For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇవి వింటే షాకవుతారు..! వివాహేతర సంబంధాల విషయంలో విస్తుపోయే నిజాలు చెప్పిన పలు అధ్యయనాలు...

వివాహానికి ముందు చాలా మంది పురుషులు తమ కాబోయే భార్య గురించి ఎక్కువగా ఇలా చెబుతున్నారు. తమ భార్య పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత కేవలం ఒకే ఒక సంబంధంలో ఉంటుంది అని చెబుతుంటారు.

|

మన దేశంలో వివాహం అయిన పురుషులు ఎక్కువగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఇప్పటికీ మన ప్రాంతంలో మనకు తెలియకుండా మన చుట్టూ గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి వ్యవహారాలను చాలా మంది కొనసాగిస్తున్నారు. కానీ టెక్నాలజీ పుణ్యమా ఇలాంటివి కొన్ని బట్టబయలు అయిపోతున్నాయి. అయితే అప్పట్లో ఇలాంటివి లేకుండా పురుషులకు బహూభార్యత్వం అవకాశాలు ఉండేవి.

Most women have affairs for different reasons than men

ఒక మగాడు తనకు కావలసినంత మంది మహిళలను పెళ్లి చేసుకోవచ్చు. వారితో ఆ ఘట్టంలోనూ ఎన్ని గంటలైనా పాల్గొనవచ్చు. అయితే అప్పట్లో మహిళలు మాత్రం కేవలం భర్తతో శృంగార కోరికలు తీర్చుకోవాలి అనే నియమం ఉండేది. అయితే కాలానికి అనుగుణంగా పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. ప్రస్తుతం ఒక మహిళ తనకు కావాల్సిన పురుషుడితో రిలేషన్ షిప్ పెట్టుకునేందుకు సొంత హక్కులా ఫీలవుతోంది. వీటిని సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ఇలాంటి ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడ్డాయి.

పెళ్లికి ముందు అందరూ..

పెళ్లికి ముందు అందరూ..

వివాహానికి ముందు చాలా మంది పురుషులు తమ కాబోయే భార్య గురించి ఎక్కువగా ఇలా చెబుతున్నారు. తమ భార్య పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత కేవలం ఒకే ఒక సంబంధంలో ఉంటుంది అని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం వివాహం అయిన కొద్దిరోజులు భార్యభర్తలు బాగానే గడుపుతున్నారు. అయితే కొంత కాలం తర్వాత భర్తను కాదనుకుని మహిళలు వేరే పురుషుడిపై వ్యామోహం పెంచుకుంటున్నారో లేదో గమనించాలి. ఎందుకంటే ప్రస్తతు సమాజంలో స్త్రీ, పురుష సంబంధాలు చాలాక్లిష్టంగా మారాయి.

వివాహేతరం సంబంధం నేరం కాదు..

వివాహేతరం సంబంధం నేరం కాదు..

గత సంవత్సరమే సుప్రీం కోర్టు కూడా వివాహేతర సంబంధం నేరం కాదని తీర్పు కూడా ఇచ్చింది. అంతేకాకుండా భారత చట్టంలోని సెక్షన్ 497ను కూడా తొలగించింది. ఒక వయోజన వయసు వచ్చిన మగాడు కూడా తనకు కావాల్సిన ఆడవారితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాడు.

భర్త అంటే యజమాని కాదు..

భర్త అంటే యజమాని కాదు..

వివాహేతర సంబంధం వల్ల అనేక మంది విడాకులు తీసుకుంటున్నారు. అయితే అది నేరం కాదు. కానీ వివాహేతర సంబంధం కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లడం నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మహిళలకు భర్తలు అనే వారు ఒక రక్షణ లాంటివారు అని తెలిపింది. ఈ తీర్పు సాంస్కృతిక ఉగ్రవాదులకు పెద్ద దెబ్బగా మారింది.

నిరీక్షణ నెరవేరని సమయంలో..

నిరీక్షణ నెరవేరని సమయంలో..

ప్రతి అమ్మాయి తాను వివాహం చేసుకునే అబ్బాయి గురించి కొన్ని కలలను కంటుంది. తన భర్త ఆమెతో ఎలా వ్యవహరించాలి. ఎలా సంబంధాన్ని పెంచుకోవాలి అనే దాని గురించి ఎన్నెన్నో ఊహించుకుంటుంది. అయితే ఇందుకు విరుద్ధంగా పురుషుడు ప్రవర్తిస్తే అప్పుడే వారికి ఇతర సంబంధాలను వెతుక్కునేందుకు దారి తీస్తుంది.

బ్లాక్ మెయిల్ వల్ల..

బ్లాక్ మెయిల్ వల్ల..

