మీరు అతిగా ఆలోచిస్తున్నారనటానికి సంకేతాలు!

By: DEEPTHI
Subscribe to Boldsky

అతిగా ఆలోచించటం మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అతిఆలోచనలు, విశ్లేషణలు, విశ్లేషణ పక్షవాతానికి దారితీయవచ్చు. మీ చుట్టూ వారు మీకు నమ్మకం కలిగించటానికి నచ్చచెప్పి చెప్పీ, విసుగు చెందితే మీ బంధాలే దెబ్బతినవచ్చు.

అన్నీ సరిగానే ఉన్నా, మీరు అతిగా ఆలోచిస్తే మీ కష్టాలు మరింత పెరుగుతాయి. ఇది మీ లోపమే అని మిమ్మల్ని మీరే నిందించుకోనక్కర్లేదు. కొన్ని ఆందోళన సమయాల్లో అందరూ అతిగానే ఆలోచిస్తారు.

మీ బాయ్ ఫ్రెండ్ అమాయకుడేమీ కాదు సుమా!

కానీ ఇది అన్నివేళలా కొనసాగుతుంటే, మీకూ, మీ భాగస్వామికి ఇద్దరికీ కష్టమే. మీరు అతిగా ఆలోచిస్తున్నారనటానికి సంకేతాలు !

మీరు అతని లేదా ఆమె మెసేజ్ లను అతిగా విశ్లేషిస్తారు

మీరు అతని లేదా ఆమె మెసేజ్ లను అతిగా విశ్లేషిస్తారు

మీరు మీ భాగస్వామి మెసేజ్ లను పదే పదే చదువుతూ వారు పరోక్షంగా ఏం చెప్పాలనుకుంటున్నారని ఆలోచిస్తుంటారు. వారి కేవలం "నిద్రోస్తోంది, గుడ్ నైట్" అని పంపితే అతను లేదా ఆమెకి మీరు బోర్ కొట్టేసారా అని ఆలోచిస్తారు.

అంతేకాదు మీ భాగస్వామి మరొకరితో శారీరక బంధం ఏర్పర్చుకున్నారా, అందుకే గుడ్ నైట్ చాలా త్వరగా చెప్పేసారా అని ఆలోచిస్తారు. మీ భాగస్వామి మీతో విడిపోవడానికి పథకం వేసారా అని కూడా కథ అల్లేసుకుంటారు. ఇదంతా కేవలం ఒక గుడ్ నైట్ మెసేజ్ వల్ల !

అన్ని బానేవున్నా, మీరు మీ బంధం గూర్చి అభద్రతకి గురవుతుంటారు !

అన్ని బానేవున్నా, మీరు మీ బంధం గూర్చి అభద్రతకి గురవుతుంటారు !

అన్నీ బానే సాగుతున్నా, ఎవరైనా మీకన్నా అందమైన వారు వస్తే మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారా అని ఆలోచిస్తుంటారు.

ముఖ్యంగా మగవారు తమ కన్నా అందమైన, తెలివైన వ్యక్తులు తగిలితే తమ ప్రియురాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారని బాధపడుతుంటారు.

మీరు పాటలను విశ్లేషిస్తారు

మీరు పాటలను విశ్లేషిస్తారు

మీరు సడెన్ గా మీ భాగస్వామి ఐపాడ్ ను తీసుకుని అతను లేదా ఆమె ఏ రకపు పాటలు వింటున్నారని తెలుసుకుంటారు. అవికానీ బ్రేకప్ పాటలైతే, మీతో విడిపోబోతున్నారని ఊహించేసుకుంటారు.

ఒకవేళ ఆమె రొమాంటిక్ పాటలు వింటుంటే, ఆమె కానీ అవి వింటూ తన కాలేజీ ప్రియుడిని తలుచుకుంటున్నదేమో అని చింతిస్తారు ! భక్తి పాటలు వింటుంటే, మీతో పెళ్ళిలో ఆమెకి ఆసక్తి చచ్చిపోయిందేమో అని ఆశ్చర్యపోతారు!

మీ ఫేస్ బుక్ పోస్ట్ లను ఊరికే చెక్ చేస్తూనే ఉంటారు

మీ ఫేస్ బుక్ పోస్ట్ లను ఊరికే చెక్ చేస్తూనే ఉంటారు

మీరో ఫోటోనో, లేదా పోస్ట్ ను ఫేస్ బుక్ లో పెట్టిన వెంటనే, మీ భాగస్వామి దానికి "లైక్" కొట్టాలని భావిస్తారు. కానీ ఆమె అది చేయదు ! అంతే, ఇక మీకు నిద్ర ఉండదు !రాత్రంతా ఆమె మీ పోస్ట్ ను ఎందుకు నిర్లక్ష్యం చేసిందని ఆలోచిస్తుంటారు !

అతను మిమ్మల్ని ట్యాగ్ చేయకపోతే, అతనికి మీపై ఆసక్తి తగ్గిపోయిందని భావిస్తారు !

అతను మిమ్మల్ని ట్యాగ్ చేయకపోతే, అతనికి మీపై ఆసక్తి తగ్గిపోయిందని భావిస్తారు !

మీ భాగస్వామి పోస్టులను చెక్ చేస్తారు. మీ ఉమ్మడి మిత్రులను ట్యాగ్ చేసి అతను లేదా ఆమె మిమ్మల్ని చేయలేదు ! రాత్రంతా ఇక మీకు నిద్రపట్టదు !

ఏం ధరించాలని ఆలోచిస్తూ గంటలు గంటలు సమయం వృథా చేస్తారు

ఏం ధరించాలని ఆలోచిస్తూ గంటలు గంటలు సమయం వృథా చేస్తారు

ప్రతి డేట్ కి ముందు, అతను మీ అందానికి ముగ్ధుడైపోయి ఇతర స్త్రీలను చూడటం మానేయాలని, గంటలు గంటలు తయారవుతారు !

హాట్ బ్యూటీ కిమ్ కర్ధాషియన్ బాడీషేప్ ఉంటే.. డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ?

ప్రతిచోటా దాగి ఉన్న అర్థాల గురించే వెతుకుతారు !

ప్రతిచోటా దాగి ఉన్న అర్థాల గురించే వెతుకుతారు !

మీ భాగస్వామి మాట్లాడే ప్రతి పదం మీ మెదడులో పెద్ద పరీక్షకి గురౌతుంది. ఎంతసేపు "అతను ఇలా అన్నాడా లేదా అలా అన్నాడా?" అనే ఆలోచిస్తుంటారు.

డాన్స్ తరగతులు

డాన్స్ తరగతులు

ఒకవేళ ఆమె డాన్స్ తరగతుల్లో చేరిందని చెప్పగానే, మీ మనస్సు మీ ప్రియురాలు నలుగురు అందమైన యువకులతో డాన్స్ చేస్తున్నట్టు ఊహించటం మొదలుపెడుతుంది. ఇంతకీ ఆమె చేరింది స్త్రీలకు మాత్రమే డాన్స్ తరగతిలో ! విరామం ఇవ్వండి. గాలి పీల్చుకోండి. మీరు అతిగా ఆలోచించటం మానేస్తే అన్నీ బానే ఉంటాయి.

English summary

Signs That You Think Too Much!

Over thinking could ruin your life. Over thinking or analysing could cause analysis paralysis. Here are some signs that you think too much!
Story first published: Saturday, August 5, 2017, 20:00 [IST]
Subscribe Newsletter