For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామి మీపై కేర్ తీసుకుంటున్నారా? లేదా కంట్రోల్ లో పెడుతున్నారా?

ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ప్రేమ కాలం వస్తుంది.

|

ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరకీ ప్రేమ అనేది ఒక అద్భుతమైన అనుభూతి. మన జీవితంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సమయంలో కచ్చితంగా ప్రేమ అనేది పుడుతుంది. ఈ ప్రేమ వల్ల లభించే ఆనందం, సంతోషంతో పాటు మరెన్నో ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ ప్రేమలో ఉన్నప్పుడు కీలకమైనది రొమాన్స్. ప్రేమలో ఉన్న సమయంలో జంటలకు రొమాన్స్ అంత సులభం కాదు.

Ways To Know Whether Your Man Is Really Caring Or Controlling

కొంత మందికి రొమాన్స్ లో ఆనందం కంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిని అధిగమించడానికి కూడా కొన్ని మార్గాలున్నాయి. అదేంటంటే ప్రేమలో ఉన్న అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఒకరినొకరు గౌరవించుకుని, వారి హక్కులను కాపాడుకున్నప్పుడు వారి సంబంధం ఆరోగ్యకరంగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సాధారణంగా ప్రేమలో ఉన్న కొంతమంది పురుషులు సంరక్షణ లేదా కేరింగ్ పేరిట ఎక్కువ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు. ఇది వారి శృంగారం నుండి విడిపోవడానికి మొట్టమొదటి దశ. ఇది వారి పితృస్వామ్యానికి వ్యక్తీకరణ, అయితే పురుషులు ఈ చర్యలను ఆందోళనగా సమర్థిస్తారు.

స్నేహితుల నుండి వేరుచేయడం..

స్నేహితుల నుండి వేరుచేయడం..

ప్రేమలో ఉన్న భాగస్వాముల్లో ప్రారంభంలో ఇది చాలా స్వీట్ మరియు కేరింగ్ గా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవానికి మానసికంగా సంబంధించిన ఒక లోతైన క్రీడ. మొదట, అతను మీతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యుల నుండి మిమ్మల్ని వేరు చేస్తే అతడిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే లేదా వీటి గురించి తెలిస్తే ముందుగా వీటిని గుర్తించి పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నిరంతరం మీపై నిఘా పెట్టడం..

నిరంతరం మీపై నిఘా పెట్టడం..

ఇది మొదట మీకు ఆహ్లాదకరంగా అనిపించవచ్చు. కాని దీని వెనుక కారణం వేరే ఉంటుంది. ఇది కచ్చితంగా నిజం కాదు. సాధారణంగా మీ భాగస్వామి రోజుకు ఒకసారి మిమ్మల్ని తనిఖీ చేస్తే పర్వాలేదు, కానీ అతను నిరంతరం మీపై నిఘా పెట్టడం మరియు ప్రతి క్షణం మీరు ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి వారు ఉపయోగించి ఏకైక ఆయుధం ఇది. దీని వల్ల వారు మీ మనసుతో ఆటలు ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు వారి దారికి రాకుండా, మీ మనసుకు నచ్చినట్టు చేస్తే చాలు. వారు మిమ్మల్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదని గ్రహిస్తారు.

మీ కోరికలు చెబితే..

మీ కోరికలు చెబితే..

మీరు మీ భాగస్వామి ఏదైనా మాట చెప్పిన సమయంలో ఆ మాటను వినకపోతే వారు కలత చెందుతారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ కోరికలు చెబితే వారికి కోపం వస్తుందా? అవును అయితే, మిమ్మల్ని కంట్రోల్ చేసే వ్యక్తితో మీరు ప్రేమలో ఉన్నారని అర్థం. మంచి మరియు ఆరోగ్యకరమైన సంబంధంలో ఉన్నప్పుడు మీకు మరియు మీ భాగస్వామికి ఏమి కావాలో అది చేయొచ్చు. వాస్తవానికి మీ ప్రియుడు మీ అభిప్రాయాలకు మద్దతు ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో త్వరగా మీరు తప్పించుకోవడం మంచిది.

మీ పాస్ వర్డులను అడుగుతారు..

మీ పాస్ వర్డులను అడుగుతారు..

మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకు అబ్బాయిలు మీ పాస్ వర్డులను పదే పదే అడుగుతుంటారు. అయితే మీరు పాస్ వర్డ్ మీకు ఇష్టమైతేనే ఇవ్వండి. ఒకవేళ మీ భాగస్వామికి మీ పాస్ వర్డులను ఇవ్వడం వంటివి మీకు నచ్చకపోతే మీరు అతన్ని ఎంతగా ప్రేమించినా మీ పాస్ వర్డ్ మరియు మీ రహస్యాలను షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను తెలుసుకున్న తర్వాత మీ భాగస్వామి మీకు సంబంధించిన సోషల్ మీడియా సైట్ లను మరియు మీ ఇమెయిల్స్ తో పాటు ఇతర వివరాలన్నీ చెక్ చేస్తారు. అంతటితో ఆగకుండా దాని గురించి పొంతన లేని ప్రశ్నలు అడుగుతారు. దీని వల్ల మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే మీ పాస్ వర్డులను అడిగే వారి ప్రేమికుడు పరిపూర్ణం కాదనేందుకు ఇది ఒక సంకేతం

ప్రశంసలు..

ప్రశంసలు..

మీ భాగస్వామి మిమ్మల్ని పదే పదే ప్రశంసించడం అనేది ఒక మంచి వ్యూహం వంటిది. ఉదాహరణకు మీరు అందంగా ఉన్నారని చెప్పడం. కానీ దానిని మార్చడం అంటే, మీ స్వరూపం వారికి సంతృప్తికరంగా లేదని చెప్పడం. మహిళలు తమ అభిప్రాయాన్ని దాని వెనుక అసలు కారణం తెలియకుండానే అంగీకరిస్తారు. ఇది వారి అందాన్ని కొద్దిగా కోల్పోయేలా చేస్తుంది.

విరుద్ధమైన ప్రకటనలు..

విరుద్ధమైన ప్రకటనలు..

అసమ్మతి తలెత్తినప్పుడు ద్వేషాన్ని నియంత్రించే పురుషులు మీ ఆలోచనల నుండి ప్రతిదాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. మీరు అతని అభిప్రాయంతో విభేదిస్తున్నారని అతనికి చెప్పినప్పుడు వారు కలత చెందుతారు. మీరు అతని విరుద్ధమైన ప్రకటనలు చేసినప్పుడు, వారు మీరు తప్పుగా భావించే వాటిని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అవి మీరు ఏమనుకుంటున్నారో మరియు మీరు చేయాలని ఆశిస్తారు.

Read more about: relationship
English summary

Ways To Know Whether Your Man Is Really Caring Or Controlling

Here are some useful ways to know whether your man is really caring or controlling. Read on
Story first published:Thursday, October 31, 2019, 10:49 [IST]
Desktop Bottom Promotion