మ‌గ‌వారు ప‌రాయి స్త్రీల‌ను అదే ప‌నిగా ఎందుకు చూస్తారంటారు? ఏమో మ‌రి మీరే తెలుసుకోండి

By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌గ‌వాళ్లు ప‌రాయి స్త్రీల‌ను త‌దేకంగా ఎందుకు చూస్తారు? మీరు షాపింగ్‌కి వెళ్లిన‌ప్పుడు మీ భ‌ర్త‌ను గ‌మ‌నించే ఉంటారు. షాపింగ్ మాల్‌లోని అందంగా ఎవ‌రైనా క‌నిపిస్తే చాలు చూస్తూనే ఉండిపోతారు. మీ భ‌ర్త‌ను చూసి మీ మ‌న‌స్సు చివుక్కుమ‌ని ఉండొచ్చు. ఇలా పెళ్లాం ప‌క్క‌నే ఉండ‌గా ఏ మొగుడైనా ప‌రాయి స్త్రీల‌ను చూస్తే చిరాకు క‌ల‌గ‌కుండా ఉంటుందా చెప్పండి.

మీ భ‌ర్తే ప‌రాయి స్త్రీల‌ను చూస్తుంటే మీకు కోపం త‌న్నుకురాదా చెప్పండి. కొంద‌రు ఇలాగే చేస్తారు. వీధుల్లో, కాఫీ షాపుల్లో, కాలేజ్‌లో, ఆఫీసులో, చివ‌రికి హాస్పిట‌ల్‌లోనూ అంద‌మైన స్త్రీ క‌నిపిస్తే చాలు మొత్తం దృష్టి అటువైపు పెడ‌తారు. ఇది మ‌రీ విప‌రీత‌మైన ధోర‌ణిలా అనిపిస్తోంది క‌దూ!

భార్యదగ్గర ఎట్టి పరిస్థితిలో ప్రస్తావించకూడని కొన్ని విషయాలు

వాళ్ల‌కు ఎదుర‌య్యే మ‌గువ‌లు క‌నిపిస్తే చాలు, క‌ళ్ల‌న్నీ స్కాన్ చేస్తుంటాయి. మీ భ‌ర్త ఇలా చేస్తున్నాడ‌ని ఊహించండి. ఎవ‌రైనా కూర‌గాయ‌లు కొనేందుకు వ‌చ్చిన ప‌రాయి స్త్రీ ఒంపుసొంపుల‌ను ర‌హ‌స్యంగా గ‌మ‌నిస్తున్నాడ‌నుకుందాం. అదే స‌మ‌యంలో ఆ ప‌రాయి స్త్రీ మీ భ‌ర్త‌ను గ‌మ‌నించింది. అప్పుడు ఆమెకు ఎంత చిరాకుగా అనిపిస్తుంది. అదే స‌మ‌యంలో మీకు చెండాలంగా అనిపించ‌వ‌చ్చు కూడా!

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలి? మీ భ‌ర్త‌కు ఈ అలవాటు మంచిది కాద‌ని నేరుగా చెప్పాలా? ఎలా చెప్పాలి, ఆయ‌న‌లోని ఈ గుణాన్ని పోగొట్టేదెలా? మీలో ర‌గులుతోన్న కోపం, అసూయ‌, బాధ‌, అభ‌ద్ర‌త‌, ఫ్ర‌స్టేష‌న్ నివార‌ణ‌కు మార్గం లేదా అస‌లు అలా తేరిపార చూసేవారికి నిజంగానే వారిప‌ట్ల ఆక‌ర్ష‌ణ ఉంటుందా? ఇదేమైనా తీవ్ర‌మైన స‌మ‌స్యా? వైద్య‌ప‌రంగా ప‌రిష్కారమేదైనా ఉందా .. తెలుసుకునేందుకు చ‌ద‌వండి....

స్త్రీలు పరాయి పురుషుణ్ణి ఎప్పుడు కోరుకుంటారో తెలుసా..?

