సంబంధ బాంధవ్యాల్లో కొద్దిగా అసూయ ఉండటం కూడా మంచిదే ఎందుకో తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సంబంధ బాంధవ్యాల్లో అసూయ అనే భావన ఒక కనపడని శత్రువుగా ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచేస్తుంది. అది చివరకు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను తుంచేస్తుంది. తమ భాగస్వామి పై అభద్రతా భావం మరియు వాళ్ళను దక్కించుకోలేనేమో అనే ఆలోచన బలంగా ఉండటం అనేది అసూయ పెరగడానికి మూలకారణం.

ఈ అసూయ అనే భావన పెరగడానికి మరియు వృద్ధి చెందడానికి అస్సలు అవకాశం ఇవ్వకూడదు. ఏ భాగస్వామి అయితే అసూయ చెందుతున్నారో అటువంటి వ్యక్తులు వారి యొక్క మనస్సులో ఉన్న భావాలను తన భాగస్వామికి తెలియజేయాలని భావిస్తారు.

భాగస్వామిలో అసూయని గమనించిన వెంటనే, వారి యొక్క మెదడు నుండి ఆ ఆలోచనలను తీసివేయడానికి మరొక భాగస్వామి కృషి చేయాలి. అలా చేయడం అవసరం. అలా చేయడానికి ఏమి అవసరం అయితే వాటిని ప్రయోగించి అసూయని బయటకు పంపాలి. కానీ, కొన్ని సందర్భాల్లో కొద్దిగా అసూయ ఉండటం వల్ల సంబంధ బాంధవ్యాల మధ్య మంచి జరుగుతుందని, అలా ఉండటం కూడా మంచిదే అని చెబుతున్నారు.

మీ గర్ల్ ఫ్రెండ్ జేలస్(అసూయ)తో ఉందని చెప్పటానికి 5 లక్షణాలు

ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉంటారో సాధారణంగానే వారి మధ్య అసూయ ఏర్పడుతుంది. కానీ, ఈ అసూయను ఎప్పుడైతే తమ భాగస్వామి పై వ్యతిరేక భావనను వ్యక్తపరచడానికి , చెడుచేయడానికి ఉపయోగిస్తారో, అటువంటి సందర్భంలో సంబంధ బాంధవ్యాలు పూర్తిగా సమాధి అయిపోయే అవకాశం ఉంది.

దీనిని గనుక మంచి దిశలో వాడుకున్నట్లైతే అసూయ అనేది సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా మంచిని చేస్తుంది. సంబంధ బాంధవ్యాల పై అసూయ సానుకూల ప్రభావం ఎలా చూపుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

అసూయ అనేది ప్రేమని గుర్తుచేస్తుంది :

అసూయ అనేది ప్రేమని గుర్తుచేస్తుంది :

మీరు గనుక అనూహ్యంగా బాధతో కూడిన అసూయను అనుభవించినట్లు మీకు గనుక గుర్తు ఉంటే లేదా అనుభవిస్తున్న భావనకు లోనవుతూ ఉంటే మీరు మీ భాగస్వామికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని, వాళ్ళు మీకు చాలా ముఖ్యమని అర్ధం.

మీ భాగస్వామిని మరీ ఎక్కువగా ప్రేమిస్తున్నట్లైతే అటువంటి సమయంలో చాలా చిన్న విషయాలు కూడా అసూయకు కారణం అవుతాయి. ఇది గనుక మీకు జరిగినట్లయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే మీరు మీ భాగస్వామి పై నమ్మకం ఉంచండి మరియు మీరు ఎంతైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నారని నమ్మండి.

 మీ ప్రేమ జీవితంలో కోల్పోయిన ఆ వెలుగుని తిరిగి పొందటానికి అసూయ కొద్దిపాటి సహాయం చేస్తుంది :

మీ ప్రేమ జీవితంలో కోల్పోయిన ఆ వెలుగుని తిరిగి పొందటానికి అసూయ కొద్దిపాటి సహాయం చేస్తుంది :

మీరు గనుక మీ భాగస్వామిని వేరొకరితో దగ్గరిగా ఉన్నట్లు గమనిస్తే మీకు తెలియకుండానే మీలో అసూయ మొదలవుతుంది. ఇది మిమ్మల్ని మేల్కొల్పుతుంది. మీరు ఆసక్తిని కోల్పోయిన దాని పై ఆసక్తిని మరలా పెంచుతుంది. విసుగు మరియు నిరుత్సాహంతో ఉన్న మీ సంబంధ బాంధవ్యాల్లో కోల్పోయిన వెలుగుని తిరిగి తీసుకురావడానికి అసూయ ఎంతగానో సహాయపడుతుంది.

