Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
అబ్బాయిలు ఈజీగా అమ్మాయిల ప్రేమను మరిచిపోతారు, కానీ అమ్మాయిలు అలా కాదు #mystory351
కేవలం ఆస్తి కోసం తను తన మరదలిని పెళ్లి చేసుకుని వెళ్లి పోయాడు. నా జీవితం గురించి ఒక్క క్షణం కూడా తను ఆలోచించలేదు. తనపై గంపెడాశాలు పెట్టుకున్న నన్ను అలా వంచిస్తాడని అనుకోలేదు. బైక్ పై మేమిద్దరం చక్కర
అతను నన్ను వాడుకుని వదిలేశాడు, కంటిన్యూగా నెల రోజుల పాటు చేశాడు అందుకే నమ్మాను #mystory350 (ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
రమ్య ఐ లవ్ యూ అనగానే గుడ్డిగా నమ్మి తనే సర్వసంగా భావించాను. కానీ తను నన్ను అంత మోసం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నన్ను కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని అలా నాకు అన్యాయం చేస్తాడని నేను ఏ రోజు కూడా అనుకోలేదు.

ఆస్తి కోసమే
కేవలం ఆస్తి కోసం తను తన మరదలిని పెళ్లి చేసుకుని వెళ్లి పోయాడు. నా జీవితం గురించి ఒక్క క్షణం కూడా తను ఆలోచించలేదు. తనపై గంపెడాశాలు పెట్టుకున్న నన్ను అలా వంచిస్తాడని అనుకోలేదు.

బైక్ పై మేమిద్దరం చక్కర్లు కొట్టిన రోజులు
అయితే తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నా నేను మాత్రం అతన్ని మరిచిపోలేకపోతున్నాను. రోజూ తనతో నేను గడిపిన క్షణాలన్నీ గుర్తొచ్చేవి. తన బైక్ పై మేమిద్దరం చక్కర్లు కొట్టిన రోజులు.. ఒకే కంచంలో ఇద్దరం కలిసి భోజనం చేసిన రోజులు.. ఇలా తనతో గడిపిన ప్రతి క్షణం నాకు మధురమే.

నా బాయ్ ఫ్రెండ్ దూరం అయినందుకు
తన గర్ల్ ఫ్రెండ్ కు పెళ్లయితే అర్జున్ రెడ్డి మూవీలో హీరో ఎలా అయితే బాధపడతాడో అలా నా బాయ్ ఫ్రెండ్ దూరం అయినందుకు అంతకంటే ఎక్కువే బాధపడ్డాను. ఆ మూవీలో హీరోలా ఏవేవో వ్యసనాలకు బానిస కాలేదు కానీ రోజూ ఏడ్చుకుంటూ కూర్చొనేదాన్ని.

ప్రేమలో ఫెయిల్ అయితే
రోజూ నేను తన జ్ఞాపకాలతో సతమతం అయ్యేదాన్ని. ప్రేమలో ఫెయిల్ అయితే అబ్బాయిలు ఏవిధంగా బాధపడతారో అంతకంటే ఎక్కువే బాధపడ్డాను. కాస్త పొడువు ఉండి.. పల్సర్ బైక్ పై ఏ అబ్బాయి వచ్చినా సరే తనే గుర్తొచ్చేవాడు.

బైక్ పై అలా వెళ్తుంటే
ఎవరైనా అమ్మాయి.. అబ్బాయి బైక్ పై అలా వెళ్తుంటే చాలు నాకు అతనితో గడిపిన రోజులే గుర్తొచ్చేవి. టీవీలో ఏదైనా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వస్తే చాలు నాకు నా ప్రేమ కథనే గుర్తొచ్చేది. ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా సరే.. ఏ అబ్బాయి నచ్చేవాడు కాదు.

కట్టె కాలే వరకు
చాలా మంది అబ్బాయిలు.. అబ్బాయిల ప్రేమనే గొప్పనుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా మీకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. కట్టె కాలే వరకు ప్రతి రోజూ ప్రేమించినవాడి గురించే కలలు కంటూ ఉంటారు. మీరంటే ఒక బీర్ తాగి మీ ప్రేమను మరిచిపోతారుగానీ మేము అలా కాదు కదా.



Click it and Unblock the Notifications
