For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Life Rules: ఈ జీవిత నియమాలను ఎవరి కోసం బ్రేక్ చేయొద్దు.. మిమ్మల్ని మీరు కోల్పోతారు

|

Life Rules: జీవితం ఆనందదాయకంగా ఉండాలి. గత జ్ఞాపకాలను.. వర్తమానాన్ని ఆస్వాదించాలి.. భవిష్యత్ గురించి ఆసక్తి ఉండాలి. లేకుంటే జీవితంపై నిరాశ ఆవహిస్తుంది. ఆసక్తి తగ్గుతుంది. జీవితం అంటే ఉత్సాహం, ఆత్రుత ఉండాలి. లైఫ్ హ్యాపీగా సాగాలంటే దానిని మనం ప్రేమించగలగాలి.

జీవితం సాఫీగా సాగాలంటే దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటిస్తే జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆ నియమాలు ఏంటో చూద్దాం

1. ప్రతి ఒక్కరు వీటిని గమనించండి:

1. ప్రతి ఒక్కరు వీటిని గమనించండి:

మీరు ఎంత పెద్ద రూల్ బ్రేకర్ అయినా, జీవితంలో కొన్ని హద్దులను అస్సలే దాటకూడదు. జీవితంలో ప్రతి దానికీ ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది. మీరు శక్తివంతులైనా.. అధికారంలో ఉన్నా.. లేదా మరేదైనా పదవిలో ఉన్నా.. కొన్ని పరిమితులు తప్పనిసరిగా ఉంటాయి. వాటిని ఎంతటి వారు అయినా తప్పనిసరిగా పాటించాలి. అది మీ ప్రియమైన వ్యక్తి అయినప్పటికీ, మీరు ఎవరి కోసం అలాంటి నియమాలను ఉల్లంఘించకూడదు.

2. మీకు దగ్గరవుతుంది:

2. మీకు దగ్గరవుతుంది:

మీ హృదయం, అంతర్ దృష్టిని వినడం లేదా వినకపోవడం అనేది మిమ్మల్ని మీరు గౌరవంగా చూసుకోవడం లేదనే దానికి సంకేతం. మీరు మీకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరుల ప్రభావం మీ ఆలోచనలపై లేకుండా చూసుకోవాలి. మీ మాటలను మీరు వినకపోయినా, మీకు ఇష్టమైన పనిని చేయలేకపోయినా జీవితం అంటే అసంతృప్తి, బాధ, నిరుత్సాహం ఏర్పడుతుంది. ఇది జీవితం అంటే ఇష్టాన్ని తగ్గిస్తుంది. రేపు అనేదానిపై ఆసక్తిని దూరం చేస్తుంది.

3. ఇతరులు మీ నుండి ప్రయోజనం పొందుతుంటే:

3. ఇతరులు మీ నుండి ప్రయోజనం పొందుతుంటే:

ఇతరులు మిమ్మల్ని సులభంగా ఉపయోగించుకునే స్థితిలో మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఉంచుకోకండి. ఇతరులకు అనుకూలమైనప్పుడు మాత్రమే సహాయం చేయడానికి అంగీకరించినట్లైతే.. ఇతరులు మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేదానికి అది సంకేతం. మీరు ఒంటరిగా, హృదయ విదారకంగా ఉండకుండా ఉండాలంటే కొన్ని నేర్చుకోవాలి. అందులో మొదటిది నో చెప్పడం. నో చెప్పడం అనేది ఓ కళ. దానిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. మీకు ఇష్టం లేని పనిని చేయమని ఎవరైనా అడిగితే నిరభ్యంతరంగా నో చెప్పాలి. ఎదుటివారు నొచ్చుకోకుండా నో చెప్పడం నేర్చుకోవాలి.

