For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Valentine Week 2022: తొలిముద్దు జీవితాంతం గుర్తుండిపోతుందని తెలుసా...

ముద్దు ముద్దుకో మీనింగ్ : వాలెంటైన్స్ డే స్పెషల్

|

'పెదవికి పెదవి రాసే ప్రేమలేఖ ముద్దు' అన్నాడో కవి. నిజమే కావచ్చు. ఎందుకంటే... చుంబనం అనేది ఓ భావ వ్యక్తీకరణ. తల్లి బిడ్డకు, ప్రేమికుడు ప్రేయసికి, భర్త భార్యకి... తమ మనసును, ప్రేమను తెలిపేందుకు ఉపయోగించే చక్కని సాధనం ముద్దు. ఇష్టం, ప్రేమ, ఆరాధన, అనురాగం, అనునయం, ఓదార్పు, పలకరింపు.. ఏ భావాన్నైనా అందంగా ప్రకటించగల శక్తి ఉంది దీనికి!

Different Types of Kisses and Their Meanings

విదేశాల్లో ముద్దుకు దాపరికం ఉండదు. ఏటా వాలెంటైన్ వీక్‌లోని ఆరో రోజైన 'కిస్ డే' నాడయితే.. ప్రేమికులు వీధుల్లో గుంపులుగా చేరి చుంబించుకునే దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. అయితే మనకు ముద్దు అనేది వ్యక్తిగత వ్యవహారం. తల్లిదండ్రులు పిల్లలను ముద్దాడే సన్నివేశాలు సైతం తక్కువగానే కళ్లబడుతుంటాయి మనకి. ఇక ప్రేమికులు, భార్యాభర్తల చుంబనం పూర్తి రహస్యం. మన సంస్కృతి మనకు నేర్పిన క్రమశిక్షణ అది.


ముత్యమంతా ముద్దు..

ప్రేమంటూ కలిగాక.. దానికి అవతలి వ్యక్తి అంగీకారం లభించాక.. అది మనసును అసలు కుదురుగా ఉండనివ్వదు. తనకు మరింత చేరువ కావాలని, తను మీకే సొంతం అన్న నమ్మకాన్ని పొందాలని ప్రతి క్షణం ఉవ్విళ్లూరుతుంటుంది. ఆ నమ్మకం కలగడానికి ఓ తీయని ముద్దు తప్పకుండా సహకరిస్తుంది. మనసులు ముడిపడిన తర్వాత, మనుషులను మరింత చేరువ చేయడంలో ముద్దుది పెద్ద పాత్రే. ఒకరికొకరు సొంతమన్న భరోసానూ కలిగిస్తుంది. అందుకే మీ ప్రేమపై ముద్దు ముద్ర వేయడంలో తప్పు లేదు. ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేసే ప్రదేశానికో, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే జలపాతాల చెంతకో తనను తీసుకెళ్లండి. అలాంటి ప్రదేశాలకు మన సిటీలో కొదవేమీ లేదు కదా! ఓ మంచి చోటును సెలెక్ట్ చేసుకోండి. అక్కడికి తీసుకెళ్లి కాసేపు మనసు విప్పి మాట్లాడండి. ఇష్టాలు తెలుసుకోండి. అభిప్రాయాలను పంచుకోండి. చివరిగా ఓ చిన్న ముద్దుతో ముగింపు పలకండి. కానీ ఒక్క విషయం.. తనకి అభ్యంతరం లేకపోతేనే ప్రొసీడ్ అవ్వండి. తొలిముద్దు జీవితాంతం గుర్తుండే తీయని జ్ఞాపకం కావాలి తప్ప.. అనుబంధాన్ని ఆదిలోనే తుంచేసే ఆయుధంగా మారకూడదు.