ఒక పురుషుడు భర్త స్థానంలో ఉండి భార్యను బానిసగా భావించి దుర్వినియోగానికి, దుర్మార్గాలకు పాల్పడితే స్త్రీ దాన్ని అవమానంగా భావిస్తుంది. తను జీవితాంతం బాధపడుతుంది. అలాంటి సందర్భంలోనే తన భర్త నుండి బ్లాక్ మెయిల్స్ లేదా బెదిరింపులు వంటివి ఎక్కువ అవుతున్న సమయంలో, ఇతర పురుషులు ఎవరైనా ఆప్యాయతగా, ప్రేమగా పలకరిస్తే అలాంటి వారిపై వ్యామోహం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా వివాహేతర సంబంధాలకు దారితీస్తుంది.

తనకు సెక్యూరిటీ లేనప్పుడు..

తనకు సెక్యూరిటీ లేనప్పుడు..

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్క మహిళ ఒక పురుషుడి రక్షణను ఆశిస్తుంది. అలాగే భర్త నుండి ఎక్కువ సెక్యూరిటీని ఆశిస్తుంది. అయితే అలాంటి భద్రత వేరే వారి నుండి వస్తే కూడా ఆ మహిళ అటువైపు ఆకర్షించబడుతుంది. ఈ కారణాల వల్లే కొందరు మహిళలు వివాహేతర సంబంధాలకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

 మీ భార్యతో సరైన సమయం గడపకపోతే..

మీ భార్యతో సరైన సమయం గడపకపోతే..

మీరు మీ జీవిత భాగస్వామితో ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ సేపు గడపాలి. ఆఫీసుకు వెళ్లే మహిళలు, అలాగే ఇంట్లో ఉండే మహిళలు తన భర్త తనతో ప్రైవేటుగా గడపాలని కోరుకుంటారు. అయితే మీరు వారికి సమయం ఇవ్వనప్పుడు, ఆ సమయంలో మరో మగ వ్యక్తి స్నేహం వంటివి లోతుగా వెళితే అది కూడా భార్యభర్తల సంబంధాన్ని చెడగొడుతుంది. కాలక్రమేణా అది కూడా వివాహేతర సంబంధంగా మారే అవకాశం ఉంది.

విడిగా ఉంటున్నప్పుడు..

విడిగా ఉంటున్నప్పుడు..

భార్యాభర్తలు చాలా కాలంగా విడిపోయి ఉంటే కూడా వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. ఇప్పటికీ ఎక్కువగా విడిపోయిన కుటుంబాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వారి శారీరక అవసరాలను తీర్చడానికి వారికి మగ తోడు అవసరమైనప్పుడు, వారు వివాహేతర సంబంధాన్ని ప్రారంభిస్తారు. ఇది అన్ని కుటుంబాలలో సంభవించినప్పటికీ, కొన్ని అధ్యయనాలు ఈ కుటుంబాలు ఇతర కుటుంబాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నాయి.

భావోద్వేగాలపై అవగాహన లేక..

భావోద్వేగాలపై అవగాహన లేక..

మహిళలు తమ భర్త నుండి ఎక్కువగా ఆశించేది వారి భావాలను అర్థం చేసుకోవడం. వారి భావాలను అర్థం చేసుకోలేనప్పుడు, వారు తమ భర్త పట్ల ఒక విధమైన ఆగ్రహాన్ని కనబరుస్తారు. అలాంటి సందర్భాల్లో వారి భావాలకు విలువ ఇచ్చే మగవారు ఎవరైనా, వారితో స్నేహపూర్వకంగా నడుచుకుంటే అది ప్రేమగా మారడం సాధ్యమవుతుంది.

అసంపూర్ణ శృంగారం..

అసంపూర్ణ శృంగారం..

చాలా మంది మహిళలో తమ వివాహ జీవితంలో శృంగార విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమయంలో స్త్రీలు వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పురుషుల భావోద్వేగాలు వేరు. స్త్రీల భావోద్వేగాలు వేరుగా ఉంటాయి. ఇతర మహిళతో మగవారు శృంగారాన్ని చాలా సులభంగా చేసేస్తారు. అయితే మహిళలు వారి భావోద్వేగ శృంగారాన్ని ఆశిస్తారు. అది వారికి నచ్చినట్టు జరగకపోతో వారు చిరాకు పడతారు. తమకు అలాంటి అవసరాలను తీర్చే వారి సంబంధం కోసం వెతుకుతారు. ఇలాంటి వారు విడాకులు సైతం వేగంగా తీసుకుంటారు. ఇప్పటికే విడాకుల కేసులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా వివాహ జీవితం సరిగా లేని సమయంలో ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నాయి.

English summary

Most women have affairs for different reasons than men

Read to know how sexting affect your life. Take a look.
Desktop Bottom Promotion