

గమనిస్తున్నారన్న భావన
ఆమె ఫోన్ లో మీకు చూపించకూడదు అనుకునేవీ ఏమీ లేకపోయినా, అలా చూపించకుండా వుండడడానికి ప్రధాన కారణం మీరు తనను గమనిస్తున్నారు అన్న భావన, నమ్మకం గురించిన చింత, తప్ప నిజంగా చూపించకూడనివి ఉండడం వల్ల కాదు. నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య అంత సన్నటి అంతరం లేదు కానీ, మీరు ఆమె పాస్ వర్డ్ అడుగుతుంటే మాత్రం ఆమె అలానే భావించవచ్చు. ఆమె నొచ్చుకోవచ్చు, మీరు మరీ నస పెడుతున్నట్టుగా అనిపించవచ్చు.

రహస్య భావన
ఇది అమ్మాయిలూ అందరికీ వర్తించదు. కానీ చాలా మంది తమ గురించి మీరు తెలుసుకొవాలనుకు౦టే మిమ్మల్ని అలా ఊహలకే వదిలేస్తారు, అదీ మీరు ఈ మధ్యనే డేటింగ్ మొదలు పెట్టినట్లయితే. మీ దగ్గర లేని వస్తువులు మీరు కోరుకుంటారని వాళ్లకి బాగా తెలుసు అందుకని వాళ్ళ ఫోన్ కూడా మీరు కోరుకునే వాటిలో వుండాలని వాళ్ళు అనుకుంటారు.

బి ఎఫ్ ఎఫ్ కబుర్లు
మీరు మీ స్నేహితులతో కుర్రకారు కబుర్లు చెప్తుండగా హఠాత్తుగా ఆమె వస్తే మీకు ఎలా ఉంటు౦ది. కథ అడ్డం తిరుగుతుంది - సరిగ్గా అలాగే మీరు ఆమె బి బి ఎం లేక తన బి ఎఫ్ ఎఫ్ లతో వాట్స్ యాప్ చాట్ లో మాట్లాడుతోంటే మీరు వెళ్ళినా అదే జరుగుతుంది. పి ఎం ఎస్ నుంచి చాకొలేట్ వరకు అదంతా ఆడవాళ్ళ రాజ్యం, మీరు ఆ పరిసరాల్లోకి వెళ్ళడం కూడా ఆమెకు నచ్చదు.

అమాయకపు మాటలు
చాలా చిన్న విషయాల్లో కూడా మీరు ఎంత పట్టి౦పుగా వుంటారు అనే ఉద్దేశ్యంతో కూడా చాలా మంది ఆడపిల్లలు తమ ఫోన్ ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పాత ఆఫీస్ కొలీగ్ ఫోన్ చేస్తే "వీడు ఎవరు" లాంటి చిన్న విషయం మీద గొడవ పడాల్సి వస్తుందన్న భయంతో కొందరు ఆడపిల్లలు తమ ఫోన్ లు కాపాడుకుంటారు. అవి ఎంత అమాయకపు మాటలో మీరు నిర్ణయించుకోవాలి.

అంతగా బాలేని ఫోటోలు
ఫోటోలలో అందంగా వుండడం అటుంచి, అస్సలు బాలేనివి కూడా ఉంటుంటాయి. అలా౦టి ఫోటోలు ఎవరూ ఎవరికీ చూపించాలనుకోరు, అందులోనూ తన భాగస్వామికి, అయితే అంత బాలేని ఫోటోలు ఇంకా డిలీట్ చేయడం కుదిరి ఉండకపోవచ్చు. మీరు ఆమెకు చాలా ముఖ్యమైన వారు కనుక అలాంటి ఫోటోలు చూపించకుండా మీకు మేలే చేస్తోందేమో.

హాకింగ్
గత అనుభవాల వల్ల గానీ, కొన్ని నమ్మకాల వల్ల గానీ - తమ బాయ్ ఫ్రెండ్స్ తమ ఫోన్లను హాక్ చేస్తారేమోనని భయపడే వాళ్ళు కూడా వుంటారు. ఇలాంటి పనులు మీరు చేస్తారని కాదుకానీ, ఆమె చేయగలదేమో.

ఫోన్ దుర్వినియోగం చేయడం
స్నేహితుల సామాజిక మాధ్యమ ఖాతాలను పొరపాటున అందుకునే వీలుంటే "నేను గే నని' రాసే జోకర్లు చాలా మంది వున్నారు. అది మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కు చేయకపోవచ్చు, కానీ విషయం అర్ధం అయిందిగా. మీరు అలాంటి జోకర్లలో ఒకరైతే, ఆమె ఫోన్ తెరిచి వున్నప్పుడు మీరు పెట్టిన మంట ఆర్పడానికి ఆమె తంటాలు పడుతోందని మీరు నిందించడానికి లేదు.

వ్యక్తిగత వివరాలు షేర్ చేయడం సాధ్యం కాదు
తన బాంక్ ఖాతా వివరాలు, ముఖ్యమైన పాస్ వర్డ్ లు లాంటివి ఆమె ఫోన్ లో ఎవరికీ చూపద్దు అనుకునేవి చాలా ఉండవచ్చు. తప్పేమీ లేదు. ప్రత్యేకంగా మీకు చూపోద్దని కాదు, కానీ ఇంకా మీరు బంధంలోకి వెళ్ళారో లేదో తేల్చుకోండి.

మీ గురించి మాట్లాడటం
అవును అలా కూడా జరుగుతుంది. ఆమె మిమ్మల్ని ఇష్ట పడట్లేదో లేక విడి పోవాలనుకు౦టో౦దో కాదు, కానీ మనం ఆడవాళ్ళ రాజ్యం గురించి పైన మూడో పాయింట్ లో మాట్లాడుకున్నది గుర్తుందిగా. అమ్మాయిలంతా తమ స్నేహితులతో "నిజానికి మగవాళ్ళు ఎంత మాయగాళ్లో" అంటూ మాట్లాడుకునే చోటది. ఈ వారంలో మీరు ఆమెను ఎలా విసిగించిందీ కూడా ఆమె అక్కడే మాట్లాడి ఉండవచ్చు.

మీకు ఇష్టం లేని వారితో మాట్లాడుతూ ఉండవచ్చు
మీ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ వుంటే, మీకు పెద్దగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండవచ్చు వాళ్ళలో. కానీ ఆమే వాళ్ళని మంచి వాళ్ళనే అనుకోవచ్చు. మీకు కొంత బాధ తగ్గించడానికి, అలాగే అనవసరమైన డ్రామా లేకుండా ఉండడానికి, మీరు ఆమె ఫోన్ జోలికి పోకూడదు అని అనుకోవచ్చు.



Click it and Unblock the Notifications