Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
అతను నన్ను నమ్మించి మోసం చేశాడు, కంటిన్యూగా నెల రోజుల పాటు ప్రపోజ్ చేశాడు అందుకే నమ్మాను..
అదేంటీ అమ్మాయి.. మా వాడు మరి మాతో ఒక్కమాట కూడా చెప్పలేదు. వాడికి మొన్ననే మా అన్న కూతురితో ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశాం అంది. ఇప్పుడు నువ్వు ఇలా చెబితే మేము ఏం చేయగలం.
రమ్య ఐ లవ్ యూ అంటూ తను నాకు ఫస్ట్ టైమ్ ప్రపోజ్ చేసినప్పుడు నేను లోలోపల చాలా సంతోషించాను. కానీ బయటకు మాత్రం చాలా కోపం చూపించాను. అన్ని సినిమాల్లో హీరోయిన్లు చెప్పినట్లుగానే నేను కూడా తనకి నో చెప్పాను.
మనసులో మాత్రం కాస్త వెయిట్ చేయించి ఒకే చేయాలని ఉంది. మరుసటి రోజు కూడా తను మళ్లీ నాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ నేను అస్సలు మాట్లాడలేదు. తనకు ఎంత ప్రేమ ఉందో చూడాలని వెయిట్ చేశాను.

నెల రోజుల పాటు చేశాడు
కంటిన్యూగా నెల రోజుల పాటు తను నాకు ప్రపోజ్ చేశాడు. అప్పటికే నేను తన ప్రేమలో పడిపోయాను. ఒక రోజు క్లాస్ లోనే ఫుల్ జ్వరం వచ్చింది. ఫ్రెండ్స్ మొత్తం లంచ్ టైమ్ లో క్యాంటిన్ కు వెళ్లారు.

చేతులపై పడుకోబెట్టుకుని
క్లాస్ రూమ్ లో నేనొక్కదాన్నే ఉన్నాను. అప్పుడు తను నా దగ్గరకు వచ్చాడు. నేను మాట్లాడేపరిస్థితిలో లేను.. త్వరగా హాస్పిటల్ కు తీసుకెళ్లవా అన్నాను. కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్న నన్ను... తను తన రెండు చేతులపై పడుకోబెట్టుకుని బయట ఆటో దగ్గరకు తీసుకెళ్లాడు.

దగ్గరుండీ అన్నీ
ఆటోలో హాస్పిటల్ కు తీసుకెళ్లి నాకు ట్రీట్ మెంట్ ఇప్పించాడు. దగ్గరుండీ అన్నీ చూసుకున్నాడు. అప్పుడనిపించింది జీవితాంతం ఇలాంటి వాడితోనే ఉండాలని. అతని ప్రేమలో నిజాయితీని చూశాను.

వాడుకుని వదిలేసే రకం కాదనిపించింది
తను నన్ను వాడుకుని వదిలేసే రకం కాదనిపించింది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక తనను గట్టిగా హత్తుకున్నాను. "నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడే నేను నీకు పడిపోయాను కానీ నాపై నీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని అలా వెయిట్ చేశాను" అన్నాను.

అప్పటి నుంచి
నీకు జీవితాంతం ఏ లోటు రాకుండా చూసుకుంటానని తను నాకు హామీ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి తను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేదాన్ని. రోజూ తన మెసేజ్ తోనే నాకు రోజూ స్టార్ట్ అయ్యేది.

మునిగితేలిపోయాం
రాత్రి వాట్సాప్ లో తను పంపే ముద్దుల ఎమోజీలతోనే నాకు రోజూ పూర్తయ్యేది. బీటెక్ నాలుగేళ్లు అలా ప్రేమలో మునిగితేలిపోయాం. తను నాపై ఎంత ప్రేమ చూపేవాడంటే.. తను లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేన్నట్లుగా తయారు చేశాడు.

