For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సంబంధ బాంధవ్యాల లక్ష్యాలను పూర్తి చేయాలని జంటలు ఆరాటపడుతుంటారు.

By R Vishnu Vardhan Reddy
|

" గడిపిన ఏ రోజైనా ఉత్తమమైన రోజే " - విన్నీ ది పూహ్

" ఏ సంబంధ బాంధవ్యాలు కూడా ఖచ్చితత్వంతో ఉండవు. నేను ఖచ్చితత్వానికి దూరంగా ఉన్నాను అని తెలుసు కానీ, నువ్వు ఎన్ని సార్లు ప్రయత్నించినా, నేను ఏ విషయంలోనైనా ఒకే అభిప్రాయంతో ఉంటాను " - తెలియని తత్త్వవేత్త

సంబంధబాంధవ్యాల మధ్య నిబద్దత ఉంది అనే విషయం జంటల మధ్య ఉండే ఆనందాన్ని బట్టి చెప్పవచ్చు. ఒక వ్యక్తి తో గాఢమైన, అర్థవంతమైన బంధం ఏర్పడాలంటే ఇవ్వన్నీ చాలా అవసరం.

జంటలు ఎవరైతే పిచ్చిగా ప్రేమలో ఉన్నారో, అలాంటి వారికి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన లక్ష్యాలు చాలా అవసరం. జంటలు కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను చేరుకొని, వాటిని అందుకోవడానికి కృషి చేస్తే చాలా బాగుటుంది.

ఇప్పుడు మనం ఈ వ్యాసంలో కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాల గురించి తెలుసుకోబోతున్నాం. వీటి సహాయం తీసుకొని ప్రేమ లో ఉన్నత స్థాయికి ఎలా చేరవచ్చు, ఆలా చేరినప్పుడు మీ సంబంధ బాంధవ్యాలు మీకు ఏమి చేస్తాయి, అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1 . ఒకరినొకరు ఆనందంగా ఉంచుకోండి :

1 . ఒకరినొకరు ఆనందంగా ఉంచుకోండి :

సంబంధ బాంధవ్యాల విషయంలో ఒకరినొకరు ఆనందంగా ఉంచడానికి కృషి చేయడం అత్యుత్తమ లక్ష్యం అని అధ్యయనం చెబుతోంది. ప్రతి విషయాన్ని సులభంగా ఉండాలని, ఆనందంగా జీవితం గడిచిపోవాలని ప్రతి జంట కోరుకుంటారు. ఐస్ క్రీం ని పంచుకోటం లేదా ఆహారాన్ని మీ చేతితో తినిపించడాన్ని మీ భాగస్వామి గనుక ఇష్టపడితే అలానే చేయండి.

2 . ఒకరికొకరు భాగ్యస్వామికి ఉన్న లక్ష్యాల విషయంలో మద్దత్తు తెలపండి :

2 . ఒకరికొకరు భాగ్యస్వామికి ఉన్న లక్ష్యాల విషయంలో మద్దత్తు తెలపండి :

వ్యక్తులు ఒక బంధాన్ని ఏర్పరుచుకొని తమ జీవిత విషయాలను ఒకరితో ఒకరు పంచుకొంటూ, ఒకరినొకరు అర్థం చేసుకోవటమే సంబంధ బాంధవ్యం. కానీ, దీనర్థం వ్యక్తులు తమకు ఉన్న వ్యక్తిగత లక్ష్యాలను దూరం చేసుకోవాలని కాదు. జంటగా ఉన్నప్పుడు మీరు మీ భాగస్వామి చేరుకోవాలని అనుకుంటున్న లక్ష్యాలకు మద్దతు తెలపండి. ఇలా చేయడం వల్ల మీరు ఉత్తమమైన జంటగా నిలుస్తారు.

3 . ఏదైనా సరికొత్తగా ప్రయత్నించండి :

3 . ఏదైనా సరికొత్తగా ప్రయత్నించండి :

హాయిగా, సరదాగా బయటకు వెళ్ళండి. ఏదైనా కొత్త సినిమా రాగానే థియేటర్ లో చూడండి లేదా కొత్త రెస్టారెంట్ కు వెళ్ళండి లేదంటే కొత్త శృంగార భంగిమను ప్రయత్నించండి. ఇలా కొత్తకొత్త ఆలోచనలను అలోచించి మీ సంబంధబాంధవ్యాల విషయంలో కొత్తదననానికి నాంది పలకండి.