ముద్దు ముద్దుకో మీనింగ్

ఎయిర్ కిస్

ఎయిర్ కిస్

దీన్నే ఫ్లయింగ్ కిస్ అనీ అంటుంటారు. కాస్త దూరంలో ఉన్న వారికి పలకరింపుగా గానీ, సెండాఫ్ ఇస్తున్నట్టుగా గానీ ఈ ముద్దును ఇస్తారు.

ఫోర్‌హెడ్ కిస్

ఫోర్‌హెడ్ కిస్

నుదుటి మీద పెట్టే ఈ ముద్దు స్నేహానికి, ప్రేమకు ప్రతీక.

హ్యాండ్ కిస్

హ్యాండ్ కిస్

ఇది పలకరింపు ముద్దు. ఒక వ్యక్తిని కలసినప్పుడు వారి చేతిని అందుకుని, వెనక్కి తిప్పి ముద్దు పెడితే.. వారిపై మీ గౌరవాన్ని, భక్తిని, అభిమానాన్నీ చాటుతున్నట్లు అర్థం.

చీక్ కిస్

చీక్ కిస్

మరీ కొత్తవారిని కాకుండా, బాగా పరిచయం ఉన్న వారిని, అభిమానించేవారిని చెంపలపై ముద్దాడుతాం కదా..! అదే చీక్ కిస్.

ఎస్కిమో కిస్

ఎస్కిమో కిస్

మీ ముక్కును తన ముక్కుకి రాసి, తర్వాత ముక్కును చుంబిస్తే అది ముద్దుగా పెట్టే ముద్దు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ముద్దాడుతారు.

ఏంజిల్ కిస్

ఏంజిల్ కిస్

మూసి ఉన్న కనుపాపలపై పెట్టే ముద్దు ఇది. నిద్ర లేచిన వెంటనే గానీ, సెండాఫ్ ఇచ్చేటప్పుడు గానీ ఇలా ముద్దాడుతుంటారు.

ఫ్రెంచ్ కిస్

ఫ్రెంచ్ కిస్

ఇది మోస్ట్ రొమాంటిక్ ముద్దు. చాలా పాపులర్ కూడా. అధరాలపై చేసే ఈ గాఢ చుంబనం ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అనురాగానికి గుర్తు.

సింగిల్ లిప్ కిస్

సింగిల్ లిప్ కిస్

కేవలం ముని పెదాలను మాత్రమే కిచ్ చేయడం సింగిల్ లిప్ కిస్. ప్రేమికులకు ఈ కిస్ ప్రేమకు గుర్తు.

ఇయర్ లోబ్ కిస్

ఇయర్ లోబ్ కిస్

ఇయర్ లోబ్ కిస్ మనస్సుల్సి, మరింత దగ్గరగా చేర్చే ముద్దు. ఇది ఒక ప్రసిద్ది చెందిన రొమాంటిక్ కిస్ . చెవి చివరి భాగంలో నాలుకతో లేదా పెదాలను ఒక సున్నితమైన ముద్దును ఇవ్వడం .

బటర్ ఫ్లై కిస్

బటర్ ఫ్లై కిస్

ఎప్పుడైతే మీ పాట్నర్ కు మరింత చేరువ అవుతారో అప్పుడు, శారీరకంగా, మానసికంగా ఫేస్ టు ఫేస్ ఇచ్చే ముందే బటర్ ఫ్లై ముద్దు. ఇది వారి యొక్క సంబంధాన్ని బలపరుస్తుంది అని తెలియజేస్తుంది.

స్పైడర్ మెన్ కిస్

స్పైడర్ మెన్ కిస్

సూపర్ హీరోలా అప్ సైడ్ డౌన్ భంగిమలో(ఇలాంటివి సినిమాల్లో ఎక్కువ చూపిస్తుంటారు) ఆమెకు లేదా అతనికి కిస్ చేయడం.

లాంగ్ కిస్

లాంగ్ కిస్

ఇది లిప్ టు లిప్ కిస్. లాంగ్ కిస్ ఎక్కువ సమయం మరియు బావోధ్వేగంతో అదర చుంభనం చేయడమే లాంగ్ కిస్.