డీప్ లవ్ లో ఉన్నప్పుడు
ఇద్దరం డీప్ లవ్ లో ఉన్నప్పుడు సడెన్ గా తను అదృశ్యం అయ్యాడు. చాలా రోజుల పాటు కాలేజీకి రాలేదు. ఫోన్ స్విచ్ఛాప్. తన ఫ్రెండ్స్ ని అడిగితే తెలియదని సమాధానం. మూడ్రోజులు ఎదురు చూశా. తర్వాత వాళ్ల ఊరికి డైరెక్ట్ గా వెళ్దామని డిసైడ్ అయ్యాను.

కాలేజీకి వెళ్లకుండా
ఒక రోజు కాలేజీకి వెళ్లకుండా తన ఊరికి వెళ్లాను. బస్సు దిగిన తర్వాత నాకు కనిపించిన వారిని అతని ఇంటి అడ్రెస్ చెప్పమని అడిగాను. ఒక అబ్బాయి నన్ను డైరెక్ట్ గా అతని ఇంటికి తీసుకెళ్లాడు.

బనియన్ పై మంచంపై
తను బనియన్ పై ఇంటి ఆవరణలో మంచంపై పడుకున్నాడు. అతన్ని చూడగానే ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడనిపించింది. నన్ను చూడగానే నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావంటూ షాక్ అయ్యాడు.

నా స్టోరీ మొత్తం వాళ్ల అమ్మకు చెప్పా
అంతలోనే ఇంట్లో నుంచి వాళ్ల అమ్మ ఎవర్రా ఆ అమ్మాయి అంటూ బయటకు వచ్చింది. తను తడబడ్డాడు. వాళ్ల అమ్మ నేను కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చింది. తర్వాత కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ తర్వాత నేను నా స్టోరీ మొత్తం వాళ్ల అమ్మకు చెప్పాను.

ఎంగేజ్ మెంట్ అయిపోయింది
అదేంటీ అమ్మాయి.. మా వాడు మరి మాతో ఒక్కమాట కూడా చెప్పలేదు. వాడికి మొన్ననే మా అన్న కూతురితో ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశాం అంది. ఇప్పుడు నువ్వు ఇలా చెబితే మేము ఏం చేయగలం. బంధువులందరిలో మా పరువు పోతుందంది. మేము ఏమీ చెయ్యలేము అంది.

నేను ఎవరో తెలియనట్లు నటించాడు
ఆమె మాట్లాడిని మాటలకు నాకు కోపం రాలేదు.. తను కరెక్ట్ గానే మాట్లాడుతుందనిపించింది. కానీ ఆ సమయంలో నేను ఎవరో తెలియనట్లు నటించిన అతన్ని చూసినప్పుడు చాలా కోపం వచ్చింది. నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు అంతలా ఎందుకు నమ్మించాడనిపించింది.

మర్చిపో
తను నన్ను వాడుకున్నాడని తెలిసొచ్చింది. ఆ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా తను చెప్పలేదు. అయినా అవతలి అమ్మాయి నావల్ల అన్యాయం అయిపోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. అతనికి నన్న పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నిశ్చితార్థం ఎందుకు చేసుకుంటాడు? తర్వాత అతన్ని నిలదీస్తే నన్ను మరిచిపో అని సింపుల్ గా చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. మాట్లాడడం మానేశాడు.

ఇంత దుర్మార్గుడినా ప్రేమించింది
చీ.. ఇలాంటి దుర్మార్గుడినా నేను ప్రేమించింది అనుకున్నాను. కేవలం ఆస్తి కోసం నన్ను నడిరోడ్డుపై వదిలి తన మరదలిని పెళ్లి చేసుకున్నాడు. అందరు అబ్బాయిలు అలాగే ఉంటారని నేను అనడం లేదు. కానీ కొందరు అబ్బాయిలు మాత్రం ఇలా కూడా ఉంటారు.



Click it and Unblock the Notifications











