For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెదవి దాటని మాటలే గాయపరుస్తాయి

పెదవి దాటని మాటలే గాయపరుస్తాయి

|

మాటే మంత్రం. మాట్లాడండి. మనసులోని భావాలని బయటపెట్టండి. సృష్టిలోని మానవులకు దక్కిన వరమిది. దీనిని గుర్తించి మాటలలోని శక్తిని గమనించండి. మనం ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడని భావాలే మనల్ని ఎక్కువగా బాధిస్తాయన్న సంగతి మీకు తెలుసా?

మీలోని భావాలను మాటల ద్వారా వ్యక్తపరచండి. స్పష్టంగా ఉండండి. తమ చుట్టూ ఉన్న వారితో తమలోని భావాలను పంచుకొని వారి కోసమే ప్రత్యేకంగా ఈ ఆర్టికల్ ను తీర్చిదిద్దాము. మీరు ఏర్పరచుకునే విధానం బట్టే మీ చుట్టూ ఉన్న వారితో మీ రిలేషన్ షిప్ అనేది రూపుదిద్దుకుంటుంది. భావవ్యక్తీకరణ ద్వారానే మీరు మీ రిలేషన్ ను హ్యాండిల్ చేసే విధానం ఆధారపడి ఉంటుంది.

THINGS THAT WE DONT SPEAK ABOUT ARE THE ONES THAT HURT THE MOST

కమ్యూనికేషన్ అనేది సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీరు ఒకరితో ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారన్న విషయం మీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది.
మనమెందుకు కమ్యూనికేట్ చేస్తాము?

మనమెందుకు కమ్యూనికేట్ చేస్తాము?

మన భావాలను వ్యక్తీకరించటం కోసం కమ్యూనికేట్ చేస్తాము. మన మనసులోని రూపుదిద్దుకున్న ఆలోచనలను మన చుట్టూ ఉన్న వ్యక్తులకు తెలియచేసేందుకు కమ్యూనికేట్ చేస్తాము. మీరు ఎదుటి వ్యక్తి నుంచి ఆశించే అంశాలపై రిలేషన్షిప్ ఆధారపడి ఉంటుందని గుర్తించండి. మీరు ప్రేమను ఆశిస్తే మీరు ప్రేమను వ్యక్తపరచండి. ప్రేమ గురించి కమ్యూనికేట్ చేయండి. మీరు కమ్యూనికేట్ చేయకపోవటం వలన ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మానవుడు సంఘజీవి. కమ్యూనికేషన్ అనేది మానవుడి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కమ్యూనికేషన్ వలన చేకూరే ప్రయోజనాలేంటి?

కమ్యూనికేషన్ వలన చేకూరే ప్రయోజనాలేంటి?

ఒకరి నుంచి దూరంగా ఉండటం వలన మీ ఇద్దరి మధ్య బాంధవ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. వివిధ వ్యక్తుల స్వభావం విభిన్నంగా ఉండటం సహజం. అలాగే ప్రతి సంభాషణ స్వభావం కూడా విభిన్నంగా ఉంటుంది.

కమ్యూనికేషన్ వలన సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయని, మనఃస్పర్థలు తొలగిపోతాయని మీరనుకుంటే మీరు తక్షణమే ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడకపోవడం వలన, మీ భావాలను వ్యక్తపరచకపోవడం వలన, సంభాషణలలో పాలుపంచుకోకపోవటం వలన మీరు రిలేషన్స్ షిప్ ను కాపాడుకోలేరు. మీ ఉనికిని చాటుకోలేరు.

మీరు మీ హ్యాపీనెస్ ను వ్యక్తీకరించినప్పుడే మీరు హ్యాపీనెస్ ను తిరిగి పొందగలుగుతారు. ఒక వ్యక్తి మీతో ఆనందంగా నవ్వుతుంటే మీరు కూడా నవ్వులను జతకలపండి. ఇది కమ్యూనికేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. భావవ్యక్తీకరణ చోటు చేసుకుంటుంది.

ప్రేమలో ఏకమవ్వడానికి దారితీసే అంశమేంటి?

