Latest Updates
-
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్! -
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు! -
షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే.. -
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక -
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే.. -
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం.. -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
ఆ సంబంధంపై మనసులో మాట బయటపెట్టిన జాన్వీ కపూర్
బాలీవుడ్ యువ సంచలనం, అందాల తార జాన్వీ కపూర్ కెరీర్ లో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కేవలం తన నటనతోనే కాకుండా, తన అభిప్రాయాలతోనూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. నేటితరం యువత అనుసరిస్తున్న ఓ కొత్త రిలేషన్ షిప్ ట్రెండ్ పై ఇటీవల జాన్వీ తనదైన శైలిలో ఘాటుగా స్పందించి హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం జెనరేషన్ Zలో వేగంగా విస్తరిస్తున్న సిట్యుయేషన్ షిప్(Situationship) అనే భావనపై ఆమె తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు.
జాన్వీ మాట్లాడుతూ..నిజం చెప్పాలంటే ఆ కాన్సెప్టే నాకు అర్థరహితంగా అనిపిస్తుంది. ఒకరిని ఇష్టపడితే, వారికే కట్టుబడి ఉండాలి. వారితోనే సమయం గడపాలని కోరుకుంటాం, మన ఇష్టాన్ని ఇంకెవరితోనూ పంచుకోవాలని అనుకోం కదా?అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఒకవేళ వారిపై మీకు అంత ఆసక్తి లేనప్పుడు, వారిని అంత గందరగోళంలోకి నెట్టడం ఎందుకు? ఈ మధ్యస్థంగా ఉండే జోన్, ఈ అనిశ్చితి నాకు అస్సలు అర్థం కాదు అంటూ ప్రేమ, సంబంధాల పట్ల తనకున్న స్పష్టమైన వైఖరిని బయటపెట్టారు.

అసలు ఏమిటీ సిట్యుయేషన్ షిప్?
ఇది స్నేహం కంటే ఎక్కువ, కానీ పూర్తిస్థాయి ప్రేమబంధం కాదు. ఎలాంటి నిబద్ధత, భవిష్యత్ ప్రణాళికలు లేకుండా కేవలం సాన్నిహిత్యాన్ని, సాంగత్యాన్ని కోరుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే తాత్కాలిక బంధమే ఇది. ఇందులో డేటింగ్, శారీరక సాన్నిహిత్యం అన్నీ ఉంటాయి కానీ మనం ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం ఉండదు.
దీనిలో ఉండే లాభాలేంటి?
నేటితరం యువత దీనివైపు ఆకర్షితులవడానికి కొన్ని కారణాలున్నాయి.
-నిబద్ధత, పెళ్లి వంటి దీర్ఘకాలిక బాధ్యతల భారం, ఒత్తిడి ఉండదు.
-ఎదుటి వ్యక్తితో మనకు సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది.
-ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా గడపవచ్చు. ఒకరిపై మరొకరికి అజమాయిషీ ఉండదు.
మరి నష్టాల మాటేంటి?
నాణానికి రెండో వైపు ఉన్నట్లే దీనిలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.
-ఈ బంధం ఎటువైపు వెళ్తుందో, ఎప్పుడు ముగుస్తుందో తెలియని గందరగోళం ఎప్పుడూ వెంటాడుతుంది.
ఇద్దరిలో ఒకరు తీవ్రంగా భావించి, మరొకరు తేలికగా తీసుకుంటే తీవ్రమైన మానసిక వేదన, గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది.
-బంధానికి స్పష్టమైన దిశ లేకపోవడం వల్ల ఆందోళన, ఒంటరితనం పెరిగే అవకాశం ఉంటుంది.
మొత్తం మీద ఆధునిక సంబంధాలలో వస్తున్న ఈ మార్పులపై జాన్వీ కపూర్ అభిప్రాయం ఒక కొత్త చర్చకు దారితీసింది. ప్రేమలో స్పష్టత, నిబద్ధత ఉండాలని ఆమె భావిస్తుండగా, నేటి యువత మాత్రం స్వేచ్ఛ, ప్రయోగాత్మక ధోరణికి ప్రాధాన్యత ఇస్తోంది.



Click it and Unblock the Notifications
