ఈ జానకి అప్పుడు అలా చేసింది కాబట్టే ఇప్పుడిలా గవర్నమెంట్ జాబ్ లోకి వచ్చింది - My Story #40

Written By:
Subscribe to Boldsky

ఆమె పేరు జానకి. 2012లో ప్రొద్దుటూర్ లోని ఒక కళాశాలలో కంప్యూటర్ సైన్సు లో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పీజీ చదువుదామనుకుంది. అయితే ఆమెపై వచ్చిన వివక్షతో చదువు మానేసింది. కానీ పట్టుదలతో బీఈడీ చదివింది. ఇంట్లో కూడా ఆమెపై ఒత్తిడిపెరగడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. సమాజానికి దూరంగా వెళ్లిపోయింది. అసలు ఎవరు ఈ జానకి.. ఆమె కథ ఏమిటో మీరూ తెలుసుకోండి.

శివ నుంచి జానకిగా

శివ నుంచి జానకిగా

ఒకప్పుడు ఆమె పేరు శివ. కానీ ఇప్పుడు పేరు మారింది. ఇప్పుడు ఆమె పేరు జానకి. ప్రస్తుతం ఆమె కడప జిల్లా, చెన్నూరులో హౌసింగ్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఆఫీస్‌లో ఈమె ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గా పని చేస్తుంది.

అబ్బాయి అనుకున్నారు

అబ్బాయి అనుకున్నారు

ఆమె పుట్టినప్పుడు ఆమెను ఇంట్లో వాళ్లు అబ్బాయి అనుకున్నారు. అయితే ఆమె పెరుగుతున్న కొద్దీ అబ్బాయి లక్షణాలు రాకుండా అమ్మాయి లక్షణాలు వచ్చాయి. ఈ విషయం ఆమెకు తెలుస్తూనే ఉండేది.

చదువులో ఫస్ట్

చదువులో ఫస్ట్

ఆమెది కర్నూలు జిల్లా చాగలమర్రి. ఇంటర్‌ వరకు చాగలమర్రిలోనే చదువుకున్నారు. చదువులో ఫస్ట్. ప్రొద్దుటూరు కాలేజ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ చేసింది. తర్వాత బీఈడీ చేయాలనుకుంది.

దాడిని తట్టుకోలేకపోయింది

దాడిని తట్టుకోలేకపోయింది

అయితే అప్పటికే తన జెండర్‌ పైవస్తున్న సామాజిక ఒత్తిడిని తట్టుకోవడం ఆమెకు కష్టమైంది. బీఈడీలో సీటు వచ్చింది. ఇంటి దగ్గరే ఉండి చదువుకుని బీఈడీ పూర్తి చేసింది. ఆమె జీవితంలోని ఇంకొన్ని విషయాలు ఆమె మాటల్లోనే..

తరగతిలో అలా చేసేదాన్ని

తరగతిలో అలా చేసేదాన్ని

నన్ను అందరూ అబ్బాయి అనకునేవారు. కానీ నాలో మాత్రం అన్నీ ఆడవారి లక్షణాలుండేవి. నేను క్లాసులో అబ్బాయిలతో కలసి కూర్చునే దాన్ని కాదు. అమ్మాయిలతో కలిసి భోజనం చేసిదాన్ని. వారితోనే ఉండేదాన్ని.

చీర కట్టుకోవాలని ఉండేది

చీర కట్టుకోవాలని ఉండేది

నేను డిగ్రీలో చేరిన తర్వాత నాకు చీరకట్టుకోవాలనే కోరిక ఏర్పడింది. అమ్మకు చెబితే అమ్మ షాక్ అయ్యింది. ఆమె ఏడ్చింది. కానీ నాలో వచ్చిన మార్పులు నన్ను నిలవనివ్వలేదు. డిగ్రీ చివరి సంవత్సరం తర్వాత స్కాలర్‌షిప్‌ డబ్బుతో ఇల్లు వదిలి వెళ్లిపోయాను.

డాక్టర్లు చెప్పారు

డాక్టర్లు చెప్పారు

నేను డాక్టర్‌ దగ్గరకెళ్తే వారు పరీక్షించి నేను మగ కాదనే విషయం తేల్చారు. నేను విషయం ఇంట్లో చెబితే మా అన్న నన్నుకొట్టారు. నేను ఇల్లు వదిలి కొన్నాళ్లు ఆలయంలో తలదాచుకున్నాను.అయితే కడపలో నేను ఒక పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు అక్కడ నాలాంటి చాలామంది కనిపించారు. వాళ్లు గుర్తొచ్చి వాళ్లను కలిశాను.

వాళ్లతో జీవించడానికి ఓకే అన్నారు

వాళ్లతో జీవించడానికి ఓకే అన్నారు

నన్ను వాళ్లతో కలసి జీవించడానికి ఓకే అన్నారు. వాళ్లతోనే ఉంటూ స్త్రీలాగానే మారిపోయాను. జానకి అని పేరు మార్చుకున్నాను. నాకు సింగర్ జానకి అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె పేరును పెట్టుకున్నాను.

అదే టర్నింగ్

అదే టర్నింగ్

ఆధార్‌ కార్డు, ఓటర్‌ లిస్టుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ కోసం కలెక్టర్‌ ఆఫీస్‌లో క్యాంప్‌ పెట్టి పిలిపించారు. అప్పుడు కలెక్టర్‌సార్ మాతో చాలా సేపు మాట్లాడారు. మాకు ఎదురయ్యే కష్టాలన్నీ చెప్పాం. అప్పుడు ఏం చదువుకున్నావని అడిగి, ఉద్యోగానికి అప్లయ్‌ చెయ్యమన్నారు. డిసెంబర్‌ పదవ తేదీన ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చాలా బాగుంది.

మంచి వాళ్లు

మంచి వాళ్లు

ఆఫీసర్లు, తోటి ఉద్యోగులు అందరూ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే సమాజం కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మాలాంటి వాళ్లను ఇంట్లో ఉండనిస్తే ఉద్యోగాలు, చేతనైన పనులు చేసుకుంటూ సామాజిక దాడుల బారిన పడకుండా గౌరవంగా జీవించగలుగుతాం.

సీఎంను కూడా మీట్ అయ్యాను

సీఎంను కూడా మీట్ అయ్యాను

కొన్ని రోజుల క్రితం నేను సీఎంను కూడా మీట్ అయ్యాను. అది నా అదృష్టం. నాకు ఉద్యోగం కల్పించిన అందరికీ నేను రుణపడి ఉన్నాను. నాకు నెలకు రూ. 15000 జీతం ఫిక్స్ చేశారు. నాకు అండగా నిలిచిన అందరికీ థ్యాంక్స్.

English summary

meet andhras first transgender govt employee

meet andhras first transgender govt employee