ప్రేమలో ఏకమవ్వడానికి దారితీసే అంశమేంటి?

ఇద్దరు వ్యక్తులు తమ మనసులోని భావాలను బయటపెట్టుకుని ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందన్న విషయాన్ని తెలుపుకున్నప్పుడు వారి మధ్యలో ప్రేమ చిగురించిందన్న విషయం ఇద్దరికీ అర్థమవుతుంది. ఒకరు ప్రేమను వ్యక్తీకరిస్తే మరొకరు అంగీకరించాక ప్రేమ రూపుదిద్దుకుంటుంది. రిలేషన్ షిప్ అనేది టూ వే గేమ్. మీరిద్దరూ కోరుకున్న విధంగా ఈ గేమ్ ను తీర్చిదిద్దుకోవచ్చు లేదా ఇందుకు పూర్తి భిన్నంగా మారవచ్చు.

మనసులో ఉన్న ఆలోచనలకు మాటల రూపంలో స్వేచ్ఛనిచ్చి , తమ హావభావాలతో వ్యక్తపరచడం ద్వారా ఎదుటి వ్యక్తి మనసులో చెరగని ముద్ర వేసుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఏకమవ్వడానికి ఇద్దరి మధ్య చోటుచేసుకున్న సంభాషణలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీరు ఎదుటివ్యక్తిని ప్రేమలో పడమని ఫోర్స్ చేయలేరు. మీరు చేయవలసిందల్లా మీ ప్రేమను వ్యక్తీకరించడం మాత్రమే. కొన్ని సార్లు మీకు సానుకూలమైన స్పందన రావచ్చు లేదా మీ ప్రేమను వారు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అటువంటి సమయంలో వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు చెప్పేవి వినడానికి ఆసక్తిని కనబరచాలి.

కమ్యూనికేషన్ కు దూరంగా ఎందుకు జరుగుతున్నాము?

కమ్యూనికేషన్ కు దూరంగా ఎందుకు జరుగుతున్నాము?

కమ్యూనికేషన్ ను అవాయిడ్ చేయడానికి అనేక ఫ్యాక్టర్స్ దారితీస్తాయి. ఈగో, విచారం, ఆధిపత్యం, కోపం, చిరాకుతో పాటు మరెన్నో విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ అనేది కమ్యూనికేషన్ సరైన విధంగా లేకపోవటం వలన దెబ్బతినే ప్రమాదం ఉంది.

మీ మనసులో ఉన్న భావాలను మీరు కచ్చితంగా వ్యక్తపరచాలి. తరువాత చెప్పొచ్చులే అని మాటలను దాటవేయవద్దు. మీకేదైనా తప్పుగా అనిపిస్తే దాన్ని మనసులో అణచివేయకుండా మీ భావాల్ని వ్యక్తపరచండి.

మనం బయట పెట్టని మాటలే లోలోపల మనల్ని మథనపెడతాయి. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటంతో పాటు కోపం వంటివి ఇబ్బందులను తీసుకువస్తాయి. మీ భావాలను అణచుకోవడం వలన మీకు మనఃశ్శాంతి లోపిస్తుంది. బయటికి వ్యక్తీకరించండి.

మీ భావాలను వ్యక్తపరచకపోతే మీ ఆలోచనాలేంటో ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. దాంతో మీరు అనుకున్న విధంగా రెస్పాన్స్ రాదు. మీరు ప్రేమను వ్యక్తీకరిస్తేనే మీకు ప్రేమ దక్కుతుంది. ప్రేమలో ఎల్లప్పుడూ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి. మనసులో దాచుకోకండి. ప్రేమను వ్యక్తపరచండి.

English summary

THINGS THAT WE DON'T SPEAK ABOUT ARE THE ONES THAT HURT THE MOST

Things that we don't speak about are the ones that hurt the most in life. It is because of our miscommunication or passive human anger that we keep it within and not let the person know. The nature of every emotion is to be let out in the wild and portrayed the same. Love is a meaningful thing that should be expressed all the time.
Desktop Bottom Promotion