Latest Updates
-
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు!
ఏడడుగుల కలకాల బంధానికి సప్త మార్గాలు
బంధాలు, అనుబంధాలనేవి చాలా సున్నితమైనవి. ఎంత బిగ్గరగా వాటిని పట్టి ఉంచాలని ప్రయత్నిస్తే అంత తొందరగా విడిపోయే ప్రమాదముంది. ఎవరితోనైనా సంబంధాన్ని మొదలుపెట్టడం వరకు సులువే. దాన్ని నిలుపు
బంధాలు, అనుబంధాలనేవి చాలా సున్నితమైనవి. ఎంత బిగ్గరగా వాటిని పట్టి ఉంచాలని ప్రయత్నిస్తే అంత తొందరగా విడిపోయే ప్రమాదముంది. ఎవరితోనైనా సంబంధాన్ని మొదలుపెట్టడం వరకు సులువే. దాన్ని నిలుపుకోవడమే పెద్ద సవాల్! కొన్ని సార్లు సంబంధీకులతో మరింత పొసెసివ్‌గా తయారవుతాం. దీని వల్ల అంతరంగాల్లో ఒక లాంటి అభద్రతాభావం నెలకొని ఉంటుంది.
కొన్నిసార్లు భాగస్వామి తన పనిలో తాను బిజీగా ఉన్నానని తెలిసినా సరే అతడి/ ఆమె ఆకర్షణ పొందేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ చర్యల వల్ల భాగస్వామిపై ఆధారపడే తత్వం అలవడుతుంది. స్వతాహాగా నిర్ణయాలు తీసుకోలేనివారమని ముద్ర పడుతుంది. దీంతో ఉన్న కాస్త విశ్వాసం కోల్పోతాం.

1. ఆలోచనా ధోరణి
ఆలోచనా ధోరణి అన్నదే జీవితంలో చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు మనకు కావాల్సిన వారిని ఎక్కడ కోల్పోతామో అన్న అభద్రతాభావం చోటుచేసుకుంటుంది. దీంతో వారిని ఎల్లప్పుడూ తమ వైపునకు తిప్పుకోవాలనే తలంపు ఏర్పుడుతుంది. ఏ సంబంధానికైనా నమ్మకమే పునాది. అందుకే మన ఆలోచనా ధోరణి ఎప్పుడూ ఆరోగ్యకరమైన సంబంధాల వైపే నడవాలి.

2. వారికి కాస్త సమయం ఇవ్వండి
ఒకరితో ఒకరు ఎంత పెనవేసుకున్నా.. ప్రతి ఒక్కరికీ సొంత సమయం అంటూ ఉంటుంది. కాస్త వాళ్లను ప్రశాంతంగా ఉంచడానికి ఆ సమయం సరిపోతుంది. మన భాగస్వామి పైన, బంధంపైన స్పష్టమైన అవగాహన ఉండితీరాలి.

3. హాబీ పెట్టుకోండి
బిజీగా ఉండేవారికి ఏదో ఒక అవసరం పేరిట సమయం వృథా చేయరు. వాళ్ల పనితోనే వారికి సరిపోతుంది. కాబట్టి ఆసక్తికరమైన హాబీని ఎంచుకొని సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి. ఇతరుల కోసం ఎదురుచూసే కన్నా ఇది చాలా మంచి పద్ధతి.

4. తక్కువ ఆశించండి
ప్రపంచంలో ఎవ్వరూ పర్‌ఫెక్ట్ వ్యక్తి లేడు. కాబట్టి మన భాగస్వామిని ఎల్లప్పుడూ మన వెంటే ఉంటూ ప్రతి సందర్భంలోనూ సహాయపడాలని ఆశించకండి. ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ప్రాథమ్యాలుంటాయి. అందుకు తగినట్టు సమస్యలను సొంతంగా పరిష్కరించుకుంటారు. ఇదే వారికి స్వతంత్రను తెచ్చిపెడుతుంది. ఇటు ఆత్మవిశ్వాసం కూడా మెండుగా పెరుగుతుంది.

5. హద్దులను గీసుకోండి
మీకోసం మీరే హద్దులను గీసుకోండి. మిమ్మల్ని ఎలా పరిగణించాలో ఆ విధంగా ఎదుటి వ్యక్తుల చేసేలా జాగ్రత్తపడండి. ఎదుటివారికి ప్రాధాన్యతను ఇవ్వండి కాకపోతే వారు మీపైకి ఎక్కి చనువు తీసుకునేంత మాత్రం వద్దు. మనం బాధ పడకుండా ఇతరులను బాధపెట్టకుండా చిన్న హద్దును గీసుకోవడం మంచిది.

6. సుగుణాలను లెక్కించండి
మీలోని సుగుణాలను ఒక కాగితంలో రాసుకోండి. ఏం చేయాలనుకుంటే దాన్ని చేసేయండి. పాజిటివ్ యాటిట్యుడ్ తో మెలగండి. ఫలితంగా మీలోని అభద్రతాభావం క్రమంగా మటుమాయమవుతుంది.

7. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి
మన మనసు పరిపరి విధాల వెళుతుంటుంది. ఖాళీగా ఉంటే ఎవరో ఒకరు కావాలని, బోరింగ్ గా, చిరాకుగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఏదో వ్యాపకంతో బిజీగా ఉండే ప్రయత్నం చేయాలి. నిర్మాణాత్మక పనుల్లో బిజీగా గడిపితే అదొక తృప్తి. దీని వల్ల ఆత్మవిశ్వాసమూ హెచ్చుతుంది. ఆనందానికి కొత్త దారిని వెతుక్కున వారిమవుతాం. ఖాళీ బుర్ర దెయ్యాల కొంప అనే నానుడి తెలిసే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచేలా చేసుకోండి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేలా చూసుకోండి. అప్పుడప్పుడు జనాలను కలుస్తూ ఉండండి.
మిమ్మల్ని సంతోషపరిచే వ్యక్తుల కోసం మీరు ఎదురుచూడవచ్చు. నిజమేమిటంటే మనల్ని సంతోషపర్చగలిగిదే మనమే. మన సంతోషం కోసం ఎవరిపైనో ఆధారపడాల్సిన అవసరమే లేదు. మీరు సంతోషంగా ఉండేందుకు ఎవరి అవసరమూ లేదని నిరూపించుకోవడం చాలా సులభం.



Click it and Unblock the Notifications
