For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శృంగార జీవితంలో బోర్ కొట్టకుండా మజాను పొందాలంటే.. ఈ పనులు చేయాలి...

|

వయసులో ఉన్న వారిలో చాలా మంది శృంగారంలో పాల్గొనాలని తహతహలాడుతుంటారు. అందులో ఉండే మజాను పొందాలని తెగ ఉబలాటపడుతుంటారు. తమ భాగస్వామితో శృంగార జీవితాన్ని తనివి తీరా అనుభవించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.

అయితే కొన్నిసార్లు మీరు ఊహించనంతగా అందులో ఆనందాన్ని పొందలేక పోతారు. ఇంకా కొందరికి ఏమో వారి శరీరం సహకరించదు. మరి కొందరికి ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రతి నిత్యం గజిబిజీగా, గందరగోళంగా గడపడం వల్లే శృంగార జీవితంపై శ్రద్ధ చూపలేకపోతారు. అయితే ఇలాంటప్పుడే మీరు మీ లైంగిక జీవితంలో మజాను పొందేందుకు చిన్న చిన్న మార్పులు చేయాలి.

ఎందుకంటే ఏదైనా సమస్యకు మూలం కనుగొంటే అందుకు పరిష్కారం కనుగొనడం చాలా సులభం. ఈ సందర్భంగా మీ శృంగార జీవితంలో ఎప్పుడూ బోర్ కొట్టకుండా మీరు ప్రతి వారం మజాను పొందాలంటే ఏమి చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి...

ఇద్దరి కోరికలు ఒకే రకంగా..

ఇద్దరి కోరికలు ఒకే రకంగా..

మీరు మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే ముందుగా మీరు మీ ప్రియుడు లేదా ప్రియురాలి మనసును అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మీ భాగస్వామి శృంగార కోరికలను అర్థం చేసుకోవాలని మీరు ఆశించడంలో తప్పు లేదు. అయితే మీ ఇద్దరి కోరికలు మరియు ఫాంటసీల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ మాటల ద్వారా శృంగార జీవితం ఎంత ముఖ్యమైనదో మీ భాగస్వామికి తెలియజేయాలి. ఆరోగ్యానికి ఆ ఘట్టం ఎంత మంచిదో మీ భాగస్వామికి చెప్పడంలో మీరు విజయవంతం అయితే చాలు.. మీ పార్ట్ నరే మిమ్మల్ని శృంగారానికి సౌకర్యవంతంగా మార్చేస్తుంది.

సంబంధంపై ప్రభావం..

సంబంధంపై ప్రభావం..

మీరు మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్న సమయంలో అది మీ సంబంధంపై చాలా వరకు సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు శృంగారానికి సిద్ధంగా ఉంటే.. మీ భాగస్వామి సిద్ధంగా లేకపోవడం లేదా మీ భాగస్వామి రెడీగా ఉంటే మీరు నిరాకరించడం వంటివి చేసిన సమయంలో మీ సంబంధంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే మీరు ఇద్దరు సమానంగా శృంగార కార్యంలో పాల్గొనాలి. దీనిని విధిగా అమలు చేయాలి. ప్రతిసారీ ఈ విధంగా చేస్తే మీ ఇద్దరికీ ఎలాంటి ఒత్తిడి అనేదే ఉండదు.

ఫోర్ ప్లే లేకపోతే..

ఫోర్ ప్లే లేకపోతే..

శృంగార జీవితంలో ఫోర్ ప్లే లేకపోతే కొన్నిసార్లు బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఏది ఏమైనా మీరు శృంగార జీవితంలో తొందరపడకూడదు. మీ ఇద్దరికీ సమయం అనుకూలంగా ఉన్నప్పుడే ఆ పని చేయాలి. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే అది తప్పుడు సంకేతంగా ఉంటుంది. అలాగే మీ భాగస్వామి ఏమి ఇష్టపడుతున్నారో తెలుసుకునేందుకు ఫోర్ ప్లే అనేది ఒక చక్కనైన మార్గం అని మీరు గుర్తు ఉంచుకోవాలి. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత లోతుగా తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.

మళ్లీ మళ్లీ అదే చేస్తుంటే..

మళ్లీ మళ్లీ అదే చేస్తుంటే..

మీరు నిత్యం శృంగారంలో పాల్గొనేటప్పుడు రోటీన్ గా చేస్తే మీకు కచ్చితంగా బోర్ కొడుతుంది. అందుకే మీ శృంగార జీవితంలో అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేయాలి. ముందుగా శృంగార దినచర్యకు బదులుగా మీరు మీ భాగస్వామిని ఉత్తేజపరిచే మార్గాల గురించి ఆలోచించాలి. ఉదాహరణకు మీ వంట గదిలో ఆమెపై ప్రేమను చూపించడం వంటివి చేయాలి లేదా కళ్లకు గంతలు కట్టే ఆట ఆడటం లేదా మీ భాగస్వామిని ఎలాంటి డ్రస్ నచ్చుతుందో అలాంటి వాటిని ధరించడం చేయాలి. మహిళల విషయంలో అయితే లోదుస్తులు చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఇలాంటివి మీ శృంగార జీవితంలో కచ్చితంగా మార్పు తెస్తాయి.

