ఒక వ్యక్తి మీతో దీర్ఘకాలిక సంబంధం కోరుకోవడం లేదని తెలిపే సంకేతాలు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

కొంతమంది మగవాళ్లు ప్రారంభ సమావేశాలలో ఆకర్షణీయంగా కనిపిస్తారు కానీ కొంత కాలం గడిచాక రిలేషన్షిప్ విషయంలో ఘోరంగా ఓడిపోతారు. అలాగే కొంతమంది మగవాళ్లు మొదట కొన్ని సమావేశాల్లో ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో వారు బాగానే ఉంటారు.

ఎలాంటి మగవాళ్లు దీర్ఘకాలం రిలేషన్షిప్ లో ఉండలేరో, ఎలాంటి మగవాళ్ళు మీ అంచనాలకు తగ్గట్లుగా ఉండరో అనే విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే - మీ సహచరుడిని కనుగొనడం చాలా సులభంగా అవుతుంది.

బాయ్స్ కు గర్ల్ ఫ్రెండ్స్ కన్నా ఆంటీలంటేనే ఇష్టమట..ఎందుకో తెలుసా?

ఒక వ్యక్తి మీతో సుదీర్ఘమైన సంబంధాలు (లేదా) వివాహ సంబంధాన్ని కొనసాగించలేరు అని తెలియజెప్పేందుకు కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.

ఆయన వాగ్దానాలు నెరవేర్చడు :

ఆయన వాగ్దానాలు నెరవేర్చడు :

అతను వాగ్దానాలు చేసినట్లయితే, వాటిని అతను నెరవేరుస్తాడని మీరు ఆశిస్తారు. కానీ అతను ఆ వాగ్ధానాలను నెరవేర్చకుండా మిమ్మల్ని నిరాశకు గురిచేస్తారు. ఇలాంటి విషయాలు పదేపదే జరిగినట్లయితే అతను మీ జీవితంలో కొనసాగే పరిస్థితి లేదని అర్థమవుతుంది.

అతను మీ నమ్మకానికి 'భరోసా' ఇవ్వకపోతే :

అతను మీ నమ్మకానికి 'భరోసా' ఇవ్వకపోతే :

నిజమే, ప్రేమకి ఎటువంటి గుర్తింపు అవసరం లేదు,

కానీ జీవితంలో స్థిర పడాలంటే పెళ్లి అనే గుర్తింపు చాలా అవసరం. లేదా కనీసం, అతను మీతో జీవితాంతం కట్టుబడి ఉంటానన్న నమ్మకాన్ని కలిగి ఉన్నారా ?

అలాంటి విషయాల గురించి అతను ఎప్పుడూ మీతో మాట్లాడకపోతే, అతను ఎక్కువ కాలం మీతో కలిసి ఉండడని అర్థం.

కొన్ని విషయాలను అతను దాటవేస్తే :

కొన్ని విషయాలను అతను దాటవేస్తే :

పైపై మాటలు సాన్నిహిత్యాన్ని, అవగాహనను పెంచలేవు. కాబట్టి అతను మీతో హృదయ పూర్వకంగా మాట్లాడకపోతే, అతను ఉండేది మీ కోసం కాదని తెలుస్తుంది.

అతను మిమ్మల్ని ఒక వస్తువుగా పరిగణిస్తే :

అతను మిమ్మల్ని ఒక వస్తువుగా పరిగణిస్తే :

అతను మిమ్మల్ని వస్తువుగా భావించినట్లయితే అతను మిమ్మల్ని ప్రేమించడు. అలాంటి వ్యక్తి, మీ అందం కోసం మాత్రమే ఆసక్తిని కనబరుస్తారు - మీ రూపం ఆకర్షించేదిగా ఉంటే గనుక.

అతను మిమ్మల్ని సమాజంలో గౌరవించడు :

అతను మిమ్మల్ని సమాజంలో గౌరవించడు :

తన స్నేహితుల ముందు చిరాకు చూపించే అలవాటు గాని అతనికి ఉంటే, ఆ సమయంలో మీ మీద తన చిరకుని చుపించినట్లైతే - అలాంటి వారితో మీ మధ్య బందాన్ని ఎక్కువకాలం కొనసాగించేందుకు మంచిదని చెప్పవచ్చు.

అక్రమసంబంధాలు or వివాహేతర సంబంధాలకు 10 అసలు కారణాలు!

అతని జేబును - తనే కాల్చుకున్నట్లయితే :

అతని జేబును - తనే కాల్చుకున్నట్లయితే :

అతను మీ నుండి డబ్బును అప్పుగా తీసుకుంటే, అతను ఆర్థిక ప్రణాళికలో పేదవాడని అర్థమవుతోంది, అలాంటి వారితో మీ జీవితం చాలా ప్రమాదకరమైనది.

అతను వ్యసనాలను ఎక్కువగా ఇష్టపడతే :

అతను వ్యసనాలను ఎక్కువగా ఇష్టపడతే :

మద్యం తీసుకోకుండా అతను వణుకుతున్నట్లైతే, అలాంటి వారితో మీ బందాన్ని ఎక్కువకాలం కొనసాగించాలని ఆలోచించవద్దు. అలా బానిస అయిన వారి గూర్చి మరొక్కసారి ఆలోచించండి.

అతను బద్దకస్తుడు :

అతను బద్దకస్తుడు :

ఇది మనిషిలో అత్యంత ప్రమాదకరమైన లక్షణం.

పనిచెయ్యడానికి, సంపాదించడానికి, ఉత్పాదకతని కలిగి ఉండటానికి ఇష్టపడని అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల మీ జీవితానికి అతను ఏవిధంగానూ దోహదం చేయలేడు.

English summary

Signs He's Not For Long Term Relationships

Some men seem to be appealing in the initial meetings but may fail to pass the test in the long run. Here are some signs which indicate that a man is not
Story first published: Thursday, August 31, 2017, 17:00 [IST]