మీ గర్ల్ ఫ్రెండ్ మనస్సులో స్థానం సంపాదించటానికి 10 హావభావాలు

Posted By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

"ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన మరియు చాలా సుందరమైన విషయాలను చూడలేకపోయిన లేదా వినలేకపోయిన కానీ హృదయంతో అనుభూతిని పొందవచ్చు." - హెలెన్ కెల్లెర్

అవును, నిజమైన ప్రేమ విషయానికి వస్తే ఇది నిజమే. "ప్రేమలో ఉండటం" అనేది ఒక వ్యక్తి యొక్క మొత్తం సున్నితత్వం లేదా అవగాహనను మార్చేస్తుంది. ఇద్దరు అబ్బాయిల మధ్య సన్నిహిత స్నేహం మీద చాలా ఉదాహరణలు ఉన్నాయి.

షాలే మరియు ముక్దార్ కా సికందర్ వంటి బాలీవుడ్ సినిమాలలో తన ప్రియ స్నేహితుడికి తన ప్రేమను మరియు శ్రద్ధను చూపించడానికి స్నేహితుడు చేసిన త్యాగంతో నిండిపోతుంది. కానీ అమ్మాయితో ప్రేమ విషయానికి వచ్చేసరికి పూర్తిగా బిన్నంగా ఉంటుంది.

రఫ్ గా ఉన్న వ్యక్తి ప్రేమలో ఉన్నప్పుడు అతని స్వభావం శ్రద్ద మరియు మర్యాదగా మారిపోతుంది. స్నేహభావం లేని మరియు ప్రతికూలంగా ఉన్న వ్యక్తి ప్రేమలో పడినప్పుడు వారిని ఆకట్టుకోవడానికి ఇమేజ్ ని మార్చుకుంటాడు. అదే ప్రేమలో ఉన్న మహిమ.

లోతైన ప్రేమలో ఉన్న వారికీ స్నేహితురాలిని ఆకట్టుకోవడానికి ఏమి చేయాలో అనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఒక అమ్మాయి హృదయాన్ని గెలవటం అనేది అంత సులువైన విషయం ఏమి కాదు. చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు.

అందువలన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఆకట్టుకోవడానికి మరియు ప్రేమ అనుభూతి పొందటానికి కొన్ని ఆవిష్కృత మార్గాలను కనిపెట్టవలసి ఉంటుంది. అయితే అబ్బాయిలు నిరాశ పడవలసిన అవసరం లేదు. కానీ సులభం మాత్రం కాదు. అయితే కింద చెపుతున్న హావభావాల సాయంతో ఖచ్చితంగా అమ్మాయి మనస్సులో స్థానం సంపాదించవచ్చు.

1. ఆమెతో మాట్లాడటానికి ఉత్సహం చూపించాలి

1. ఆమెతో మాట్లాడటానికి ఉత్సహం చూపించాలి

ప్రతి అమ్మాయి ఒక అబ్బాయి తనను ప్రేమిస్తే ఆ భావనను ఇష్టపడతారు. మీరు ఆమెను మిస్ అవుతున్నట్టు చెప్పి ప్రతి ఉదయం సందేశం పంపితే, శ్రద్ద పెట్టటానికి ఇంత కన్నా మంచి మార్గం ఏముంది?

మీ భావోద్వేగాలను తెలియజేయడానికి సాంకేతికతను ఉపయోగించుకొని స్మైలీలను కూడా పంపవచ్చు. మీ పరిపూర్ణ మూడ్ మరియు భావోద్వేగాలకు సరిపోయేలా ఎంచుకోవడానికి చాలా స్మైలీలు ఉన్నాయి.

2. వ్యక్తిగత సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి

2. వ్యక్తిగత సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి

SMS లేదా వీడియో కాల్ ద్వారా సుదీర్ఘంగా ఉండే పొరపాటు చేయవద్దు. టెక్నాలజీ భావోద్వేగాలను సరళమైనవిగా చూపించదు. దీని వలన మీ ప్రేయసిని మీ నుండి దూరం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ తన తుది గమ్యాన్ని చేరుకోకముందే, ఆమెకు తగినంత సమయం ఉందని ఆమె అనుకోవచ్చు. అందువల్ల తొందరగా అపార్ధాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

3. సందర్భాన్ని బట్టి పువ్వులను ఇస్తూ ఉండాలి

3. సందర్భాన్ని బట్టి పువ్వులను ఇస్తూ ఉండాలి

అవును, ఇది మీ సంబంధాన్ని బలపరచటంలో అద్భుతాన్ని చేస్తుంది. పువ్వులు పరిసరాలను తాజాగా ఉంచటమే కాకుండా మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఎందుకంటే మీ ప్రియురాలు మిమ్మల్ని అభినందిస్తుంది. మీరు ఆమె కేరింగ్ టచ్ తో గొప్ప అనుభూతిని పొందుతారు.