బుగ్గ మీద ముద్దు

బుగ్గ మీద ముద్దు

బుగ్గ మీద ముద్దు ఫ్రెండ్లీగా, మర్యాధపూర్వకంగా మరియు పూజ్యనీయమైన విధంగా అర్ధం వచ్చే కిస్ ఇది. ఎవరైనా, వారికి నచ్చిన వారికి కాస్త దూరంగా అంటే బుగ్గలకు లోతుగా నొక్కకుండా పైపైన ఇచ్చి ముద్దు అని దీని అర్ధం.

లిప్ గ్లాస్ కిస్

లిప్ గ్లాస్ కిస్

ఇది ఒక తమాషా ముందు మరియు హాని కలిగించని ముద్దు. ఎందుకంటే పార్ట్నర్స్ పెదాల మీద లిప్ గ్లాస్ లేదా లిప్ స్టిక్ ఉన్నప్పుడు ముద్దు ఇచ్చే వారికి అంటుకోకుండా ఇచ్చే ముద్దే లిప్ గ్లాస్ ముద్దు.

సీక్రెట్ మెసేజ్ కిస్

సీక్రెట్ మెసేజ్ కిస్

సీక్రెట్ మెసేజ్ కిస్ చాలా దగ్గరి సంబంధం కల వారి మద్య లేదా ప్రేమికుల మద్య జరిగే ఒక ఏరిటిక్ మసాజ్ లేదా సీక్రెట్ సాన్స్ కిస్ ఇది.

లిజ్జి కిస్

లిజ్జి కిస్

దీన్నె లిజార్డ్స్ కిస్ అనికూడా పిలుస్తారు. ఎందుకంటే నాలుక నోటిలోపల మరియు బయట స్టిక్కీగా ఉంటుంది. ఇది పార్ట్నర్ కు ఇచ్చే ఒక మదురమైన కిస్.

బైట్ కిస్

బైట్ కిస్

మెడ దగ్గర చేత్తో దగ్గరికి తీసుకొని గాఢంగా ఇచ్చే ముద్దు ఇది.

కిస్ ఆన్ నెక్

కిస్ ఆన్ నెక్

ఇద్దరి మద్య సాన్నిహిత్యం, కామోద్రేకం మరియు మరికొన్ని చిహ్నాలకు గానే ఇచ్చే ముద్దే మెడ మీద ముద్దు.

వాంపైర్ ముద్దు

వాంపైర్ ముద్దు

ఆమె లేదా అతని డీప్ నెక్ మీద చుంబించడం లేదా కొరకడం. దీన్నే వాంపైర్ ముందు అంటారు.

జాలైన్ కిస్

జాలైన్ కిస్

ఎవరైతే చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటారో అలాంటి వారి మద్య ఇచ్చే కిస్ జాలైన్ (దవడ)వద్ద ఇచ్చే కిస్ ఇది.

ఇంకా టీస్ కిస్, ఎయిర్ కిస్ అంటూ చాలా రకాలున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రేమయాత్రను ప్రారంభించిన వారు హ్యాండ్ కిస్‌తోనో, ఫోర్‌హెడ్ కిస్‌తోనో మొదలుపెడితే బెటర్. బంధం బలపడేవరకూ ఫ్రెంచ్ కిస్ జోలికి వెళ్లొద్దు. మొదటికే మోసం రావచ్చు!

English summary

Top 20 Different Types of Kisses and Their Meanings

20 Different Types of Kisses and Their Meanings: Have you been kissed in your relationship and wondered what that kiss meant? Kissing is one of the most beautiful ways to express your love for the other person, especially if you have taken the relationship to another level. Kissing on the lips is not everyone's cup of tea. But there are various other kisses which one loves to receive when in a relationship.
Desktop Bottom Promotion