కౌగిలింత లేకపోతే..

కౌగిలింత లేకపోతే..

మీ శృంగార జీవితంలో ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాలంటే.. మీరు ఆ ఘట్టం పూర్తి చేసిన తర్వాత వెంటనే నిద్రలోకి జారుకోకండి. మీరు వెంటనే కునుకు తీయడం వంటివి చేసినా కూడా మీ భాగస్వామిని మీరు నిర్లక్ష్యం చేశారని అపార్థం చేసుకోవచ్చు. అందుకే శృంగార కార్యం పూర్తి అయిన వెంటనే మీ భాగస్వామిని గట్టిగా కౌగిలించుకోవడం వంటివి చేయాలి. అలా చేస్తే ఆమెను మీరు మరింత ప్రేమిస్తున్నట్లు అర్థం చేసుకుంటుంది. అంతేకా మీరిద్దరూ లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి మీ లైంగిక జీవితానికి మంచి మజాను ఇస్తాయి.

బ్లేమ్ గేమ్..

బ్లేమ్ గేమ్..

చాలా మంది జంటలు వారు తమ శృంగార జీవితంలో సంతోషంగా, ఉత్సాహంగా లేకపోతే వారి భాగస్వామిపై నిందలు వేస్తారు. అలా చేయడం కరెక్టు కాదు అని వారు తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి రిలేషన్ లో నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. అలాంటి బ్లేమ్ గేమ్ లను తరచుగా ఆడటం వంటివి మీరు కచ్చితంగా మానేయాలి. మీరు ఇద్దరూ ఎప్పుడూ శృంగార జీవితంలో సంతోషంగా పాల్గొన్నారని అర్థం చేసుకోవాలి. దీని వల్ల మీరు ఉత్తేజపరిచే లైంగిక జీవితాన్ని పొందవచ్చు.

పడక గదికే పరిమితమవ్వదు..

పడక గదికే పరిమితమవ్వదు..

చాలా మంది మహిళలు శృంగారం అంటే పడక గదికే పరిమితం అని అనుకుంటారు. అలాంటి వాటి గురించి బయట చర్చించడం అనేది తప్పుగా భావిస్తుంటారు. ఇలాంటి అపొహలు ఉండే వారికి వారి భాగస్వాములే బిడియాన్ని, సిగ్గును పక్కన పెట్టి బెడ్ రూమ్ బయట కూడా రతి క్రీడను ఆస్వాదించొచ్చు అనే విషయాలను తెలియాజేయాలి.

కొత్త కొత్త ప్రదేశాల్లో..

కొత్త కొత్త ప్రదేశాల్లో..

మీ భాగస్వామితో కొత్త కొత్త ప్రదేశాల్లో రతి క్రీడలలో పాల్గొనడం కూడా శృంగార సంప్రదాయంలో ఒక భాగం అని తెలుసుకోవాలి. అలాంటి శృంగారాన్ని మీరిద్దరూ బాగా ఆస్వాదించగలుగుతారు. అది చాలా సౌకర్యవంతమైనది కూడా. అలాంటి శృంగార జీవితాన్ని నిజం చేసేందుకు ప్రయత్నించి చూడండి. అప్పుడు అందులో కలిగే మజా ఏంటో మీకే తెలుస్తుంది.

ఉత్తేజకరమైన శృంగారానికి..

ఉత్తేజకరమైన శృంగారానికి..

ఉత్తేజకరమైన లైంగిక జీవితానికి షార్ట్ కట్ లేదు. మీ నిజమైన ప్రయత్నాలు మరియు ప్రేమ మీ లైంగిక జీవితాన్ని పెంచుకోవడంలో మీకు సహాయపడతాయి. దీనికి తోడు, మీరు మీ భాగస్వామితో లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టవచ్చు, తద్వారా సెక్స్ గురించి మాట్లాడేటప్పుడు మీరిద్దరూ ఒకే పేజీలో ఉంటారు. ఈ విధంగా మీరు మీ సమయాన్ని మరియు కృషిని మంచి లైంగిక జీవితం కోసం పెట్టుబడి పెట్టగలుగుతారు.

English summary

Signs You Need To Bring A Change In Your Sex Life

At times, you may think your sex life is going smooth and there is nothing to worry about, especially when it is satisfying. But there are some signs that can tell you if your sex life is missing excitement.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more