For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిషేధం : బ్రేకప్ తర్వాత మాట్లాడకూడని మాటలివే

|

కొంతమందికి బ్రేకప్ అనేది హృదయాన్ని కలచివేసే పరిస్థితిగా ఉంటుంది మరియు కానీ కొందరికి తేలికగా తీసుకునే విషయంలా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, నాటకం. తేలికగా తీసుకునేవారు లోలోపల తీవ్రంగా మదన పడవచ్చు, భాదను బయటకు వ్యక్తం చేసేవారిలో నాటకీయత జోడించబడి కూడా ఉండవచ్చు. చెప్పలేం.

ఖచ్చితంగా నిర్వచించలేం. కొన్ని ప్రత్యేకసందర్భాలలో, ఒకరినొకరు అర్ధం చేసుకుని విడిపోతున్న జంటలు కూడా తారసపడుతుంటారు. ఏదైనా కానీ, ప్రేమ విఫలమైతే అంతకన్నా భాధాకరం మరొకటి ఉండదు అన్నది జగమెరిగిన సత్యం. ప్రేమ ఒక మంచి భావన, మరియు ఒక సంబంధంలో ఉండటం అన్న అనుభూతిని పొందడం అనిర్వచనీయంగా ఉంటుంది. కానీ ఉత్తమ సంబంధాలుగా పేరెన్నికగన్నవి, సంక్లిష్ట పరిస్థితుల మద్య విచ్చిన్నం అయ్యే పరిస్థితులు కూడా తరచుగా కనిపిస్తుంటాయి. భాధాకరంగా.

ఈ బ్రేకప్ తేలికగా చేయగలరు. కానీ ఆతర్వాత మీ భాగస్వామితో ఈ మాటలు ఎన్నటికీ అనకూడదు అని గుర్తుపెట్టుకోండి.

ఐ మిస్ యు :

ఐ మిస్ యు :

ఈ మాట మాత్రం బ్రేకప్ తర్వాత అస్సలు అనకూడదు, ఎన్నటికీ. అప్పటికే మిమ్ములను ఇతర కారణాలతో దూరం చేసిన వారైతే, మీ భావాలతో ఆడుకోవడానికి మీరే ఒక అవకాశం కల్పించినవారవుతారు. ఒకవేళ మళ్ళీ మీతో కలిసి ఉండటం జరిగితే, అక్కడ మీరు ఆశించే ప్రేమకు మాత్రం తావుండదని గుర్తుపెట్టుకోండి. మీ చేయని తప్పులు కూడా మీమీద రుద్దే ప్రయత్నానికి మీరే సహకారాన్ని ఇచ్చిన వారవుతారు.

నువ్వంటే నాకిష్టం లేదు :

నువ్వంటే నాకిష్టం లేదు :

బ్రేకప్ అయిన తర్వాత మొట్టమొదటగా కోపంతో అన్ని భావాలను ఒకేసారి బయటకు పెట్టే క్రమంలో భాగంగా, అనేమాటగా “ఐ హేట్ యు” అని ఉంటుంది. అలా అనడం వలన అదనపు ప్రయోజనాలేమీ రావు. ఇంకాస్త దురభిప్రాయాన్ని పెంచడం తప్ప.

నువ్వు లేకుండా సంతోషంగా ఉన్నాను:

నువ్వు లేకుండా సంతోషంగా ఉన్నాను:

మీరు బ్రేకప్ చేసిన తర్వాత, మీకు స్వేచ్చ స్వాతంత్రాలు వచ్చిన అనుభూతికి లోనవ్వొచ్చు. ఇది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ మీరు ఆ భావనను వారితో పంచుకోవడం, వారి మనోభావాలను ఇంకాస్త దెబ్బతీయడమే అవుతుంది. క్రమంగా మీ మీద ఉన్న మంచి ఆలోచన కూడా తుడిచిపెట్టుకుని పోతుంది.

నీకు నన్ను చేరే అర్హత లేదు :

నీకు నన్ను చేరే అర్హత లేదు :

అయితే ఏంటి? అర్హత లేదు అనేముందు, ఆ అర్హత లేని వ్యక్తితో అంతకాలం డేటింగ్ చేసిన మీకు, ఆ మాట అనే అర్హత ఉందా అని ప్రశ్నించుకోండి.

నువ్వు ఎప్పటికీ ఇంతే :

నువ్వు ఎప్పటికీ ఇంతే :

ఏది ఏమైనా ఇతరుల మనోభావాలను దెబ్బతీసే అర్హత ఎవరికీ ఉండదు. ఇటువంటి మాటలు ఇంకాస్త భాధపెడుతాయి.

మనం మళ్ళీ కొత్త జీవితాన్ని తాజాగా ప్రారంభిద్దాము :

మనం మళ్ళీ కొత్త జీవితాన్ని తాజాగా ప్రారంభిద్దాము :

మీరు అతను/ఆమెను కోరుకుంటున్నవారే అయితే, ఇదివరకే ఎందుకు బ్రేకప్ చెప్పారు? ఎవరికైనా బ్రేకప్ చెప్పిన తర్వాత, తిరిగి వారితో జీవితాన్ని గడపాలని అనుకోవడం జరగని పనే అవుతుంది. ఒక వేళ మీరనుకున్న విధంగా జరిగినా కూడా పాత జ్ఞాపకాలు వేటాడుతూనే ఉంటాయి.

నేను మీ స్నేహితునితో ఎందుకు డేటింగ్ చేయకూడదు :

నేను మీ స్నేహితునితో ఎందుకు డేటింగ్ చేయకూడదు :

మీ మాజీ ప్రేమికుని/ప్రేమికురాలిని అసూయపరచేందుకు అనే ఈమాట మీ దిగజారుడుతనాన్ని చూపిస్తుంది.

నువ్వు లైంగిక అంశాలలో చాలా పూర్ :

నువ్వు లైంగిక అంశాలలో చాలా పూర్ :

పడకగది విషయాలు, శారీరిక మరియు మానసిక పరిస్తితులతోనే ముడిపడి ఉంటాయి. ఇతరుల మనసును నొప్పించే ఈ మాటలు హేయమైనవి.

English summary

Restricted- Don’t Use These Words After Break-Up

For some Break is a heartbreaking situation and it sounds may easy to others but is not or sure. Love is a good feeling and being in a relationship is the best to feel that feeling. Yes, it’s true relationship are quite complicated as well as breaking up of a relation with your love one complex your situation everyday .
Story first published: Thursday, August 30, 2018, 16:12 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more