4. ఆమెను అభినందించాలి

4. ఆమెను అభినందించాలి

పొగడ్తలు ఎవరికీ మాత్రం ఇష్టం ఉండవు. మీరు మీ ప్రేయసితో మాట్లాడుతున్నప్పుడు, కొన్ని విషయాల్లో లేదా సాధారణ అంశంపై లేదా ఆమె గురించి లేదా ఆమె చెవిపోగులు, దుస్తులు లేదా ఆమె దుస్తుల యొక్క రంగుపై పొగడ్తలు కురిపించి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాలి.

5. నిర్విరామంగా ప్రేమిస్తూ ఉండాలి

5. నిర్విరామంగా ప్రేమిస్తూ ఉండాలి

ఆమె మీద వివిధ మార్గాలలో ప్రేమను చూపిస్తూ ఉండాలి. మీరు మీ కనుల ద్వారా లేక ఆమె చెప్పేది చాలా శ్రద్దగా వింటూ మీ ప్రేమను వ్యక్తం చేయాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఆమె హృదయంలో స్థానం సంపాదించుకుంటారు.

6. లంచ్ లేదా డిన్నర్ కి వెళ్ళండి

6. లంచ్ లేదా డిన్నర్ కి వెళ్ళండి

వీలైనప్పుడు ఆమెకు నచ్చిన రెస్టారెంట్ కితీసుకువెళ్ళండి . ఇది మీ బంధం మీద అద్భుతాలను చేస్తుంది. ఆమెకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి 'ఐ లవ్ యు' అని చెప్పటానికి మీకు మంచి అవకాశం.

7. ఆమె స్నేహితులు మరియు సన్నిహితులతో సమావేశం

7. ఆమె స్నేహితులు మరియు సన్నిహితులతో సమావేశం

మీ స్నేహితురాలు మీ నిబద్ధతను చూడాలని అనుకుంటే, ఆమె స్నేహితులను కలిసి మాట్లాడితే అంత కన్నా మంచి మార్గం ఎక్కడ ఉంటుంది. ఆ విధంగా కేవలం ఒక సాధారణం సంబంధం ద్వారా ఆమె భావాలతో మీరు గెలవవచ్చు.

8. ఆమెను మీ స్నేహితులకు పరిచయం చేయండి

8. ఆమెను మీ స్నేహితులకు పరిచయం చేయండి

ఆమెను మీ స్నేహితులకు పరిచయం చేయటానికి ఆమెను ఆహ్వానించటం మాత్రం మర్చిపోకండి. ఇది మీ సంబంధానికి అవసరమైన బూస్ట్ ని ఇస్తుంది. ఎందుకంటే మీ స్నేహితురాలు మీ స్నేహితుల నుండి మీ గురించి మరింత సమాచారం తెలుసుకుంటుంది.

9. మీ సంబంధం సురక్షితమని చూపించండి

9. మీ సంబంధం సురక్షితమని చూపించండి

ఒక సంబంధంలో అభద్రత అనేది మీకు మీ ప్రియురాలి మధ్య బంధాన్ని చెడకొడుతుంది. ఏ సంబంధంలోనైనా అభద్రతను సహజ అనుభూతి మరియు సాధ్యమైనంత వరకు ఆమెతో కమ్యూనికేట్ చేయడం ద్వారా తొలగించడానికి మీరు ప్రయత్నించవచ్చు. ఆమె మీకు ప్రపంచం. అందువల్ల మీ జీవితాన్ని ఆమె లేకుండా ఊహించలేరు.

10. భవిష్యత్ నిర్ణయించటానికి ఆత్రుత చూపాలి

10. భవిష్యత్ నిర్ణయించటానికి ఆత్రుత చూపాలి

ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అబ్బాయి అంతిమంగా పెళ్ళికి దారి చూపాలి. ఆమెను మీ కుటుంబానికి పరిచయం చేయటానికి ఆమెలో ఉత్సాహం నింపి ఆ దిశగా అడుగులు వేయాలి. అప్పుడు ఆమె మీ కుటుంబాన్ని కలవటానికి రెడీ అవుతుంది. వీటిని మీరు తప్పకుండా ఫాలో అయితే మీ ప్రియురాలి మనస్సులో స్థానం పదిలం అని చెప్పవచ్చు.

English summary

10 Gestures That Melt Any Girl’s Heart

Therefore, a boy has to devise some inventive ways, which can impress his girl and make her feel his love for her! Do not get disheartened boys. Though the road is not easy, with the help of following ten gestures you can surely make your girl's heart melt for you. Do take a look.
Story first published: Saturday, September 9, 2017, 18:30 [IST]