Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
Mature Love: ప్రేమలో పిల్లబచ్చాలుగా కాదు.. మెచ్యూర్‌గా వ్యవహరించాలి
ప్రేమలో ఎవరైనా పడతారు. అంటే ప్రేమించడం తేలికైన పనే.. ఎవరైనా చేస్తారు. అయితే ఆ ప్రేమను నిలుపుకోవడమే కత్తిమీదు సాము లాంటింది. దానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రేమను నిలుపుకోవడం పిల్లబచ్చాలుగా వ్యవహించే వారికి కష్
Mature Love: ప్రేమలో ఎవరైనా పడతారు. అంటే ప్రేమించడం తేలికైన పనే.. ఎవరైనా చేస్తారు. అయితే ఆ ప్రేమను నిలుపుకోవడమే కత్తిమీదు సాము లాంటింది. దానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రేమను నిలుపుకోవడం పిల్లబచ్చాలుగా వ్యవహించే వారికి కష్టంగా ఉంటుంది కానీ, మెచ్యూర్‌గా ఆలోచించే వారికి ఏమంత కష్టం కాదు.

ప్రేమలో ఉన్నప్పుడు మెచ్యూర్‌గా వ్యవహరించడం, సంభాషించడం చాలా ముఖ్యం. పరిణతి అనేది రోజులు గడిచేకొద్దీ వస్తుంది. అలాగని వయస్సుతో పాటు వస్తుందనుకునంటే పొరపాటే. ప్రేమలో పడ్డాక ఎదుటి వారిని అర్థం చేసుకోవడం ముఖ్యం. వారి సుఖదుఃఖాలను, కష్టనష్టాలను పంచుకోవాలి. భావోద్వేగాలను అంచనా వేయగలగాలి. వారిని పూర్తి అర్థం చేసుకుని సమయానుకూలంగా వ్యవహరించాలి. అప్పుడు అది మెచ్యూర్ లవ్వుగా గుర్తించబడుతుంది. ఇలాంటి ప్రేమే కలకాలం నిలుస్తుంది.
ఏ బంధానికైనా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ అనగానే అదేదో కార్పొరేట్ కల్చర్, ఉద్యోగం చేసే పని అనుకుంటే పొరపాటే. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలనుకోవడం కూడా తప్పే. కమ్యూనికేషన్ అంటే మనం అనుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పగలగాలి. అది మాటలు, మెసేజీలు, ఈమెయిళ్లు ఏదైనా సరే మనం చెప్పాలనుకున్నది అర్థవంతంగా చెప్పగలగాలి. ఎదుటివారిని నొప్పించకుండా ఉంటే ఇంకా బాగుంటుంది.

లవ్వులో మెచ్యూర్‌గా వ్వవహరించడం ఎలా?
1. మాట్లాడేముందు వినడం నేర్చుకోవాలి
మాట్లాడటం ముఖ్యం. ఆ మాటలకు సరిగ్గా రెస్పాండ్ కావడం కూడా చాలా ముఖ్యం. కొన్ని ప్రశ్నలకు, అనుమానాలకు సమాధానం చెప్పే ముందు వాటిని సరిగ్గా వినాలి. వినడం కూడా ఓ కళ. సరిగ్గా విని అర్థం చేసుకున్నప్పుడే సగం జవాబు వచ్చేస్తుంది.

2. ఆరోగ్యకరమైన పరిష్కారం
బంధం అన్న తర్వాత కలహాలు సాధారణం. అయితే అవి వచ్చినప్పుడు ఎలా బయటపడ్డామన్నదే ముఖ్యం. మీ మధ్య గొడవ జరిగితే ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోవడం చాలా ముఖ్యం. ఎవరో ఒకరు గెలుపొందాలన్న ఉద్దేశంతో పరిష్కారం చూడొద్దు.

3. బాధ్యత తీసుకోవాలి
మీరు చేసే పనులకు, మాట్లాడే మాటలకు మీదే బాధ్యత. కాబట్టి ఏ పని చేసే ముందైనా, మాట్లాడే ముందైనా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి మనస్సును నొప్పించే మాటల చెప్పాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇక తప్పదు అనుకున్నప్పుడు సాధ్యమైనంత తక్కువగా మనసును నొప్పించాలి.

4. సరిహద్దులు తెలుసుకోవాలి, నడుచుకోవాలి
ప్రతి ఒక్కరికి వ్యక్తిగతం ఉంటుంది. అది వారికి చెందింది మాత్రమే. భార్య అయినా భర్త అయినా ఇంకెవరైనా సరే కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని గౌరవించడం నేర్చుకోవాలి. పరిమితులు ఏంటో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకోవాలి.

5. మ్యూచువల్ రెస్పెక్ట్
గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. మనం ఎదుటివారికి గౌరవం ఇచ్చినప్పుడు వారు మనకు గౌరవం ఇస్తారు. మీది ఎలాంటి బంధం అయినా గౌరవం ఇవ్వడం, తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా బయటి వ్యక్తులు ఉన్న సమయంలో అవహేళనగా మాట్లాడటం అస్సలే చేయొద్దు.

6. మద్దతు
మంచి, చెడు సమయాల్లో జీవిత భాగస్వామికి ఎప్పుడూ మద్దతుగా నిలబడాలి. ఎలాంటి సమయాల్లో అయినా భాగస్వామికి ఎప్పుడూ అండ ఇవ్వాలి. మద్దతు ఇస్తారని ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడాలి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. బంధంలో రోజులు గడిచే కొద్దీ సమయానుకూలంగా, సందర్భానుకూలంగా చేయాల్సిన పని ఇది.
వీటితో పాటు క్షమాపణ చెప్పడం నేర్చుకోవాలి. సారీ చెప్పడం నేర్చుకోవడం ఎందుకు అనే డౌట్ వస్తుంది. కానీ సారీ చెప్పడం ఓ కళ. ఎదుటివారికి సారీ చెప్పడం అంటే చెప్పుకున్నంత సులభంగా ఏమీ ఉండదు. ఈగో అడ్డొస్తుంది. దానిని పక్కకు తోసి క్షమాపణ చెప్పగలగాలి. అప్పుడే బంధం నిలబడుతుంది.



Click it and Unblock the Notifications