Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఇలాంటి కూతురు ఎవ్వరికీ వద్దు: తప్పుడు పనికి అలవాటుపడ్డ కూతురు,చూసిన తండ్రిని దారుణంగా..
తండ్రికి కూతురుకి మధ్య ఉండే అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. కూతురికి తల్లికన్నా తండ్రితోనే ఎక్కవు అనుబంధం ఉంటుంది. తన గారాల పట్టీ,తన ఇంట్లీ మహాలక్ష్మీ అనుకుంటూ చిన్నప్పటి నుంచి గుండె మీద ఎక్కించుకొని తండ్రి ఆటలాడిస్తాడు. వయస్సుకి వచ్చాక తన కూతురు ఎలాంటి కష్టాలు పడకూడదు అని, తన కూతురికి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కంటుంటాడు తండ్రి. తన కూతురు ఏదైనా తప్పు చేసినా కూడా దానిని సరిదిద్ది ఆమె భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాడు. ఓ తండ్రి ఇలాగే కోరుకోవడం ఆయన పాలిట మరణశాసనం అయింది.
కూతురు చేస్తున్న తప్పుడు పనులను చూస్తూ ఉండలేకపోయిన తండ్రి కూతురిని మందలించాడు. దీంతో ఆ కూతురు కోపంతో దారుణానికి ఒడిగట్టింది. తన అక్రమసంబంధానికి అడ్డొస్తున్నాడని గుండె మీద ఎక్కించుకొని ఆడించిన తండ్రిని గుండె మీద కూర్చొని గుద్ది చంపేసించింది. కన్నతండ్రినే ప్రియుడితో హత్య చేయించిన ఈ దారుణ ఘటన ఎక్కడ,ఎలా జరిగిందనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో సూరా రాంబాబు అనే వ్యక్తి కాపురం ఉంటున్నాడు. ఈయనకు వెంకట దుర్గ అనే కూతురు ఉంది. వెంకట దుర్గకి కొత్తూరుకి చెందిన ముమ్మడివరపు సురేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వెంకట దుర్గ, సురేష్ ఓపెన్ గా తిరుగూతూనే తమ వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే తన కూతురి వివాహేతర సంబంధం గురించి రాంబాబుకి తెలిసింది. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట ఇలా చేయకు నీ కాపురాన్ని నాశనం చేసుకోకు అంటూ కూతురిని మందలించాడు. అయితే తన క్షేమం ఆలోచించే తండ్రి తనమీద కోప్పడ్డాడన్న విషయం మరిచిన దుర్గ పగతో రగిలిపోయింది. విషయాన్ని తన ప్రియుడు సురేష్ కి చెప్పి ఎలాగైనా తన తండ్రిని చంపేయాలని కోరింది. వీరిద్దరూ కలిసి ఓ పథకం వేశారు.

మార్చి 16వ తేదీన ఇంట్లో తండ్రి రాంబాబు నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. సురేష్ తనతో పాటు తన స్నేహితుడైన తాటికొండ నాగార్జున అనే వ్యక్తిని కూడా దుర్గ ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురూ కలిపి మంచంపై నిద్రపోతున్న రాంబాబు ఛాతిపై కూర్చొని గుండెమీద గట్టిగా పిడిగుద్దులు గుద్దుతూ గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత సురేష్, నాగార్జున అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిద్రలోనే తన తండ్రి చనిపోయినట్లు దుర్గ నాటకం మొదలుపెట్టింది. అయితే రాంబాబు సోదరుడు అంటే దుర్గ బాబాయికి అనుమానం వచ్చింది. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. దుర్గపైనే అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు రావడంతో తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకూడదంటూ దుర్గ అడ్డుపడింది. పోస్టుమార్టం చేస్తే హత్య అనే విషయం బయటకు వస్తుందనే ఉద్దేశంతో తన తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం చేస్తే..తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. దీంతో పోలీసులకు ఆమె తీరుపై అనుమానం కలిగింది.
పోస్టుమార్టం నివేదికలో రాంబాబుది హత్య అని తేలడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. దీంతో ఎలాగైనా తనని పట్టుకుంటారని భావించిన దుర్గ.. ప్రియుడు,అతడి ఫ్రెండ్ తో కలిసి వైజాగ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వీరిని పట్టుకొని అరెస్ట్ చేశారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో వీరిని రామచంద్రాపురం కోర్టుకి తరలించారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.



Click it and Unblock the Notifications