For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవతల వినేవాడి సామాజిక స్థాయిని బట్టి మన గొంతు స్థాయి కూడా మారుతుంది

ఒక అధ్యయనం ప్రకారం మనం ఎవరితో మాట్లాడుతున్నామో, వారు మనకన్నా ఎంతపైన స్థాయిలో ఉన్నారన్నదాని బట్టి, వారి స్థాయిని బట్టి మన గొంతులో మంద్రత, గాఢత మారుతుంది.

By Deepthi
|

ఒక అధ్యయనం ప్రకారం మనం ఎవరితో మాట్లాడుతున్నామో, వారు మనకన్నా ఎంతపైన స్థాయిలో ఉన్నారన్నదాని బట్టి, వారి స్థాయిని బట్టి మన గొంతులో మంద్రత, గాఢత మారుతుంది.

ఈ అధ్యయనంలో, ప్లాస్ వన్ జర్నల్ లో ప్రచురితమైన విధంగా, అభ్యర్థులకి ఉద్యోగ ఇంటర్వ్యూ పని ఇచ్చి, వారి గొంతు లక్షణాలను, మాటతీరును పరీక్షించారు. వివిధ సామాజిక స్థాయిలకు చెందిన వ్యక్తుల గొంతు స్థాయిలు వేర్వేరుగా ఉన్నాయి.

స్త్రీ పురుషుల ఆధిక్యత

ఇంకా, స్వంతంగా సృష్టించుకునే సామాజిక స్థాయిలే కాక, స్త్రీ పురుషులిద్దరూ తమకన్నా అవతల వారు అధిక స్థాయికి చెందినవారని, ఆధిక్యత కలవారని అనుకుంటే బిగ్గరగా, స్పష్టంగా మాట్లాడతారు.

ఇంగ్లండ్ లో యూనివర్శిటీ ఆఫ్ స్టిర్లింగ్ కి చెందిన పరిశోధకుడు విక్టోరియా మిలెవా మాట్లాడుతూ, "నిజానికి బిగ్గరగా మాట్లాడటానికి వ్యతిరేకమైన లోతైన, గాఢమైన గొంతు, ముఖ్యంగా పురుషుల్లో ఆధిక్యతను సూచిస్తుంది. అందుకని ఎవరైనా, తమని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, తమకన్నా ఆధిక్యంగా మాట్లాడుతున్నట్టు అన్పిస్తే, తమ గొంతుకూడా పెంచుతారు." అని చెప్పారు.

స్త్రీ పురుషుల ఆధిక్యత

" ఇది అవతలవారి ముందు లొంగినట్టు కన్పించే సూచన కావచ్చు, వినేవారికి మీరు ఏ భయం కల్గించే వ్యక్తి కాదని తెలపటానికి, అనవసర వాదనలు రాకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది," అని ఆమె జతచేసారు.

తాము ఆధిక్యంలో ఉన్నామని అనుకునే అభ్యర్థులు- తారుమారు చేయటం, బలం వాడి, లేదా పనితీరుతో భయపెట్టి ఒక సామాజిక స్థాయి పొందాలనుకునే వారు- తమకన్నా అధిక స్థాయిలో ఉన్నవారితో తమ గొంతు మార్చి, మంద్రంగా, మెల్లగా మాట్లాడతారు.

తమని తాము అధికస్థాయి అనుకున్నవారు- అందరూ తలఎత్తి తమను చూస్తూ, తమ అభిప్రాయాలకి విలువనిచ్చి తమకు ఆ సామాజికస్థాయి ఇవ్వాలనుకునేవారు- ఎలాంటి వారితోనైనా, తమ గొంతు మార్చుకోరు.

స్త్రీ పురుషుల ఆధిక్యత

పరిశోధకులు అనే దాని ప్రకారం, వారు ఎక్కువ నియంత్రణలో వుండి, ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటారని అర్థం.

మిలెవా మాట్లాడుతూ, "మన గొంతు ధ్వనిలో వచ్చే ఈ మార్పులు తెలిసో తెలియకో చేసినా, ఈ స్వరంలో వచ్చే మార్పులు సామాజిక స్థాయిని తెలిపే ముఖ్య మార్గంగా మారాయి," అని అన్నారు.

English summary

Social Status Of A Listener May Alter Our Voice

People tend to change the pitch of their voice depending on who they are talking to, and how dominant they feel, a study has found.
Desktop Bottom Promotion