అనుబంధం మరియు నిబద్ధత

By Gayatri Devupalli
Subscribe to Boldsky

అనుబంధాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు మంచి భాగస్వామి అని అనిపించుకోవాలంటే ఎలా ఉండాలి అని తరచుగా చర్చించుకుంటాం.

ఒక బంధం యొక్క పునాదిని పటిష్టంగా నిర్మించుకోవడానికి అవసరమైన ఆత్మపరిశీలనను మనం తరచుగా ఉపేక్షిస్తాం.

ఆత్మపరిశీలన ద్వారా మాత్రమే మనం ఆ అనుబంధానికి సంసిద్ధంగా ఉన్నామో లేదో తెలియజేస్తుంది.

కనుక మీరు ఒక అనుబంధానికి నిబద్ధతతో కట్టుబడి ఉండటానికి తయారుగా ఉన్నారో లేదో ఇప్పుడు కనుక్కుందాం. ఈ క్రింది లక్షణాలను విశ్లేషించుకుని మీ సంసిద్ధతను తెలుసుకోవచ్చు.

1. మీ భాగస్వామిని ఆమె/ అతడు ఉన్నవారిని ఉన్నట్లుగా స్వీకరించడానికి మీరు సిద్ధమా:

1. మీ భాగస్వామిని ఆమె/ అతడు ఉన్నవారిని ఉన్నట్లుగా స్వీకరించడానికి మీరు సిద్ధమా:

మీరు ఒక వ్యక్తిని బాగా పరిశీలించాకా వారిలో మీకు నచ్చని లక్షణాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వారితో మీరు కలిసి ఉండాలనుకుంటున్నారా! అయితే మీరు ఈ అనుబంధం పట్ల నిబద్ధతతో ఉన్నట్లే.

ఆరోగ్యవంతమైన సంబంధాన్ని కోరుకునేవారు ఎదుటివారిని తమకు తగినట్లు మలుచుకోవడమనే ఆలోచనతో కాకుండా వారిని ఉన్న విధంగానే స్వీకరిస్తారు. ఇది అక్షర సత్యం. ఎదుటివారు ఎలా ఉన్నా వారికి ప్రేమను పంచివ్వడం నేర్చుకోండి.

2. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంకండి:

2. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంకండి:

ప్రతి బంధంలో కూడా కొన్ని సవాళ్లెదురావుతాయి. వాటిని మనం తప్పించలేము. మీరు వాటికి తయారై ఉన్నారా? ఈ సవాళ్లు భవిష్యత్తులో మీ బంధాన్ని నిబద్ధతతో నిలబెట్టుకోవడానికి సహాయపడతాయి.

3. మీ మాజీ ప్రేమికులతో ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు:

3. మీ మాజీ ప్రేమికులతో ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు:

కొంతమంది తాము ఇదివరకు సంబంధం కలిగివున్న మాజీ ప్రేమికులతో స్నేహపూర్వకంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని, వారి కోసం సమయాన్ని కూడా వెచ్చిస్తారు. కానీ భవిష్యత్తులో ఎటువంటి అవాంతరాలు ఎదురవ్వకూడదంటే వారితో పూర్తిగా తెగతెంపులు చేసుకోండి.

వారితో సమయం గడపడం లేదా సంభాషించడం పూర్తిగా మానుకోండి. ఒకవేళ మీరు వారి సాంగత్యాన్ని పూర్తిగా వదులుకోలేకపోతే మీరు కొత్త భాగస్వామితో బంధం పట్ల నిబద్ధత చూపించలేరు.

4.. మీరు ఒంటరిగా ఉండటాన్ని కనుక ఇష్టపడినట్లైతే:

4.. మీరు ఒంటరిగా ఉండటాన్ని కనుక ఇష్టపడినట్లైతే:

మీరు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారైనట్లైతే, తప్పకుండా మిమ్మల్ని మీరు ఒక బంధంలో ఇముడ్చుకోవటాన్ని కూడా ఇష్టపడతారు.

అసలైన ఆనందం మన అంతరంగంలోనే పుడుతుంది. మీరు మీ కొరకు సమయం వెచ్చించడంలో ఆనందం పొందుతున్నట్లైతే, మీరు తప్పకుండా మీ ప్రేమికుల యొక్క సాంగత్యాన్ని కూడా ఆనందించగలరు.

5. మీరు పరిపూర్ణంగా ప్రేమను అందించేటట్లైతేనే, భాగస్వామికై వెతకండి

5. మీరు పరిపూర్ణంగా ప్రేమను అందించేటట్లైతేనే, భాగస్వామికై వెతకండి

మీరు పరిపూర్ణంగా ప్రేమను అందించేటట్లైతేనే, భాగస్వామికై వెతకండిఅంతేకాని ఖాళీ సమయం గడపడానికి మాత్రం వద్దు: మీరు కనుక మీ ఖాళీ సమయాన్ని గడపడానికి మాత్రమే ఒక వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్లైతే, దయచేసి మీరు ఎటువంటి సంబంధంలోకి అడుగుపెట్టకండి. అంతకన్నా ఒంటరితనాన్ని ఆస్వాదించడమే మేలు.

అలాకాకుండా అనుక్షణాన్ని మీ భాగస్వామితో కలిసి ఆస్వాదించాలనుకుంటే కనుక అడుగు ముందుకేయండి.

6.మీరు సర్దుకుపోవడానికి సిద్ధంకండి:

6.మీరు సర్దుకుపోవడానికి సిద్ధంకండి:

సర్దుకుపోవడం వలనే ఒక బంధం పదికాలాల పాటు నిలిచి గెలుస్తుంది.

మీరు కనుక ఒక బంధాన్ని మీ జీవితంగా మలచుకునే ఉద్దేశ్యం లేనట్లయితే అందులోకి ప్రవేశించకండి. మీ భాగస్వామి యొక్క స్నేహితులు, కుటుంబం, వ్యాపకాలు, పెంపుడు జంతువులు, జీవన పరిస్థితులు మొదలైన వాటిపై దృష్టి సారించండి. వారు కూడా మీ అనుబంధాల పట్ల వాత్సల్యం చూపిస్తారు.

ఎదో ఒక చోట మీ భాగస్వామితో రాజీ పడి సర్దుకుపోవలసి ఉంటుంది. మీకు కనుక సర్దుబాటు స్వభావం ఉంటే అడుగు ముందుకు వేయండి.

మీరు ఒక బంధంలోకి అడుగుపెట్టబోయే ముందు మిమ్మల్ని మీరు పై విధంగా ప్రశ్నించుకుని నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఆ సమాధానాలే మీ నిబద్ధతతో కూడిన బంధానికి తలుపులు తెరుస్తాయి.

మీరు దీనితో ఏకీభవిస్తారా? అయితే ఈ సూత్రాలను పాటించండి, పంచుకోండి మరియు మీ విలువైన సూచనలివ్వండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    ARE YOU READY FOR COMMITMENT? 5 STEPS TO FIND IT OUT

    Find your way for a perfect relationship is difficult, I understand. But first ask yourself, if you ready for commitment. Getting into relationship is easy but giving a commitment is not. We have frequently seen people getting into relationship but when it comes to giving a total commitment we lose the relationship.
    Story first published: Thursday, March 29, 2018, 7:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more