అత‌డ్ని మ‌ళ్లీ మీ ప్రేమ‌లో ప‌డేలా చేసుకునేందుకు 10 మార్గాలు

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

మీరెవ‌రైనా ముద్దుముద్దుగా ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌ను ఒల‌క‌బోసుకునే జంట‌ను చూశారా? మా బంధ‌మేమిటి ఇలా త‌గ‌ల‌బ‌డింది అని వారిని చూసిన‌ప్పుడు అనిపించిందా? చింతించ‌కండి.. మీరొక్క‌రే కాదు. మీలాంటి వాళ్లు ఈ స‌మాజంలో ఎంతో మంది ఉన్నారు.

ఎవ‌రితోనైనా సంబంధంలో ఉండ‌డం అద్భుత‌మైన ఫీలింగ్‌. తొలిరోజుల్లో అనుబంధం మ‌ర‌పురాని ఘ‌ట్టాలుగా మిగిలిపోతుంది. అప్ప‌ట్లో ఒక‌రిని వ‌దిలి ఒక‌రు వ‌ద‌లాలంటే ప్రాణం పోయినంత‌గా బాధ‌ప‌డేవారు. మీరు ప్రేమించిన అత‌డి కోసం లోకానికే ఎదురు చెప్పేంత తెగువ మీలో ఉండొచ్చు.

ways to make a man fall in love | tips to make man fall in love with us

మీ ప్ర‌పంచం అంతా అత‌డి చుట్టూ తిరుగుతుంది. అత‌డితో ఎప్పుడెప్పుడు స‌మ‌యం గ‌డ‌పాలా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఉద్వేగం ఎంతో కాలం నిల‌వ‌దు. కొన్ని నెల‌ల త‌ర్వాత ఒక‌రంటే ఒక‌రికి బోర్ కొట్టిపోతుంది. ఇది యథాలాపంగా జ‌రిగినా .. దీని వెనుక శాస్త్రోక్త‌మైన కార‌ణాలున్నాయి. ఆశ్చ‌ర్య‌పోతున్నారా... చ‌ద‌వండి మ‌రి...

కొత్త‌గా ఎవ‌రినైనా క‌లిసిన‌ప్పుడు మ‌న శ‌రీరంలోని హార్మోన్లు బాగా ఉత్తేజిత‌మ‌వుతాయి. అది అవ‌తలి వ్య‌క్తిని ఆక‌ర్షింప‌జేసేలా చేస్తుంది. స‌మ‌యం గ‌డిచేకొద్దీ ఈ హార్మోన్లు య‌థాస్థితికి వ‌చ్చేస్తాయి. మీరు మొద‌టిసారి మీ భాగ‌స్వామిని చూసిన‌ప్ప‌టి ఫీలింగ్ క్ర‌మంగా త‌గ్గిపోతూ ఉంటుంది.

మీరు మొద‌టిసారి క‌లిసినప్పుడు అత‌డితో గ‌డిపిన క్ష‌ణాలు గుర్తున్నాయా? అత‌డిలో స్పార్క్ క‌లిగించే ప‌నులు గుర్తున్నాయా? మ‌ళ్లీ మీ బంధాన్ని బ‌ల‌ప‌రిచేందుకు మీరు ఎలా కృషి చేయ‌బోతున్నారు? ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు. అలాంటి స్ఫూర్తి ర‌గుల్చుకొని మీ వాడిని మ‌రింత చేరువ చేసుకోండి.

కేవ‌లం మీతో స‌మ‌యం గ‌డిపేందుకు అత‌డు త‌న ప‌నిని వాయిదా వేసేవాడు. అది గుర్తుందా? మీ క‌ళ్ల‌లోకి చూస్తూ మైమ‌ర‌చిపోయిన సంద‌ర్భాలు మీకు ఇప్ప‌టికే క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూనే ఉండొచ్చు. అవ‌స‌రం లేని సంద‌ర్భాల్లో మీకు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చి ఖుష్ చేసేవాడన్న సంగ‌తి మ‌ర్చిపోయారా?

మ‌ళ్లీ అలాంటి సంద‌ర్భాలు రావాల‌ని కోరుకుంటున్నారా? అలా మీ ప్రియుడు లేదా భాగ‌స్వామి ఉండాల‌ని కోరుకుంటున్నారా? అత‌డ్ని మీ వైపుకి ఎలా తిప్పుకోవ‌చ్చో కొన్ని చిట్కాలు చెబుతాం. వాటిని పాటించే ప్ర‌య‌త్నం చేయండి. దిల్ ఖుష్ చేసుకోండి.

