Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ప్రియుడితో శృంగారం..భర్తకు అడ్డంగా దొరికిన భార్య..చివరకి?
వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలకు కూడా చంపుతున్న కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా కూడా వివాహేతర సంబంధాలకు అడ్డాగా మారుతుంది. మొదట్లో మెల్లగా మేసేజ్..తర్వాత వీడియోకాల్స్..తర్వాత లైంగిక సంబంధాలు ఇలా వ్యవహారాలు నడుస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది ఓ భార్య. ఈ దారుణ ఘటన ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
హర్యానా రాష్ట్రంలోని భివానీ సిటీకి చెందిన రవీనా,ప్రవీణ్ భార్యాభర్తలు. ఈ దంపతులకు 6ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. హాయిగా సాగిపోతున్న సంసారం. ప్రవీణ్ ఆటోరిక్షా నడుపుతుండేవాడు. అయితే రవీనాకి సోషల్ మీడియాలో వీడియోలు చేయాలని, బాగా ఫేమస్ అవ్వాలని ఇష్టం. అయితే ఇవన్నీ మనకొద్దు అని భర్త నచ్చజెప్పేవాడు. భర్త మాటలను కూడా పట్టించుకోకుండా ఇన్ స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో తన వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. రవీనాకి ఇన్ స్టాగ్రామ్ లో 34వేలమంది ఫాలోవర్స్, యూట్యూబ్ లో 5వేల మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. ఎక్కువగా వీడియోలు కామెడీగా, ఫ్యామిలీ ఇష్యూస్ మీద ఉండేవి.

ఈ క్రమంలో మార్చి 25న షూట్ ఉందని చెప్పి రవీనా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ప్రవీణ్ కూడా ఇంటి నుంచి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి తలుపు తీయగా తన భార్య సురేష్ తో శృంగారం చేస్తూ కనిపించింది. తన భార్య మరో వ్యక్తితో శృంగారం చేయడం చూసి ప్రవీణ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో రవీనా తన చున్నీని భర్త మెడకు బిగించి చంపేసింది. రాత్రి అయ్యేదాకా ఆగి ప్రియుడు సురేష్ సహాయంతో ప్రవీణ్ మృతదేహాన్ని 6 కి.మీ దూరం బైక్ మీద తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడేశారు.
తర్వాత రోజు కుటుంబసభ్యులు ప్రవీణ్ ఏడి అని రవీనాని అడగినప్పుడు ఏమో నాకు తెలీదు అంటూ కూల్ గా సమాధానం చెప్పింది. అయితే మూడు రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో ప్రవీణ్ మృతదేహం దగ్గర్లోని మురికికాలవ నుంచి బయటపడింది. దీంతో పోలీసులు దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా ఓ బైక్ మీద ముగ్గురు వెళ్లడం తిరిగి వెళ్లేటప్పుడు ఇద్దరే ఉండటం గుర్తించారు. ఆ ఇద్దరు రవీనా, సురేష్ గా గుర్తించి వారిని తమ స్టైల్ లో విచారించేసరికి నిజం ఒప్పుకున్నారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే భర్తను హత్య చేయడానికి ముందునుంచే రవీనా తనను సింగిల్ మదర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అందరికి పరిచయం చేసుకునేది.



Click it and Unblock the Notifications