మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు మరొకరితో డేటింగ్ చేస్తుంటే?!

By: Deepti
Subscribe to Boldsky

వదిలేయండి ! ఈ పదాలు చెప్పటం,అనుకోవటం సులువే, చేయటమే కష్టం. బ్రేకప్ ఇచ్చే బాధకన్నా, మీ మాజీ ప్రేమికుడిని లేదా ప్రేమికురాలిని కొత్త వ్యక్తితో ఫేస్ బుక్ చిత్రాల్లో సంతోషంగా చూడటం ఎక్కువ బాధనిపిస్తుంది.

మీరు ఆ బాధలనుంచి బయటపడాలనుకుంటే, మీకు మనశ్శాంతినిచ్చే కొన్ని ఆలోచనలు,ఐడియాలను ఇక్కడ పొందుపర్చాం. చదవండి.

ఆ ఇంకొక వ్యక్తి మీకన్నా గొప్ప ఏం కాదు

ఆ ఇంకొక వ్యక్తి మీకన్నా గొప్ప ఏం కాదు

మీ భాగస్వామి మరొక వ్యక్తితో సన్నిహితం ఉండటం చూసి, మీకు వచ్చే మొదటి ఆలోచన " ఏరకంగా అతను/ఆమె నాకన్నా మేటి అని?"

నిజానికి, ఆ మరోవ్యక్తి కన్నా మీరు ఏవిధంగా తక్కువ కాదు. మీరు ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం లేదు.

మీ మాజీ భాగస్వామి ఇంకొకరితో డేటింగ్ నిజంగానో, ఒంటరిగా ఉండటం ఇష్టం లేకుండానో చేస్తుండవచ్చు. ఆమె లేదా అతను వారిని డేటింగ్ చేస్తున్నది, మీకన్నా కేవలం మెరుగు అన్న ఉద్దేశంతో కాదు.

మీరు ఓడిపోలేదు

మీరు ఓడిపోలేదు

బంధాలు మీరు గెలిచే లేదా ఓడే పోటీ కాదు. ఆహారం, బట్టలు, ఆశ్రయం ఎలా అవసరమో బంధాలు కూడా అవసరం. ముగిసిపోయిన బంధాలకు అతిగా విలువనివ్వకండి.

ఆన్ లైన్ డేటింగ్ దుర్వినియోగ ప్రభావాలు

అతను లేదా ఆమెకి కూడా మీరంటే ఇంకా శ్రద్ధ

అతను లేదా ఆమెకి కూడా మీరంటే ఇంకా శ్రద్ధ

మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు ఇంకా మీ జ్ఞాపకాలను తనతో ఉంచుకున్నారు. అందుకని మీరేం నిర్లక్ష్యపడ్డారని బాధపడక్కర్లేదు.

వాస్తవాన్ని అంగీకరించండి

వాస్తవాన్ని అంగీకరించండి

ఎవరైనా మీ జీవితంలోంచి వెళ్ళిపోతే, ఆ నిజాన్ని ఒప్పుకుని వారి జీవితంలోకి తొంగిచూడకండి. వారి ప్రస్తుత బంధాలు మీకు సంబంధించినవి కాదు.

డేటింగ్ చేయడానికి ముందు మహిళలకోసం కొన్ని సూచనలు

జీవితం రేసు కాదు

జీవితం రేసు కాదు

హాయిగా నిదానంగా, కావాల్సినంత విశ్రాంతి తీసుకోండి. మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలికి గొప్పగా చూపించటం కోసం ఏ కొత్తబంధంలోకి ప్రవేశించకండి. జీవితం ఏమీ పోటీ కాదు.

మీరు ప్రత్యేకం

మీరు ప్రత్యేకం

ప్రతి ఒక్కరూ ప్రత్యేకం మరియు ప్రతిఒక్కరికి తమనితాముగా గౌరవించే వ్యక్తి దొరుకుతారు. అందుకని మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మీలాగానే ప్రేమించే వారికోసం నిరీక్షించండి.

అజ్ఞాతంగా వెంటపడటం మానేయండి

అజ్ఞాతంగా వెంటపడటం మానేయండి

మీరు ఫేస్ బుక్ లో మీ మాజీ ప్రేమికుల ఫోటోలు చూసినప్పుడే బాధంతా తిరిగి మొదలవుతుంది. అందుకని అలాంటి బాధపెట్టే పనుల నుంచి దూరంగా ఉండండి.

English summary

When Your Ex Is Dating Someone Else…

Let go! These words are easier said than done. A break up pains a lot and what causes more pain is seeing your ex-partner happily posing with a new person
Subscribe Newsletter