For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జంటలు విడిపోయేందుకు దారి తీసే 10 కారణాలు ఇవే

  By M Krishna Adithya
  |

  బంధాలు అనేవి చాలా గట్టివి, అదే సమయంలో చాలా సున్నితమైనవి. ఒక్కోసారి మీకు నచ్చిన తోడు దొరికినట్టు అనిపిస్తుంది. కానీ కొంత కాలం గడిచాక, మీ జీవితాలు వేర్వేరు మార్గాలని తెలుస్తుంది. అంతే కాదు మీరు చాలా అనుభవాన్ని సంపాదించినట్లు అనిపిస్తుంది. అప్పుడు బ్రేకప్ లేదా విడిపోవడం అనే ఆలోచనలు వస్తుంటాయి.

  ఇలా అర్థం లేకుండా, దిశ దశ లేకుండా జరిగే తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి మిమ్మల్ని చిక్కులకు గురిచేస్తాయి. అంతేకాదు విడపోవడానికి సైతం దారితీసే అవకాశం ఉంది.

  WHY DO WE BREAK-UP? 10 REASONS WHY

  కపుల్స్ మధ్య ఒక బంధానికి తెరదించేందుకు అనేక కారణాలు ఉంటాయి. కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ అసలు నిజం మాత్రం వేరే ఉంటుంది.దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటారు. సాధారణంగా కపుల్స్ విడిపోయేందుకు దారి తీసే కారణాలను ఇక్కడ చూద్దాం.

  మీ బంధం సజీవంగా లేదని భావించడం :

  మీ బంధం సజీవంగా లేదని భావించడం :

  చాలా మంది తమ రిలేషన్ షిప్ సరిగ్గా లేదనేందుకు ఇదే కారణం చెబుతుంటారు. ఒక సందర్భంలో మీరు కొనసాగే బంధం ముందుకు వెళ్లడం కుదరదు అనిపిస్తుంది. ఆ బంధం ఒక అచేతన స్థితిలోకి వెళ్లిపోతుంది. ఎంతలా అంటే చలనం లేని నీటి కొలనుగా మారిపోతుంది. బంధంలో కొనసాగే జంట ఊపిరి ఆడనంత అసహనానికి గురవుతుంటారు. వారికి ఇకపై కొనసాగలేము అనేంతలా ఫీల్ అవుతారు.

  మీ బంధం ఓ ఫైటింగ్ క్లబ్ లా మారడం :

  మీ బంధం ఓ ఫైటింగ్ క్లబ్ లా మారడం :

  ఈ తరహా రిలేషన్ షిప్ లో సాధరణంగా ఫైటింగ్ క్లబ్ తరహాలోనే ఇద్దరూ ఘర్షణ పడుతుంటారు. కారణం లేకుండానే ఇద్దరూ తగాదాలు తెచ్చుకుంటారు. కపుల్స్ మధ్య బంధం బలంగా ఉన్నప్పుడు ఇద్దరూ ఘర్షణ పడేందుకు వెనకడుగు వేస్తారు. అయితే మాటలు కోటలు దాటిన తర్వాతే బంధంలో పరస్పర దాడులకు చోటు దక్కుతుంది. పరస్పర దాడులకు దిగిన అనంతరం ఇకపై బంధం కొనసాగుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.

  ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి :

  ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి :

  ఆనందం అనేది మన చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల కలుగుతుంది. అంతే కానీ అది తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. సాధారణంగా కపుల్స్ మధ్య ఉండే బంధాల్లో తోడు ఉండే వ్యక్తి ఆనందంగా లేనప్పుడు మీ రిలేషన్ షిప్ లో తేడాలు వస్తాయి. ఏ వ్యక్తి కూడా తమ బాధను ఎక్కువ కాలం అణిచి ఉంచలేరు. ఏదో ఒక సందర్భంలో బాధను బయటకు వెళ్లగక్కుతారు. అప్పుడే గొడవలు మొదలవుతాయి.

  గతాన్ని తవ్వుకుంటే ఇబ్బందులు తప్పవు :

  గతాన్ని తవ్వుకుంటే ఇబ్బందులు తప్పవు :

  కపుల్స్ మధ్య బంధం కలకాలం నిలవాలంటే గతాన్ని మరిచిపోవడం ఉత్తమమైన పని. ముఖ్యంగా గతంలో కొనసాగిన బేధాభిప్రాయాలు గుర్తుంచుకుంటే మాత్రం గొడవలు మళ్లీ మొదలవుతాయి. గతాన్ని తవ్వకుండా మీ బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అప్పుడు సరికొత్త అనుభవం కలిగి మళ్లీ కలిసి జీవించే అవకాశం కలుగుతుంది. కానీ మీరు గతాన్ని గుర్తు చేసే కొద్దీ, గతంలోని బాధాకరమైన ఘటనలు జీవితాన్ని తొలిచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మీ గతం విడిపోయేందుకే ఎక్కువగా ఆస్కారం కల్పిస్తే మాత్రం వేరుపడటం సహజమే.