1. రొమాంటిక్ సంజ్ఞ‌లు చేయండి

1. రొమాంటిక్ సంజ్ఞ‌లు చేయండి

రొమాంటిక్ సంజ్ఞ‌లు కేవ‌లం మ‌గ‌వారే చేయాల‌నేం కాదు. ఆడ‌వారు సైతం పువ్వులో, చాక్లెట్లో ఇచ్చి త‌మ భాగ‌స్వామిని స‌ర్‌ప్రైజ్ చేయ‌వ‌చ్చు. అత‌డికి ఇష్ట‌మైన ఏదైనా గిఫ్ట్‌ను అత‌డు ప‌నిచేసే చోటుకి పంపించండి. ఒక చిలిపి మెసేజీని త‌గిలించండి. అత‌డు మీ గురించి ఆలోచించేలా చేయండి.

2. అత‌డితో స‌మ‌యం గడిపేందుకు

2. అత‌డితో స‌మ‌యం గడిపేందుకు

మీ ప్రియుడికి ఆఫీసుకు సెల‌వు. మీకేమీ సెల‌వు లేదు. అలాంట‌ప్పుడు అత‌డితో స‌మ‌యం గ‌డ‌ప‌డం కోసం సెల‌వు పెట్టేయండి. దీని వ‌ల్ల మీకు ప‌నికంటే అత‌డే ముఖ్య‌మ‌ని అర్థం అవుతుంది. అత‌డంటే మీకు ఇష్ట‌మ‌ని గ్ర‌హిస్తాడు. అత‌డికి ఇష్ట‌మైన వంట‌కం చేసి ప్రేమ‌గా వ‌డ్డించండి. ఈ ఐడియా ఇచ్చిన మాకు త‌ర్వాత థ్యాంక్స్ చెప్పుకోవ‌చ్చు.

3. ఇదివ‌ర‌క‌టిలా మారిపోండి

3. ఇదివ‌ర‌క‌టిలా మారిపోండి

మిమ్మ‌ల్ని మొద‌టి సారి క‌లిసిన‌ప్పుడు మీలో అత‌డికి న‌చ్చిన అంశాలేమిటో గుర్తున్నాయా? మీరు స్వ‌తంత్రంగా, శ‌క్తివంత‌మైన మ‌హిళ‌గా ఉండ‌టం అత‌డికి బాగా న‌చ్చి ఉండొచ్చు. రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌గా అమ్మాయిలు చాలా ఎమోష‌నల్ అయిపోతారు. అది అబ్బాయిల‌కు ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మిస్తుంది. మీలోని ఆ పాత మార్పును తీసుకురాకండి. అప్పుడు మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డ‌టం మొద‌లుపెడ‌తాడు.

4. అత‌డి వ్య‌క్తిత్వాన్ని మెచ్చుకోండి

4. అత‌డి వ్య‌క్తిత్వాన్ని మెచ్చుకోండి

మీకు ఇబ్బందిక‌రంగా ఉంద‌ని చెప్పి అత‌డి అల‌వాట్ల‌ను మార్చుకోమ‌ని ప‌దే ప‌దే చెబుతుంటారా? మీకు గుర్తుందా.. ఇవే అల‌వాట్లు మీకు అత‌డిపై ఇష్టాన్ని క‌లిగించాయి. త‌మ అల‌వాట్ల‌ను మార్చాల‌నుకునే అమ్మాయిల‌ను ఎక్కువ‌గా అబ్బాయిలు ఇష్ట‌ప‌డ‌రు. అత‌డు ఎలా ఉన్నాడో అలాగే ఇష్ట‌ప‌డండి. మీ ప్రేమ‌ను అప్పుడు అర్థం చేసుకొని తిరిగి మిమ్మ‌ల్ని ప్రేమిస్తాడు.

5. ఇప్ప‌టికీ ప్రేమిస్తున్నానే విష‌యాన్ని తెల‌పండి

5. ఇప్ప‌టికీ ప్రేమిస్తున్నానే విష‌యాన్ని తెల‌పండి

భాగ‌స్వాములిద్ద‌రు త‌మ రోజువారీ ప‌నుల్లో ప‌డిపోయి త‌మ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర్చుకోవ‌డం మ‌ర్చిపోతారు. మీరు ఇంకా అత‌డ్ని పీక‌ల్లోతు దాకా ప్రేమిస్తున్నానే విష‌యాన్ని తెలియ‌ప‌ర్చండి. అత‌డికి మీపైన ఫీలింగ్స్ ఉన్నాయ‌నే విష‌యాన్ని తెలియ‌జేసేలా చేసుకోండి.

