Latest Updates
-
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం!
అమ్మాయిలకు తెలియని-మీ ప్రియుడికి మీలో నచ్చని కొన్ని విషయాలు
అమ్మాయిలకు లాగానే, అబ్బాయిలకు కూడా ముఖం మొత్తించే విషయాలు మనం తెలుసుకోవలసినవి చాలా వున్నాయి! అస్తమానూ పెర్ఫ్యూం కొట్టుకుని, మీ మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ వుంటే ఆకర్షణీయంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా?ఇవి మీకు తెలియకుండానే మగవారికి చాలా వికర్షణ కలిగించవచ్చు. కాబట్టి అమ్మాయిలూ, మీకు ఇంతవరకూ తెలియని మగవారి వికర్షణలు తెలుసుకుందామా ?

పొడవాటి వేలిగోళ్ళు :
పొడవాటి వేలిగోళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయని మీరు అనుకోవచ్చు, కానీ, నిజానికి అవి మగవారికి చాలా వికర్షణ కలిగిస్తాయి. వారికి సహజంగా ఉండేవి నచ్చుతాయి, మీకు పొడవాటి గోళ్ళు వుంటే, మీకు వారు చెప్పకపోయినా, అది నిజానికి వారిని బాధించవచ్చు. కాబట్టి అమ్మాయిలూ, వాటిని సాధ్యమైనంత సరళంగా వుంచండి, మరీ ఎక్కువగా పెంచకండి.

చాలా సుగంధభరితంగా :
మీ పెర్ఫ్యూం వాసన మీకు నచ్చవచ్చు కానీ అది తేలికపాటిది అయితేనే మీ స్నేహితుడికి నచ్చవచ్చు - మీరు స్ప్రే మీద స్ప్రే కొట్టి అతను మీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అదే వాసన వస్తే, అది అంత మంచి విషయం కాకపోవచ్చు. సుగంధ భరితంగా వుండడం ఒక విషయం, కానీ అమ్మాయిలూ మీ చర్మం లోకి ఇంకిపోయేంత పెర్ఫ్యూం వాడడం అంత గొప్ప సంగతి కాదు. తేలిగ్గా ఉండండి, మీ స్నేహితుడు దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాడు. చూడండి, ఇది మాత్రం మీకు తెలియని మగవారికి వికర్షణ కలిగించే విషయం అని నేను చెప్పగలను.

తీవ్రమైన తపన :
తీవ్రంగా తపన పడే అమ్మాయిలు కూడా మగవారికి వికర్షణ కలిగిస్తారు. మీరు అస్తమానూ అతనికి అంటుకుని తిరుగుతున్నా, అతను లేకుండా బతకలేనట్టు కనపడినా అది చాలా విపరీతంగా అతనికి తోస్తుంది. స్వతంత్రంగా ఉంటూ, అవసరమైనప్పుడే తన మీద ఆధారపడే అమ్మాయినే అబ్బాయిలు ఇష్టపడతారు. మీ స్నేహితుడిని మరీ ఎక్కువగా అంటిపెట్టుకునే టప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి అమ్మాయిలూ!

మబ్బుగా వుండడం :
మబ్బుగా వుండడం చాలా బాగుంటుందని మీరు అనుకోవచ్చు, కానీ అబ్బాయిలకు తమదంటూ అభిప్రాయాలు వుండి, తెలివిగా వుండే అమ్మాయిలంటేనే ఇష్టం. మీకు ఏదైనా తెలిస్తే, మీరు తప్పక మాట్లాడేలా చూసుకోండి. చాలా మంది అమ్మాయిలు సీరియస్ గా తీసుకోరు గానీ, ఇది నిజంగానే అబ్బాయిలకు వికర్షణ కలిగిస్తుంది. మీరు మీలా ఉండండి చాలు!

మీ మాజీ గురించి మాట్లాడండి :
అస్తమానూ తన మాజీ గురించి మాట్లాడే అమ్మాయిలను అబ్బాయిలు అసహ్యించుకుంటారు. మీరు మీ మాజీని ఇప్పటికీ ప్రేమిస్తే, మీరు ఇంకొకరితో వుండడం అంత మంచి విషయం కాదు. మీరు అస్తమానూ మీ మాజీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎందుకు అనే విషయం మీరు తెలుసుకోవడం మంచిది. మగవారు అసహ్యించుకునే విషయాల్లో ఇది ఒకటి.

దురుసుగా వుండడం :
చివరిగా, మీ వైఖరి, దురుసుతనం కూడా మగవారికి చాలా వికర్షణ కలిగిస్తుంది. సాధారణంగా చెడ్డ వ్యవహార శైలి వుండి చుట్టుపక్కల వారితో దురుసుగా వుండే అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడతారు. మీరు ఎప్పుడూ సంతోషంగానే వుండాలని నేను అనడం లేదు, మనకీ చెడ్డ రోజులు ఉండవచ్చు, కానీ మీ మంచి రోజులకన్నా చెడ్డ రోజులు ఎక్కువ వుంటే, అది ఇంకొకరి మీద చూపకండి.

వ్యర్థ ప్రసంగాలు చేయడం :
మీరు మరో అమ్మాయిని గురించి చేదుగా మాట్లాడడం అతను వింటే, మీ చెడుగా కనపడడం మొదలు పెడతారు. మీరు చెప్పేది నిజమే అయినా, మీరు చెడుగా కనపడేలా అది చేస్తుంది. అతను మిమ్మల్ని చెడు వ్యక్తీ అనుకోవాలని మీరు అనుకోవడం లేదు. మీరు ఎంత ప్రేమించదగ్గ, అద్భుతమైన అమ్మాయో అతను తెలుసుకోవాలి.

అతన్ని మార్చాలని ప్రయత్నించడం :
అతను మీరు తనను యథాతథంగా స్వీకరించాలని కోరుకుంటాడు. మీరు అతనితో డేటింగ్ చేయాలని అనుకుని, అతని వ్యక్తిత్వాన్ని, వేశాభాసహాలను మార్చాలని ప్రయత్నిస్తే అతను తను మీకు తగిన వాడిని కాదని అనుకోవచ్చు. అతను మీకు నచ్చకపోతే అతన్ని మార్చాలనుకునే బదులు మరో అతనిని ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications
