మొదటి పరిచయంలో సదాభిప్రాయం కలగడానికి 8 మార్గాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

First impression is best impression అని పాత నానుడి. అనగా మనం మనపై కలిగించే మొదటి అభిప్రాయమే మనస్ఫూర్తిగా మనపై ఒక ఉద్దేశాన్ని ఇవ్వగలుగుతుంది అనుకూలంగా అయినా, ప్రతికూలంగా అయినా. ముఖ్యంగా భాగస్వాములను ఎంచుకునే సందర్భంలో ఇది ముఖ్యంగా చెప్పబడుతుంది.

ఎక్కువమంది మొదటి లేదా రెండవ సమావేశం లోనే వ్యక్తుల మీద నిర్ణయానికి వచ్చేస్తుంటారు. వారిమీద తెచ్చుకున్న అభిప్రాయం కొన్ని సందర్భాలలో జీవితకాలమంతా ఉంటుంది. కావున మొదటి పరిచయం లో మంచి అభిప్రాయం తెచ్చుకోవడం మూలంగా జీవితంలో కొన్ని సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

నిజానికి ఇక్కడ మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే “ మొదటి లేదా రెండవ సమావేశంలోనే ఎదుటి వారు మిమ్మల్ని ఇష్టపడేలా ఎలా నడుచుకోవాలి” అని. ఒకవేళ మీరు అంతర్ముఖుడు అయినా కూడా , మొదటి సమావేశం యొక్క ఫలితాలను మీరు అంచనా వేయలేకపోవచ్చు. ఒక్కోసారి సంబంధాలు మెరుగుపడినా కూడా ఒక్కోసారి ఆ సమావేశమే చివరి కలయిక కూడా కావొచ్చు.

కావున మొదటి సమావేశంలో మంచి అభిప్రాయం కలగడానికి మరియు సంబంధాలు కొనసాగడానికి నడుచుకోవలసిన తీరు తెన్నుల గురించిన వివరాలను ఈ వ్యాసం లో పొందుపరచడం జరిగినది .

తరచుగా చిరునవ్వు:

తరచుగా చిరునవ్వు:

మొదటి పరిచయం సంతోషభరితంగా ఉండేలా చూసుకోవాలి. నవ్వు అనేది ఎవరూ కాదనలేని విషయం. అలాగని అనవసర విషయాలకు కాకుండా సందర్భానుసారం నవ్వును చూపడం వలన వ్యక్తులు మీ పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. వీలైనoత ఎక్కువ స్మైలీగా ఉండుటకు ప్రయత్నించండి. తద్వారా మొదటి పరిచయంలోనే మీ మీద మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. నవ్వు అన్నీ విధాలా శ్రేష్టం. మరిచిపోకండి. మూడీ గా, ఏదో పోగొట్టుకున్నవాడిలా, భాధల గురించిన చర్చలు చేస్తూ ఉంటే సదభిప్రాయానికి తావే లేదు.

మీ హావ భావాలు, శరీర భాష(బాడీ లాంగ్వేజ్):

మీ హావ భావాలు, శరీర భాష(బాడీ లాంగ్వేజ్):

మీ భావ వ్యక్తీకరణ మరియు శరీర తత్వం లేదా శరీర భాష చాలా ముఖ్యం. పరిస్థితులను బట్టి మీ శరీరం లో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి అతి ఆత్మ విశ్వాసాన్ని కనబరిస్తే, ఒక్కోసారి ఆందోళనలకు గురవడం, కళ్ళు తిప్పడం వంటి చర్యలు కనపడుతూ ఉంటాయి. ఇలాంటివి ప్రదర్శితమవకుండా చూడడం మీ భాద్యత. ఈ శరీర భాషకు సంబంధించిన అనేక పుస్తకాలు కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి. ఏదైనా ఒక మంచి పుస్తకం చదివి చూడండి మరి. ఉదాహరణకు కొందరు మాట్లాడుతుంటే ఒంపులు తిరగడం , అటు ఇటు ఊగడం, తిరగడం చేస్తుంటారు. ఇలాంటివి మంచి అభిప్రాయాన్ని కలిగించలేవు .