4 భాగస్వామి మాతృ భాషను నేర్చుకోండి :

4 భాగస్వామి మాతృ భాషను నేర్చుకోండి :

జంటగా ఉన్నప్పుడు మీరు చేయవలసిన కొత్త విషయం ఇదే. చాలా మంది వ్యక్తులు భాగస్వామి మాతృ భాషకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వరు. మీ భాగస్వామి వాళ్ళ ఇంట్లో ఏ భాషని అయితే మాట్లాడుతారో ఆ భాషను నేర్చుకొని వారితో మాట్లాడటానికి ప్రయిత్నించండి. ఇలా చేయడం ద్వారా మీ సంబంధ బాంధవ్యాలు మరింత దృఢపడతాయి.

5 ఆరోగ్యవంతమైన సరిహద్దుల్లో మాట్లాడండి :

5 ఆరోగ్యవంతమైన సరిహద్దుల్లో మాట్లాడండి :

సంబంధబాంధవ్యాల్లో చాలా ముఖ్యమైనది లక్ష్యం ఏమిటంటే, జంటలు ఆరోగ్యవంతమైన సరిహద్దులను ఒకరితో ఒకరు పంచుకోవాలి. మీ ఇష్టాలు, అయిష్టాలు, ప్రాముఖ్యతలు మీ భాగస్వామికి తెలిసేలా చేయండి. ఇలా చేయడం వల్ల ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకుంటారు. అంతేకాకుండా దీనివల్ల భాగస్వాములిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతుంది.

6 ఇద్దరికీ నచ్చిన విషయంలో స్వచ్చందంగా ముందుకు రండి :

6 ఇద్దరికీ నచ్చిన విషయంలో స్వచ్చందంగా ముందుకు రండి :

ఇద్దర్ని ఆనందపరిచే విషయాలను ఇద్దరు కలిసి చేయండి. ఉదాహరణకు. మీ ఇద్దరు గనుక జంతు ప్రేమికులు అయితే దగ్గరలోని ఏదైనా జంతు సంరక్షణ సంస్థకు వెళ్ళండి. అక్కడ స్వచ్చందంగా ఏదైనా పని చేయండి. సామాజికంగా ఏదైనా మీరు సహాయం చేయాలని మీరిద్దరూ గనుక అనుకుంటే, దగ్గరలో ఉన్న అనాధ శరణాలయాలకు వెళ్ళండి. అక్కడ ఉన్న ప్రజలతో కొద్దిసేపు నాణ్యమైన సమయాన్ని గడపండి.

ఇలాంటి కొత్త ఆలోచనలు అలోచించి వాటిని అమలు పరుస్తూ ముందుకు వెళ్ళండి. సొంతంగా కూడా అలోచించి ఏదైనా విభిన్నంగా ప్రయత్నించండి. కానీ, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీకు మీ భాగస్వామికి మధ్య ఆ పని మీ బంధాన్ని మరింత దృఢపరిచేదిగా ఉండాలి.

7 మీ ఆలోచనలను బాహాటంగా వ్యక్తపరచండి, మీ గురించి మీరు నిర్మొహమాటంగా చెప్పండి :

7 మీ ఆలోచనలను బాహాటంగా వ్యక్తపరచండి, మీ గురించి మీరు నిర్మొహమాటంగా చెప్పండి :

మీ ఆలోచనలను మీలోనే అణచివేయకండి. వీలైనంతమేర బాహాటంగా వ్యక్తపరచండి. మీరు ఏమి కోరుకుంటున్నారు అనే విషయం మీ భాగస్వామికి తెలిసేలా చేయండి. అలానే ఉండమని మీ భాగస్వామికి కూడా చెప్పండి. ఇలా చేయడం వల్ల భాగస్వాముల మధ్య ఎటువంటి అడ్డుగోడలు ఉండవు, అపనమ్మకాలు అసలే ఉండవు, అపరాధ భావం కూడా ఉండదు. ఈ పద్దతుల వల్ల సంబంధ బాంధవ్యాల్లో కోపం దూరం అవుతుంది. ఆనందంగా స్థిరంగా ఉండాలి అనుకొనే జంటలు ఇలాంటి లక్ష్యాలను పాటించడానికి ప్రయత్నించండి.

ఈ సంబంధబాంధవ్యాల లక్ష్యాలను జంటలు తప్పకుండా ఆచరించినట్లైతే, వారు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపడమే కాకుండా ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

" ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకోండి. అలా చేసినప్పుడు ఏదైనా తక్కువ పడితే, సూర్య చంద్రులను సహాయం చేయమని అడగండి "

జంటలందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆసిస్తూ ఈ వ్యాసం రాయడం జరిగింది.

English summary

Relationship Goals Couples Crave To Complete

Every relationship seeks for its goals that couples want to achieve together and cherish as a part of their own. Go through this article to check whether if you have completed these checklist or are they still pending to be completed."No relationship is perfect and I know I'm far from being perfect but as long as you try I'm willing to stay through anything" - unknown
Story first published:Tuesday, March 20, 2018, 17:21 [IST]
Desktop Bottom Promotion