  మీరు మోసపోయారని భావించినప్పుడు :

  మీరు మోసపోయారని భావించినప్పుడు :

  మోసం అనేది సాధారణంగా కపుల్స్ మధ్య బ్రేకప్స్ లో కనిపించే ప్రధాన కారణం. సంతోషం లేకుండా ఒక బంధంలో ఒదిగి ఉండటం అనేది చాలా కష్టమైన అంశం. ఎప్పుడైతే మీరు మోసపోయినట్లు భావిస్తారో, అప్పుడు ఆ బంధంలో కొనసాగాలనే ఆశ అడుగంటిపోతుంది. మోసం చేయడం, మోసపోవడం బంధాలను విడగొడుతుంది. అందుకే రిలేషన్ షిప్ లో ఎలాంటి దాపరికాలు లేకుండా చూసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఏదైనా తప్పు జరిగినా దాన్ని దాచుకోకుండా నిజాయితీగా తెలపడం చాలా ముఖ్యమైన విషయం.

  అవగాహన లేకపోవడం :

  అవగాహన లేకపోవడం :

  ఇది చాలా మంది కపుల్స్ లో కనిపించే ఒక సామాన్యమైన విషయం. కపుల్స్ ఇద్దరి మధ్య అవగాహన లేకపోవడం, భిన్న అభిరుచులు కలిగి ఉండటంతో కూడా పొరపొచ్చాలు తలెత్తే ప్రమాదం ఉంది. అక్కడి నుంచి అభిప్రాయబేధాలు తలెత్తి రిలేషన్ షిప్ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  రిలేషన్‌షిప్‌కి సిద్ధంగా లేకపోవడం :

  రిలేషన్‌షిప్‌కి సిద్ధంగా లేకపోవడం :

  కొన్ని సందర్భాల్లో రిలేషన్ షిప్ లో భాగంగా కపుల్స్ మధ్య ఒక ఎమోషనల్ బంధం ఏర్పడే వీలుండదు. దీంతో వారు తమ పార్టనర్ తో జీవితం గడిపేందుకు సిద్ధంగా లేరని భావిస్తుంటారు. అప్పుడు కూడా విడిపోవాలనే కోరిక బలపడుతుంది. ఇద్దరి మధ్య అవగాహనా రాహిత్యం, గోపత్య పాటించడం వంటి కారణాలు కూడా బంధాల మధ్య బీటలు పడేలా చేస్తాయి.

  అభిరుచులు కలవకపోవడం :

  అభిరుచులు కలవకపోవడం :

  ఇది సాధారణంగా కనిపించే లక్షణం, కపుల్స్ ఇద్దరి వ్యక్తిత్వాలు భిన్నంగా ఉండటం, భిన్న అభిరుచులు లాంటివి ఉండటంతో జీవితంలో అడ్జస్ట్ మెంట్ అనేది కుదరకపోవచ్చు. అలాంటప్పుడు కూడా రిలేషన్ షిప్ పై ప్రభావం చూపుతుంది. ఇద్దరి అభిరుచులు కలవని సమయంలో కూడా భేదాభిప్రాయాలు ముదిరే అవకాశం ఉంది.

  గౌరవం దక్కకపోవడం :

  గౌరవం దక్కకపోవడం :

  కొన్ని సందర్భాల్లో అమర్యాదకరమైన పిలుపులు, దుర్భాషలాడటం వంటివి కూడా కపుల్స్ మధ్య బ్రేకప్ కు దారితీస్తాయి. ముఖ్యంగా సున్నిత మనస్కులు ఈ తరహా యాటిట్యూడ్ ను సహించలేరు. ఎదుటి వ్యక్తి నుంచి గౌరవాన్ని ఆశిస్తారు. అంతేకాదు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం వల్ల బంధం గట్టిపడుతుంది. లేకపోతే తెగిపోయేందుకు సిద్ధంగా ఉన్న దారంలా మారుతుంది.

  నమ్మకం లేకపోవడం :

  నమ్మకం లేకపోవడం :

  ఏదైనా బంధం నిలవాలంటే నమ్మకం అనేది చాలా అవసరం. అది కొరవడినప్పుడు ఇద్దరి మధ్య పొరపచ్చాలు అధికమయ్యే అవకాశం ఎక్కువ. నమ్మకం అనేది బంధాలను కలపి ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

  పైనా పేర్కొన్న ఈ పది కారణాలు సాధారణంగా తెగదెంపులకు దారి తీసే కారణాలు. మీకు ఇంత కన్నా ఎక్కువ కారణాలు తెలిసినట్లయితే కింద పేర్కొన్న కామెంట్స్ సెక్షన్ ద్వారా మాకు తెలపగలరు.

  English summary

  WHY DO WE BREAK-UP? 10 REASONS WHY

  The meaningless reasons sounds like it came straight out of a bad rom-com, and it leaves you stranded and confused. There are varied reasons we simply give to end a relationship. The reasons behind these would be something else but we give all kinds of fake reasons to cover the truth. Here are the main reasons why normally people break-up.
  Story first published: Tuesday, March 27, 2018, 20:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more