Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
మగవారు సహజీవనాన్ని ద్వేషించడానికి గల కారణాలు
మీరొక గదిలో మగవారిని పెట్టి వారిని సహజీవనాన్ని సమర్ధించేవారు,వ్యతిరేకించేవారు గా విభజిస్తే ఆ విభజన సమానం గా సాగుతుంది.చాలా మంది నగర యువత పెళ్ళి కంటే సహజీవనానికే మొగ్గు చూపినా సంప్రదాయ భావాలు కలిగి సంప్రదాయ బద్ధం గా పెరిగిన యువత మాత్రం సంప్రదాయానికే ఓటు వేస్తారు.
చాలా దేశాలలో సహజీవనం ఇంకా ఆమోదింపబడలేదు.దీనికోసం ఆయా దేశాలలో చట్టాలు ఇంకా చేయలేదు.తూర్పు సంప్రదాయాలలో ఇద్దరు వ్యక్తులు పెళ్ళి కాకుండా తమ బంధాన్ని సమగ్రపరచడం ఇంకా నిషిద్ధమే. పాశ్చాత్య దేశాలలో మాత్రం సహజీవనం అంగీకరించబడింది. అందువల్ల చాలా మంది యువత ఈ అలవాటు ని అలవరచుకుంటున్నారు.
జీవితం లో షార్ట్ కట్స్ ఉపయోగిస్తే అది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఒనగూర్చదనీ, ఈ పద్ధతి చాలా హానికరం అని వాదించేవారు లేకపోలేదు.సంప్రదాయబద్ధం గా జరిగే పెళ్ళి వల్ల ఏర్పడే జీవిత కాల బంధానికి సహజీవనం కూడా ఇలాంటి ఒక షార్టు కట్టే.సహజీవనం దీర్ఘకాలిక ప్రయోజనాలని ఒనగూరుస్తుందా అన్నది ఇంకా నిరూపించబడాలి కనుక చాలా మంది మగవారు డేటింగ్ లేదా సంప్రదాయ పెళ్ళి కే మొగ్గు చూపుతున్నారు.

1.ప్రతిష్ఠ కి కళంకం:
చాలా మంది మగవారికి సహజీవనం అనేది తమ ప్రతిష్ఠ కి సంఘం లో మచ్చగా భావించడం వల్ల దానికి ఆమడ దూరం లో ఉంటారు.నవీన భారతం లో సహజీవనం సరికొత్త ట్రెండయినా మన సంఘం ఇంకా సహజీవనాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించలేదు.ఇది “నిషిద్ధ కర్మ” పెద్ద వారి ఉద్దేశ్యం లో. సహజీవనాన్ని ఎంచుకునేవారు నిర్ణీత సంప్రదాయాన్ని కాకుండా పక్క దారి తొక్కేవారుగా వారుగా గుర్తింపబడటం వల్ల వారిని సమాజం విమర్శించి, హేళన చేస్తుంది .
2.బయట పడటానికి సులభ మార్గం
సహజీవనం యొక్క ప్రయోజనం మరియు అతి పెద్ద హాని కట్టుబడి లేకపోవడం.ఒక చిన్న పోట్లాట,అసమ్మతి, లేదా పొరపాటున వేసిన ప్రశ్న, వీటిల్లో ఏ చిన్న కారణం వల్లనయినా సహజీవన భాగస్వాములలో ఒకరు ఈ బంధం నుండి విడివడిపోతారు.అదే పెళ్ళి చేసుకున్న జంటలు మాత్రం తమ బంధాన్ని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు.పైగా వారు విడిపోదామని నిర్ణయం తీసుకునే ముందు తమ సమస్యలకీ, అపార్ధాలకీ పరిష్కారాలు వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు.
3.పిల్లలు
సహజీవనం వల్ల కలిగిన పిల్లలు అనేక రకాలుగా ప్రభావితమవుతారు.మొట్ట మొదట వారు నియమాలు,పద్ధతులపట్ల వ్యతిరేక భావం అలవరచుకుంటారు.సహ జీవనం లో పుట్టిన పిల్లలకి ప్రేమ ఆప్యాయతలు కొరవడతాయి, ఎందుకంటే తల్లి తండ్రులు ఎప్పటికీ కలిసి ఉండే అవకాశం లేకపోవడం వల్ల.చాలా మంది మగవారు తమ ఇష్టానికి వ్యతిరేకం గా పిల్లలని పెంచి పెద్ద చేయడం లేదా వారిని పూర్తిగా పరిత్యజించడం అన్న ఊహనే భరించలేరు.
4.ఆధారపడక్కర్లేకపోవడం
వైవాహిక బంధం లో లాగ కాకుండా సహ జీవనం లో తమ భాగస్వామి మీద ఆధారపడక్కర్లేదు.ఏదైనా పంచుకోవాల్సివచ్చినప్పుడు అన్ని వేళలా ఓదార్చే భుజం దొరకకపోవచ్చు సహజీవనం లో.సహజీవనం లో వైవాహిక బంధం లో ఉండే లోతు ఉండదు.సహజీవనం లో కట్టుబాటు లేకపోవడం వల్ల భాగస్వాములలో ఒకరు ఏదైనా తీవ్ర సమస్య లో ఉన్నప్పుడు మరొకరు వారిని వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంది.
5.గౌరవం లేకపోవడం
వివాహం ద్వారా దీర్ఘకాలిక బంధం ఏర్పడుతుంది. కానీ సహజీవనం లో అలాంటి గ్యారెంటీ లేదు. సహజీవనమెప్పుడూ అనిశ్చితమయిన,ఒక కట్టుబాటు అంటూ లేని పునాదుల మీదే నిర్మించబడీ ఉంటుంది.దీనిలో భాగస్వాములు ఒకరంటే మరొకరు గౌరవ భావం కలిగి ఉండకపోవడం వల్ల ఒకరిని విడిచి మరొకరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీని అనిశ్చితి నెలకొంటుంది.



Click it and Unblock the Notifications