4. సమయాన్ని వృథా చేసుకోవడం:

4. సమయాన్ని వృథా చేసుకోవడం:

మీరు ఖాళీగా ఉంటే, చేసేందుకు ఏ పని లేకపోతే.. మిమ్మల్ని మీరు బిజీగా ఉండేలా చేసుకోండి. ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోండి. హడావిడి జీవితంలో కొంత విరామం ఎప్పుడూ అవసరమే. ఆ విరామం కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. పని పట్ల శ్రద్ధను తీసుకువస్తుంది. కానీ, ఆ విరామం ఎక్కువ కాలం ఉండకుండా జాగ్రత్త పడాలి. పని నుండి బ్రేక్ అనేది నిర్ణీత సమయం వరకే మంచిది. ఎక్కువ సమయం ఖాళీగా ఉంటే సమయం వృథా అవుతుంది. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. విరామం అలవాటుగా మారితే పనులను వాయిదా వేస్తూ పోతారు. దీని వల్ల నష్టం వస్తుంది. పని చేయడానికి మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. దాని నుండి కొత్త విషయం నేర్చుకుంటున్నానన్న ఆలోచన ఉండాలి.

5. మానిప్యులేటివ్ ప్రేమను అంగీకరించడం

5. మానిప్యులేటివ్ ప్రేమను అంగీకరించడం

కొందరు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తారు. అలాంటి వ్యక్తుల గురించి కొన్నిసార్లు చూడగానే తెలిసిపోతుంది. వారి నుండి దూరంగా ఉండమని మన మనసు చెబుతూనే ఉంటుంది. అలా చెబితే మనసు మాట వినాలి. అలాంటి వారి వల్ల ఉపయోగం కంటే నష్టాలు, కష్టాలే ఎక్కువ. కాబట్టి వీలైనంత త్వరగా వారి నుండి దూరంగా వెళ్లిపోవాలి. మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటించి వారి ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. అలాంటి వారిని దూరం పెట్టడం నేర్చుకోవాలి. అది ప్రేమ కాదు అని గుర్తించగలగాలి. అంతకుముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మనసు చెప్పేది నమ్మగలగాలి.

6. మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం:

6. మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం:

మీరు వేరొకరి కంటే మీ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఎప్పుడూ రిస్క్ చేయకూడదు. అలా చేస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇతరుల అబద్ధాలు, మానిప్యులేషన్ టెక్నిక్ ‌లు మొదలైనవాటిని అంగీకరించడం వల్ల మీపై ప్రభావం పడుతుంది. అది మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు మరింత కష్టం అవుతుంది. దాని వల్ల మీ మనస్సుపై ప్రభావం పడుతుంది. అందుకే అలాంటి వాటిని దూరం పెట్టమని చెబుతుంటారు మానసిక నిపుణులు.

7. మీరు ఎంపిక చేసుకునేలా చేస్తోంది

7. మీరు ఎంపిక చేసుకునేలా చేస్తోంది

మీ భాగస్వామి, స్నేహితులు లేదా కుటుంబం మిమ్మల్ని స్నేహితులా లేదా కుటుంబ సభ్యులా ఎవరో ఒకరినే ఎంచుకోమని ఎప్పుడూ అడగకూడదు. ఇది సమయంతో క్లిష్టంగా మారుతుంది. మీ సన్నిహితుల మధ్య ప్రాధాన్యత ఇవ్వమని మిమ్మల్ని అడగడం వారి స్వార్థమే అవుతుంది. ఇది మిమ్మల్ని కష్టతరమైన స్థితిలో ఉంచుతుంది. కాబట్టి మీ భాగస్వామికి లేదా ఇతరులకు మీపై అధికారం ఉండనివ్వకండి. మీపై మీకు మాత్రమే అధికారం ఉండేలా చూసుకోవాలి. మీ జీవితానికి మీరే మార్గనిర్దేశకులు.. మీరే యజమానులు.. మీరే అన్ని. ఈ విషయాన్ని ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం మీది మాత్రమే.

English summary

Life Rules You Should Never Break for Anyone in telugu

read on to know Life Rules You Should Never Break for Anyone in telugu
Story first published: Thursday, July 28, 2022, 13:24 [IST]
Desktop Bottom Promotion