Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.! -
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం
నన్ను ఇద్దరమ్మాయిలు ఇష్టపడ్డారు, చివరకు ఇద్దరూ హ్యాండ్ ఇచ్చారు, అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి
హేయ్ ఏమనుకుంటున్నావ్ నువ్వు.. కాస్త ప్రేమగా మాట్లాడితే ప్రేమిస్తున్నట్లా.. ఏదో ఫ్రెండ్ వి... నీ పరిస్థితులు మొత్తం నాకు చెప్పినందుకు నేను నీతో ప్రేమగా మాట్లాడుతున్నాను అంతేకానీ ఈ లవ్ గివ్ నాకు అస్సలు
ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తే, మరో అమ్మాయికి నేను అట్రాక్ట్ అయిపోయాను (#mystory380 ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
మొదట నన్ను ప్రేమించే అమ్మాయిని నేను కాదనడానికి కారణం నా ఆర్థిక పరిస్థితులు. తనంటే ఇష్టంకానీ అప్పుడు నేను ఉన్నపరిస్థితుల్లో నేను తనని రిజెక్ట్ చేశాను.
ఇక రోజూ నన్ను స్కూటీపై కాలేజీ దగ్గర డ్రాప్ చేసే అమ్మాయి పేరు రమ్య. తనతో పరిచయం కొన్నాళ్లు అయినా ఎందుకో తను నాకు సూటబుల్ పర్సన్ అని అనిపించింది.

చాలా కబుర్లు చెప్పుకునేవాళ్లం
రమ్య నేను రోజూ చాలా కబుర్లు చెప్పుకునేవాళ్లం. తను వాలింటికి తీసుకెళ్లి అందరినీ పరిచయం చేసింది. నేను కూడా తనని మా ఇంటికి తీసుకొచ్చేవాణ్ని. నన్ను తను అన్ని రకాలుగా అర్థం చేసుకుంది.

ఎలా అయినా పెళ్లి చేసుకోవాలన్నుకున్నా
ఇలాంటి అమ్మాయిని ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలన్నుకున్నాను. తనకు నా మనస్సులోని మాటను చెప్పాను. కానీ తను అలాంటి సమాధానం ఇస్తుందని నేను అస్సలు ఊహించలేదు.

కాస్త ప్రేమగా మాట్లాడితే
హేయ్ ఏమనుకుంటున్నావ్ నువ్వు.. కాస్త ప్రేమగా మాట్లాడితే ప్రేమిస్తున్నట్లా.. ఏదో ఫ్రెండ్ వి... నీ పరిస్థితులు మొత్తం నాకు చెప్పినందుకు నేను నీతో ప్రేమగా మాట్లాడుతున్నాను అంతేకానీ ఈ లవ్ గివ్ నాకు అస్సలు పడవు అంది. ఫస్ట్ లో నీపై ప్రేమ ఉండేది కానీ తర్వాత ఓన్లీ ఫ్రెండ్ గా భావించాను. నీకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందని చెప్పావు కదా... ఆమెను రిజెక్ట్ చేశానన్నావు కదా అందుకే నేను కూడా నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అంది.

ఫ్యూజులు ఎగిరిపోయాయి
తను ఆ మాట చెప్పగానే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏందిరా బాబు ఇలా అయ్యింది నా పరిస్థితి అనుకున్నాను. తను అలా రిజెక్ట్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. తర్వాత రమ్యను నేను చాలాసార్లు బతిమిలాడాను. కానీ తను మాత్రం నా మాట అస్సలు వినలేదు.

నాకు గతంలో ప్రపోజ్ చేసిన అమ్మాయి
అప్పుడు మళ్లీ నాకు గతంలో ప్రపోజ్ చేసిన అమ్మాయి గుర్తొచ్చింది. అరె... తను ప్రపోజ్ చేస్తే కూడా నేను అలాగే రిజెక్ట్ చేశాను కదా అనుకున్నాను. తను ఎంత బాధపడి ఉంటుందో అని అనుకున్నాను వెంటనే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లాను.

తెలియక మిమ్మల్ని రిజెక్ట్ చేశాను
ఆమెకు నా స్టోరీ మొత్తం చెప్పాను. అప్పుడేదో తెలియక మిమ్మల్ని రిజెక్ట్ చేశాను. నా కుటుంబ పరిస్థితులు బాగుండేవి కావు. ఇప్పుడు నాకు మంచి జాబ్ ఉంది.. నేను మంచి పొజిషన్ లో ఉన్నాను. నువ్వు ఒకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను.

నువ్వు కావాలనుకున్నప్పుడు
ఎలా కనుపడుతున్నాను నీకు అని సీరియస్ గా అంది తను. నువ్వు కావాలనుకున్నప్పుడు నీపై నాకు ప్రేమ పుట్టడానికి నేను యంత్రాన్ని కాదు. నాకూ మనసుంది. నువ్వు నా ప్రేమను వద్దన్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకేమీ తెలుసు.

అర్థం చేసుకునేదాన్ని
నీ కుటుంబ పరిస్థితులు నాతో చెప్పి ఉంటే నేను అర్థం చేసుకునేదాన్ని. మరి అంత తెలివితక్కువదాన్నేమీ కాదు కదా. నన్ను అప్పుడు రిజెక్ట్ చేసి, మరో అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు తను కాదంటే మళ్లీ నా దగ్గరకు వస్తావా? అలా వస్తే నేను ఎలా ప్రేమిస్తానని నువ్వు అనుకుంటున్నావ్?

మనం కావాలనుకున్నప్పుడు కొన్ని రావు
ఒక్కటి గుర్తు పెట్టుకో.. మనం కావాలనుకున్నప్పుడు కొన్ని రావు.. అవి వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. నీకు ఇప్పుడు ఏ కష్టాలు లేవని.. నన్ను ఇప్పుడు ప్రేమించు అంటే నాకు ఎలా ప్రేమ కలుగుతుంది? నా మనస్సు విరిగిపోయింది.. నీపై ఇప్పుడు కోపం తప్ప ఇంకేమీ లేదు. మళ్లీ నా ముఖం చూడకు. నాకు పెళ్లి కూడా కుదిరింది అంది.

కొన్నింటిని మాత్రమే ప్లాన్ వేసుకుని చేయాలి
అప్పుడనిపించింది.. జీవితంలో కొన్నింటిని మాత్రమే ప్లాన్ వేసుకుని చేయాలి. మరికొన్నింటిని అవి మనలైఫ్ లోకి ఎప్పుడు వస్తే అప్పుడే ఆహ్వానించాలి అని. అలా నన్ను ప్రేమించిన అమ్మాయిని.. నేను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకున్నాను. మరో అమ్మాయి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.



Click it and Unblock the Notifications