ఒక సంబంధంలో అసూయను తొలగించడానికి మార్గాలు

మీ లక్ష్యాలను చేరుకోవడానికి అసూయని ఇంధనంగా వాడుకోండి :

మీ లక్ష్యాలను చేరుకోవడానికి అసూయని ఇంధనంగా వాడుకోండి :

వేరే వ్యక్తులలో ఉన్న లక్షణాలను చూసి మీలో గనుక అసూయ మొదలవుతుందంటే దానర్ధం ఆ గుణాలు మీలో లేకపోయి ఉండాలి మరియు అవి మిమల్ని అభద్రతా భావానికి గురిచేసి ఉండాలి. మీలో ఉన్న అసూయను మీ వ్యక్తిత్వంలో లేని ఆ గుణాలను పెంపొందించుకోవడానికి ఉపయోగించండి. ఆ విధంగా మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోవడం ద్వారా మీలో ఎంతో మార్పు కలుగుతుంది.

మీరు గనుక బరువు తగ్గించుకోవాలని భావించినట్లైతే బాగా శారీరిక వ్యాయామం చేయండి, మీ ఆరోగ్యం పెంపొందించుకోండి. మీరు గనుక బాహ్య సౌందర్యం గురించి అసూయ చెందినట్లైతే ఈ విధంగా ప్రయత్నించి అందుకు తగ్గ ఆకారాన్ని పెంపొందించుకొని మీలో ఆత్మ విశ్వాసాన్ని నింపుకోండి.

మీరు మరింత మంచి భాగస్వామిగా ఉండటానికి అసూయ అనేది ప్రేరేపిస్తుంది :

మీరు మరింత మంచి భాగస్వామిగా ఉండటానికి అసూయ అనేది ప్రేరేపిస్తుంది :

మీలో గనుక అసూయ ఉన్నట్లయితే అది మీ సంబంధ బాంధవ్యాలను చెడగొట్టకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ భాగస్వామి మరియు మీ సంబంధ బాంధవ్యాల పై మరింత దృష్టి పెట్టండి. మీ భాగస్వామి మించిన తోడు ఎవ్వరూ లేరని మరియు అంతకు మించిన బంధాన్ని మీరు కూడా ఏమి కోరుకోవడంలేదు అని వారికి గుర్తుచేయండి, అలానే వ్యవహరించండి.

మీలో ఉన్న అభద్రతా భావాన్ని ఎత్తి చూపడానికి అసూయ ఎంతగానో దోహదపడుతుంది :

మీలో ఉన్న అభద్రతా భావాన్ని ఎత్తి చూపడానికి అసూయ ఎంతగానో దోహదపడుతుంది :

మీలో ఎప్పటి నుండో చాలా లోతుగా మీ పై ప్రభావం చూపిస్తున్న అభద్రతా భావాలను బయటకు తీసి మీకు కళ్ళకు కట్టి చూపించడంలో అసూయ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఎప్పుడైతే అసూయ చెందుతారో అటువంటి సమయంలో మీరు ఏ ఏ విషయాల్లో అభద్రతా భావానికి లోనవుతున్నారో స్పష్టంగా, నిజంగా తెలుస్తుంది. ఇటువంటి సమయంలో వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి మరియు మిమ్మల్ని మీరు బాగుచేసుకోండి. అటు వైపు అడుగులు వేసి మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా నిర్మించుకోవడానికి మరియు మరింత మంచి వ్యక్తి గాఇది చాలా మంచి అవకాశం.

అభయం ఇచ్చినట్లయితే ముందు కంటే మరింత మంచి వ్యక్తిగా ఎదుగుతారు :

అభయం ఇచ్చినట్లయితే ముందు కంటే మరింత మంచి వ్యక్తిగా ఎదుగుతారు :

మీ భావాలను మీ భాగస్వామితో చాలా ప్రశాంతంగా మరియు తర్కమైన విధానంలో వ్యక్తపరచండి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి మీరు ఆందోళన చెందనవసరంలేదు అని అభయం ఇస్తారు.

మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అనే విషయం తెలియజేస్తారు. మీ భాగస్వామి అభయం ఇవ్వడం మరియు ఎంతో ప్రేమిస్తున్నానని ఒప్పుకోవడం ద్వారా మీరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత మంచి వ్యక్తిగా మారుతారు మరియు మీకు మరింత బాగా అనిపిస్తుంది. ఇందువల్ల మీ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత దృఢపడతాయి మరియు ప్రేమ మరింత పెరుగుతుంది.

English summary

Why A Little Jealousy Can Be Good In A Relationship

If handled in a good way, however, a little jealousy can be a good thing for a relationship. Today, we shall discuss the positive aspects of why being jealous is sometimes good in a relationship.
Story first published: Thursday, September 14, 2017, 19:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter