ఒంట‌రిగా ఉండిపోతార‌నే భ‌యంతోనే ప్రేమ‌లో ప‌డుతున్నారా?

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

కాసేపు నిజాయ‌తీగా ఉందాం.... మ‌న‌ల్ని జీవితంలో అమితంగా ప్రేమించే వ్య‌క్తి దొర‌కాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జ‌మే. ఎన్నో సినిమాల్లో, మ‌రెన్నో న‌వ‌ల‌ల్లో ప్రేమ గురించి మ‌రీ అట్ట‌హాసంగా చూపిస్తారు. రొమాంటిక్ భావ‌న‌లు, బ‌హుమ‌తులు, రోజా పువ్వులు, చాక్లెట్లు ఇలా ప్రేమ వ్య‌క్తీక‌రించే భావ‌న‌లు చూపిస్తారు. కొంద‌ర‌మే ఈ మ‌ధుర అనుభూతుల‌ను సొంతం చేసుకునేందుకు మాత్ర‌మే ప్రేమ‌లో ప‌డ‌తారు. ఐతే విచిత్రంగా కొంత మంది మాత్రం ఒంట‌రిగా ఉండాల‌నే భ‌యంతోనే ప్రేమ ముగ్గులోకి దిగుతారు. ఇదేదో మ‌న‌కు ద‌గ్గ‌ర‌లా ఉంద‌నిపిస్తుంది కదా!

ఒంట‌రిత‌నపు భ‌యం

ఒంట‌రిత‌నపు భ‌యం

ఒంట‌రిత‌నం మిమ్మ‌ల్ని వెంటాడుతుందా.. ఎవ‌ర్నో మిస్ అవుతున్న భావన అనుక్ష‌ణం వెన్నాడుతుందా? ఒక్కోసారి దీన్నుంచి తప్పించుకోవ‌డానికే కాబోలు ఎవ‌రో ఒక‌రి తోడు కోరుకోవ‌డం స‌హ‌జం. ఈ తొంద‌ర‌పాటుత‌నంతోనే చాలా మంది త‌మ‌కు అనువు గాని సంబంధంలోకి వెళుతుంటారు. పైగా తాము ఎంచుకున్న వ్య‌క్తే త‌మ‌కు స‌రైన వాడ‌నే భ్ర‌మ‌లో ఉండిపోతారు. నిజం చెప్పాలంటే ఒక్కోసారి ఒంట‌రిగా ఉండ‌ట‌మే మంచిది.

తోటివారి ప్ర‌భావం

తోటివారి ప్ర‌భావం

రిలేష‌న్ షిప్‌లోకి ఎంట‌ర్ అవ్వ‌డానికి ముఖ్య కార‌ణాల్లో ఇదీ ఒక‌టి. మ‌నం హ్యాపీగా ఉండాలంటే మ‌న‌కంటూ సోల్‌మేట్ ఉండాల‌ని న‌మ్ముతాం. పైగా మ‌న స్నేహితులు వారి బాయ్‌ఫ్రెండ్స్ గురించి గొప్ప‌లు చెప్పుకుంటుంటే మ‌న‌కూ ఒక ప్రేమించే వ్య‌క్తి ఉండాల‌ని కోరుకుంటాం. వాళ్లు త‌మ వీకెండ్ ప్లాన్స్‌ని త‌మ భాగ‌స్వామితో గ‌డిపేందుకు చూస్తుంటే మీకు అలా గ‌డ‌పాల‌ని ఉంటుంది.

హార్మోన్ల ప్రభావం

హార్మోన్ల ప్రభావం

మ‌నం ఎవ‌రికైనా ఆక‌ర్షితులైన‌ప్పుడు మ‌న శ‌రీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి ఉత్తేజ‌భ‌రిత‌మైన థ్రిల్‌ను అందిస్తాయి. ఐతే ఇది కాసేపే... దీర్ఘ‌కాలంలో ఆ మాయ అంతా మాయ‌మ‌వుతుంది. నిజంగానే ప్రేమ‌లో ఆనందం పొందుతున్నారా లేదా హార్మోన్ల ప్ర‌భావం ఉందా అనేది అప్పుడే తెలుస్తుంది.

కోల్పోతామేమో అన్న భ‌యం

కోల్పోతామేమో అన్న భ‌యం

ఎక్క‌డ మ‌నం ప్రేమిస్తున్న వ్య‌క్తిని కోల్పోతే మ‌రొక‌రు దొర‌క‌రేమో అన్న భ‌యంతోనైనా మ‌నం కొన‌సాగిస్తున్న‌ సంబంధాన్ని వ‌దులుకోలేం. అదీ కాక మ‌రొక మంచి వ్య‌క్తి దొర‌క‌డేమో అన్న అపోహ వెంటాడుతుంది. ఇలాంటి సందిగ్ధ‌త ఎదురువుతుంటే ఆలోచించాల్సిందే. ఒంట‌రిగా ఉండాలా సంబంధంలో కొన‌సాగాలా అనేదానిపైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ట్టే.

పొగ‌డ్త‌ల‌కు ప‌డితే...

పొగ‌డ్త‌ల‌కు ప‌డితే...

మీ భాగ‌స్వామి మిమ్మ‌ల్ని తీయ‌ని ముద్దు ముద్దు మాట‌ల‌తో మిమ్మ‌ల్ని పొగుడుతున్నాడా? ఆ మాట‌లు ఎవ‌రికి రుచించ‌వు చెప్పండి. మీరు ఆత్మ‌విశ్వాసం కోల్పోయిన‌ప్పుడు అలా పొగిడేవాళ్లు ఉంటే కాస్త‌యినా కోలుకుంటారు క‌దూ! ఐతే దీన్నే ప్రేమ అనుకుంటే ఎలా? నిజంగా మీ మంచి కోరే వ్య‌క్తి అయితే ఎల్ల‌ప్పుడూ మీ వెంట ఉంటాడు. ఏదైనా సంబంధంలోకి వెళ్లే ముందు ఈ విష‌యాన్ని ఆలోచించాలి. అందుకు త‌గ్గ‌ట్టు ఒంట‌రిగా ఉండాలి అన్న నిర్ణ‌యం తీసుకోవాలి.

English summary

are you in a relationship only because you are scared of being alone?

Let’s be honest, we all want someone special in our life who loves us unconditionally. Thanks to Bollywood movies and best-selling novels, that feeds us with the wrong notion of love—endless romance, gifts, roses and chocolates.
Story first published: Monday, March 26, 2018, 19:00 [IST]