చూపు: (eye కాంటాక్ట్ )

చూపు: (eye కాంటాక్ట్ )

చెప్పడానికి సులువే కానీ ఆచరణలో కష్టతరం . మీ మీద ఒక అభిప్రాయం కలగడానికి మీ చూపు ప్రధాన కారణం అవుతుందని మీరు ఊహించగలరా. ముఖ్యంగా మాట్లాడుతున్నప్పుడు, వినునప్పుడు మీ చూపు సరిగ్గా ఉండాలి. దిక్కులు చూడడం తగ్గించి, కళ్లలోకి చూస్తూ మాట్లాడడం మంచిది. తద్వారా మీ పై సదభిప్రాయానికి కారణం అవుతుంది.

వినడం నేర్చుకోండి:

వినడం నేర్చుకోండి:

కొందరు వినడానికి అంత ప్రాముఖ్యతను ఇవ్వకుండా మాట్లాడడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్దతి కాదు. వారికి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి., వీలైతే మీరు మాట్లాడడం తగ్గించి వారి మాటలకు విలువ ఇస్తున్నట్లు ప్రవర్తించడం ద్వారా మీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది అనడంలో సందేహమే లేదు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా తమ మాటలను వినడానికి ఆసక్తి కనపరచే వారినే ఎక్కువ ప్రేమిస్తారు అన్నది సత్యం. ఇది మర్చిపోకూడదు.

అంతరాయం:

అంతరాయం:

ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మద్యలో అంతరాయం కలిగిస్తే మీరెంత చిరాకుకు లోనవుతారో? . అలాగే వారు మాట్లాడునప్పుడు మీరు అంతరాయం కలిగించినా వారు కూడా అదే భావనలతో ఉంటారు. కావున మాట్లాడునప్పుడు అంతరాయాలను కలిగించడం వలన మీతో మాట్లాడుటకు అయిష్టత ప్రదర్శించే అవకాశం ఉంది. కావున మంచి అభిప్రాయం కలగాలి అంటే ఇలాంటివి మానుకోండి.

ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యేలా చేయండి:

ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యేలా చేయండి:

మీరు ఎవరినైనా ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యేలా చేయగలిగితే , ఆ అనుభూతికి లోనయిన వ్యక్తి మీ నుండి అలాంటి అనుభూతిని ఎక్కువగా పొందుటకు ఇష్టం చూపుతారు . కావున మీతో మాట్లాడే వ్యక్తులను ప్రత్యేకంగా ట్రీట్ చేయండి.

భౌతిక స్పర్శ:

భౌతిక స్పర్శ:

కరచాలనం (షేక్ హాండ్) ఇవ్వడం ద్వారా అనేక విషయాలు తెలుస్తాయి అన్నది సత్యం, కావున ఇచ్చే కరచాలనం సున్నితంగా ఉండేలా చూడాలి. ఇది మంచి సంబంధాలకు దారితీస్తుంది. కొందరు గట్టిగా నొప్పికలిగేలా లేక ఎక్కువగా చేతులు ఊపుతూ కరచాలనం చేస్తుంటారు. ఈ పద్దతి వలన హేయభావాలకే ఎక్కువ దారితీస్తుంది. షేక్ హాండ్ ఎప్పుడు కూడా సున్నితంగా ఉండేలా చూడాలి. మరియు కరచాలానికి వారు సిద్దంగా ఉన్నారో లేదో కూడా మానసికంగా అంచనా వేయగలగాలి. ఒక్కోసారి కరచాలనానికి అయిష్టతను ప్రదర్శించవచ్చు.

వేష ధారణ :

వేష ధారణ :

మీ వేషధారణ మీ వ్యక్తిత్వాన్ని , మీ ఆలోచనలను సగం తెలియజేస్తాయి అనునది సత్యం. కావున మీ బట్టల ఎంపిక కూడా సరైనదిగా ఉండాలి. సమావేశాన్ని అనుసరించి బట్టలు ఎంచుకోవలసిన అవసరం ఉంది.

ఈ 8 అంశాలు మీపై సదభిప్రాయాన్ని కలిగేలా చేయగలవు. తద్వారా సంబంధాలను ఉన్నతంగా మలచుకోగలరు.

English summary

8 WAYS TO MAKE A GOOD IMPRESSION & MAKE THEM WANT SOME MORE OF YOU

Making a proper first impression is the way to open a chest full of opportunities when it comes to seeking a partner. Most people will judge you within the first or second meeting and will form an opinion that will most likely never change. Making a good first impression is incredibly important, because you only get one shot at it.
Story first published: Friday, March 30, 2018, 7:00 [IST]