6. చిలిపి మెసేజీల‌ను పంపండి

6. చిలిపి మెసేజీల‌ను పంపండి

మీ భాగ‌స్వామికి మీ ప‌ట్ల ఆస‌క్తి క‌లిగించేందుకు చిలిపి ప‌నులు చేయండి. అడ‌పాద‌డ‌పా మేసేజ్‌లు పెట్టి అత‌డ్ని ఊరించండి. అత‌డి గురించే ఆలోచిస్తున్నాన‌ని.. ఈ స‌మ‌యంలో ప‌క్క‌న ఉంటే అది ఇది చేసేవాడిన‌ని చెప్పండి. దీని వ‌ల్ల ఇంటికి తొంద‌ర‌గా వ‌చ్చేలా ఆస‌క్తి క‌లిగించండి. మీరు అత‌డి కోసం సెక్సీయెస్ట్ లింగ‌రీ వేసుకొని ఎదురుచూస్తున్న‌ట్టు తెలియ‌జేయండి. మీ కోసం అత‌డు ప‌రిత‌పిస్తూ వ‌చ్చేస్తాడు.

7. వాళ్ల‌ను ఎంజాయ్ చేయ‌నివ్వండి

7. వాళ్ల‌ను ఎంజాయ్ చేయ‌నివ్వండి

స‌హ‌జంగా అమ్మాయిలు త‌మ మ‌గ స్నేహితుడంటే పొసెసివ్‌గా ఉంటారు. క‌నీసం వారిని బాయ్స్ నైట్ అవుట్ కు కూడా వెళ్ల‌నివ్వ‌రు. ఇలా చేస్తున్న‌ట్ట‌యితే ఈ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకోండి. మీ పార్ట‌న‌ర్‌కు కాస్త స‌మ‌యాన్ని ఇచ్చి ఎంజాయ్ చేసుకోనివ్వండి. వాళ్ల స్నేహితుల‌తో క‌లిసి పార్టీల‌కు వెళ్లాల‌నుకుంటే అభ్యంత‌రం చెప్ప‌కండి. దీని వ‌ల్ల మీరు అత‌డికి బాగా విలువ ఇస్తున్నార‌ని అర్థం చేసుకుంటాడు.

8. అంద‌రిలో ఉండ‌గా మ‌రింత శ్ర‌ద్ధ‌

8. అంద‌రిలో ఉండ‌గా మ‌రింత శ్ర‌ద్ధ‌

అంద‌రిలో ఉన్న‌ప్పుడు మీరు అత‌డిపై మ‌రింత శ్ర‌ద్ధ క‌న‌బ‌ర్చండి. దెబ్బ‌కు మీ ప్రేమంటే ఏమిటో అర్థ‌మ‌వుతుంది. దీంతో ఇక మిమ్మ‌ల్ని ర‌క‌ర‌కాల స‌ర్‌ప్రైజ్‌లు, గిఫ్టుల‌తో ముంచెత్త‌డం ఖాయం!

9. అత‌డి స‌మ‌యాన్ని, ఇష్టాయిష్టాల‌ను గౌర‌వించండి

9. అత‌డి స‌మ‌యాన్ని, ఇష్టాయిష్టాల‌ను గౌర‌వించండి

మీరు మేక‌ప్ చేసుకుంటూ ఉండిపోయి మీ బాయ్‌ఫ్రెండ్‌ను వెయిట్ చేయించ‌కండి. డేటింగ్ కి వెళ్లిన‌ప్పుడు కూడా అత‌డ్ని వెయిట్ చేయించ‌కండి. దీని వ‌ల్ల అత‌డి స‌మ‌యానికి మీరు త‌గిన విలువ ఇవ్వ‌డంలేద‌ని అపార్థం చేసుకోగ‌ల‌డు. అత‌డ్ని క‌లిసేట‌ప్పుడు త‌న‌కు ఇష్టంలేని రంగు దుస్తులు అస్స‌లు ధ‌రించ‌కండి. మీ చిన్న చిన్న ఇష్టాల‌ను అత‌డి కోసం త్యాగం చేయ‌డంలో త‌ప్పేమీ లేదు.

10. అత‌డికి నో చెప్ప‌కండి

10. అత‌డికి నో చెప్ప‌కండి

మీ భాగ‌స్వామి అప్పుడ‌ప్పుడు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వాల‌ని చూస్తుంటే ప‌రిమితి మేర‌కు కాద‌న‌కండి. శారీర‌కంగా క‌ల‌వ‌డం వ‌ల్ల మీ ఇద్ద‌రి మ‌ధ్య సామీప్యం మ‌రింత పెరుగుతుంది. మీ వేలు ప‌ట్టుకొని వెన్నంటే న‌డ‌వాలంటే అత‌డి ప్ర‌తి వాంఛ తీర్చే ప్ర‌య‌త్నం చేయండి.

English summary

ways to make a man fall in love | tips to make man fall in love with us

Being in a relationship is a wonderful feeling. The initial stages of the relationship are the most memorable ones. That was the time when it was difficult for both of you to keep your hands off each other and be oblivious to the world around. But it's very important to keep up the spark even during the later part.