Latest Updates
-
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు..
మిత్రుల గదిలో రాత్రి పడుకోవటం గూర్చి కలత లక్షణాలు
మీకు మీ ఇష్టాలు పంచుకునే అబ్బాయితో స్నేహం ఇటీవలే కుదిరింది. ప్రతిరోజూ కలిసి కాఫీ కూడా తాగుతున్నారు. అతను మంచి వాడిలా కన్పిస్తున్నాడు.
అందుకని, ఒకరోజు, అతను మిమ్మల్ని అతని రూమ్ కి భోజనానికి పిలిచాడు. డిన్నర్ అయ్యాక, ఆ రాత్రికి అక్కడే ఉండిపొమ్మని కూడా కోరాడు.
ఆ సమయంలో, అతనితో ఉండటం సరైనదా కాదా అని మీరు మళ్ళీ ఆలోచిస్తారు. మీ ఇంటికి తిరిగి వెళ్ళటమే మంచిది. ఎందుకంటే, ఈ అనుకోని రాత్రుల వల్ల తర్వాత మీరు పశ్చాత్తాపపడే ప్రమాదం వుంది. అక్కడే రాత్రంతా పడుకుంటే ఎందుకు మంచిది కాదో ఇది చదివి తెలుసుకొండి.

మీరు మద్యం మత్తులో ఉన్నప్పుడు...
మీ ఇద్దరూ బాగా తాగి మత్తులో ఉన్న సమయంలో మీరు అతని ఇంట్లో ఉండిపోవటం మంచిది కాదు. మీ తర్కం పనిచేయక, అతను ఏది చెప్పినా, చేసినా తెలీకుండానే సరే అని చెప్పేయాలనిపిస్తుంది.
మీరు అతనితో భవిష్యత్తు గురించి ఇంకా నిర్ధారించుకోకపోతే, కొంతసేపు సమయం గడిపాక, నేరుగా మీ ఇంటికి వెళ్ళండి.

అతని జీవితంలో మీ స్థానం గూర్చి అతనింకా సందిగ్థంలోనే ఉంటే...
మీకు అతనితో జీవితం ఇష్టమై, అతను ఇంకా ఒక్క మాట కూడా చెప్పకపోతే, అతని ఇంట్లో ఉండి తర్వాత మీరు పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. అతను మిమ్మల్ని జీవితభాగస్వామిగా మనఃస్ఫూర్తిగా అంగీకరించే రోజు వరకూ నిరీక్షించండి.

మీకు ఏదైనా విచిత్రంగా అన్పిస్తే...
కొంతమంది అబ్బాయిలు పెద్ద సమస్యల్లేని సంతోషం కోసం ఎప్పుడూ ఆరాటపడతారు, మీరు ఒకవేళ అది సులువుగా ఇచ్చేస్తే వారు ఇంకా ఇంకా కోరుకుంటారు. అతని గురించి మీకేదైనా విచిత్రంగా, తేడాగా అన్పిస్తే, అక్కడ పొద్దున వరకూ ఉండకుండా, ఇంటికి వెళ్ళిపోండి. ఎవరికి తెలుసు! కొంతమంది అబ్బాయిలకు అమ్మాయిలు పడుకున్నాక వారి వీడియోలు కూడా తీసే అలవాటు కూడా ఉంటుంది!

ఒకవేళ అతను గతం గూర్చి మాట్లాడితే!
ఆ అబ్బాయి రాత్రంతా తన మాజీ ప్రియురాలి గూర్చే మాట్లాడుతూ ఉంటే మీకు బోర్ కొట్టవచ్చు! అతను కేవలం మీ సానుభూతి, ఏడవటానికి మీ భుజం కోరుకుంటున్నాడు. మీకు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటే, అక్కడ కూర్చుని అతని కన్నీళ్ళు తుడిచే కన్నా ఇంటికి వెళ్లండి!

మీరు డిప్రెషన్ లో ఉంటే...
మీరు ఏదన్నా బాధలో ఉంటే మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో గడపండి. అంతేకానీ మీకు సానుభూతి చూపిస్తూ మీకు దగ్గరయ్యి, మీ బలహీనతను అవకాశంగా తీసుకునే అబ్బాయితో సమయం గడపకండి!

ఒకవేళ అతనికి అప్పటికే పెళ్లి అయ్యుంటే...
అతను మరొకరితో బంధంలో ఉంటే, మీరు అతని గదిలో ఉండటం అతనికి ఇబ్బందికరం కావచ్చు. అతని భార్యకి/ప్రియురాలికి మీ గురించి తెలిస్తే, అనవసరంగా ఆమె మిమ్మల్ని ఇద్దర్నీ అనుమానించి గొడవ పెట్టుకోవచ్చు !

మీ తల్లిదండ్రులతో అప్పుడే గొడవయి ఉంటే...
తల్లిదండ్రులతో గొడవయిన వెంటనే మీకు ఎవరితోనైనా దగ్గరగా ఉండాలనిపించవచ్చు. ఆ సమయంలో, మీరు ఆ అబ్బాయితో కలిసి ఉంటే, అతనికి సులువుగా దగ్గరయిపోతారు. అప్పుడు ఆ అబ్బాయి మిమ్మల్ని ఆ వంక తో తాకాలని చూస్తే? అదే జరుగుతుంది. అందుకే, తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారితో మంచిగా మెలగడం మంచిది కానీ అబ్బాయి ఇంట్లో సానుభూతి కోసం ఉండటం కాదు!



Click it and Unblock the Notifications