Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దంపతుల మధ్య సంతోషం, సంతృప్తి లేవా? అయితే ఇలా చేయాల్సిందే!
దాంపత్యబంధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషాలు, కష్టాలు, నష్టాలు, ఆనందాలు అన్నీ ఉంటాయి. బాధలు, కన్నీళ్లు లేకపోతే సంబంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేమంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. అయితే ఎప్పుడూ ఏదో అసంతృప్తి ఉండటం మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. భార్యాభర్తలు అన్నాక ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు రాజీ పడాల్సిందే.
ప్రతి సారీ నేనే ఎందుకు అడ్జస్ట్ కావాలి, రాజీ పడాలని అనిపించవచ్చు. అలాగే ఎప్పుడూ ఒకరే అడ్జస్ట్ అవ్వడం కూడా ఆ దాంపత్య బంధానికి మంచిది కాదు. దాంపత్యబంధంలో సంతోషం, సంతృప్తి లేకపోతే దానికి కారణమేంటో గుర్తించి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. భాగస్వాముల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నా, ఇద్దరూ సంతోషంగా లేకపోయినా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాత గాయాలను గుర్తుచేసుకోవద్దు:
గతంలో జరిగిన స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకోవడం ద్వారా ఆనందంగా ఉండొచ్చు. కానీ గతంలో జరిగిన కలహాలు, గొడవలు గుర్తుచేసుకోవడం ద్వారా జరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ఏదైన విషయంలో గొడవ జరిగితే దానికి మాత్రమే పరిమితం కావాలి. వేరే విషయాలను అందులోకి తీసుకురావొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
2. కమ్యూనికేషన్ చాలా కీలకం:
ఏ సంబంధమైనా బాగుండాలంటే కమ్యూనికేషన్ చాలా కీలకం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి అపార్థాలు, అపోహలు లేకుండా ఉండాలంటే సరిగ్గా కమ్యూనికేట్ చేయగలగాలి. ఇష్టాలైనా, అయిష్టాలైనా చెప్పి తీరాలి. అప్పుడే ఎదుటి వారికి ఎలా మెలగాలో తెలుస్తుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.
3. నమ్మకం ఉండాలి:
నమ్మకం లేకుండా ఏ బంధం ఎక్కువ కాలం నిలబడదు. ముఖ్యంగా దాంపత్య బంధంలో ఇద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అయితే నమ్మకం ఒక్క రోజులో వచ్చేది కాదు. నమ్మకం రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ అది పోవడానికి అరక్షణం చాలు. అందుకే నమ్మకం పెంచుకోవాలి. నమ్మకంగా నడుచుకోవాలి.
4. భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి:
గొడవలు, కలహాలు, కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయో సరైన కారణం తెలుసుకోవాలి. ఎదుటివారు అలా ప్రవర్తించడానికి కారణాలేంటో తెలుసుకుంటే వారి కోపాన్ని, బాధను తగ్గించవచ్చు. ఏదైనా పని వల్ల ఎదుటివారు ఎలా ఫీలవుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
5. ప్రశంసలు, కృతజ్ఞతలు తప్పనిసరి:
ఒకరు మరొకరిని ఎట్టిపరిస్థితుల్లో తేలిక తీసుకోవడం కానీ, తీసిపారేసినట్లు మాట్లాడటం కానీ చేయకూడదు. దంపతుల్లో ఎవరైనా ఒకరు ఏదైనా మంచి పని చేసినా, మీ కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నించినా వారిని థ్యాంక్స్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేశావంటూ చెప్పాలి. మీరేదైనా తప్పు చేస్తే సారీ చెప్పాలి.
6. గొడవలు హద్దు మీరొద్దు:
భార్యాభర్తల మధ్య గొడవలు చాలా సాధారణం. ప్రతి జంట మధ్య ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే ఎలాంటి గొడవ అయినా ఒక స్థాయి వరకు మాత్రమే ఉండాలి. నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి. కోపంలో, ఆవేశంలో అనరాని మాటలతో దుర్భాషలాడవద్దు.



Click it and Unblock the Notifications