ఇది స‌హ‌జ‌మా?

ఇది స‌హ‌జ‌మా?

కేవ‌లం స్త్రీలోలుడు, ప్లే బాయ్ మాత్ర‌మే ఇలా చేస్తాడ‌నుకుంటే మీరు పొర‌బ‌డిన‌ట్టే. దాదాపు అంద‌రు మ‌గ‌వాళ్లు ప‌రాయి స్త్రీల‌ను సీక్రెట్‌గా లేదా ఓపెన్‌గా చూస్తూనే ఉంటారు. కొంద‌రేమో బ‌య‌ట‌ప‌డ‌తారు. మ‌రికొంత మందిప‌ట్టుబ‌డ‌రు. అంతే తేడా. కేవ‌లం పెళ్లికాని వారు మాత్ర‌మే కాదు పెళ్లయిన మ‌గ‌వారు ఇలాగే చేస్తార‌ని కొన్ని ప‌రిశోధ‌న‌లు చెప్పాయి. మీ భ‌ర్త క‌నుక ఇత‌ర స్త్రీల వంక క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోతే నిజంగా మీరు అదృష్ట‌వంతులే.

మీపై ప్రేమ లేదా?

మీపై ప్రేమ లేదా?

ఇత‌రుల‌ను క‌న్నార‌ప్ప‌కుండా చూస్తున్నారంటే మీ పైన ప్రేమ త‌గ్గింద‌ని కాదు. ఒక స‌ర్వేలో చాలా మంది మ‌గ‌వారు ఇత‌ర స్త్రీల‌ను త‌దేకంగా చూడ‌టాన్ని ఇష్ట‌ప‌డ‌తారే త‌ప్ప వారితో ప‌డుకోవాల‌ని తమ‌కు ఉండ‌ద‌ని చెప్పారు. కేవ‌లం త‌మ భాగ‌స్వామితోనే ప‌డుకుంటామ‌ని చెప్పారు. చాలా మంది మ‌గ‌వారు ఇత‌ర స్త్రీల వంక చూడ‌డం చాలా కామ‌న్‌గా భావిస్తారు.

మ‌రి ఎందుక‌లా?

మ‌రి ఎందుక‌లా?

ఎవ‌రైనా మ‌గాడు ఒక స్త్రీ వంక త‌దేకంగా చూస్తున్నాడంటే బాహ్యాప‌రంగా త‌న‌కు ఆమె చాలా ఆక‌ర్షించే విధంగా ఉంద‌ని అర్థం. అంద‌మైన స్త్రీల‌ను చూస్తే మ‌గ‌వారిలో సెర‌టోనిన్‌, డోప‌మైన్ హార్మోన్లు విడుద‌ల‌వుతాయ‌ట‌. అది మెద‌డులో ఉత్ప‌న్న‌మై అదోర‌క‌మైన సంతృప్తినిస్తాయ‌ట‌. ఈ భావోద్వేగాన్ని మ‌గాళ్లు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.

కొంద‌రు మ‌గ‌వాళ్లు ఆ మ‌హిళ‌ల‌తో ప‌డుకున్న‌ట్టు కాసేపు ఊహాలోకంలో విహ‌రిస్తుంటారు. ఏదైనా అవాంత‌రం వ‌స్తే త‌ప్ప ఈ లోకంలోకి రారు.

ఈ చ‌ర్య ప్ర‌మాద‌క‌ర‌మైన‌దా?

ఈ చ‌ర్య ప్ర‌మాద‌క‌ర‌మైన‌దా?

సీక్రెట్ గా చూసినంత వ‌ర‌కు పెద్ద‌గా ప్ర‌మాద‌ముండ‌దు. అయిత అస‌లు చిక్కంతా అంద‌రూ చూసేలా మాత్రం ఇలా చేస్తే మాత్రం పెద్ద ఇర‌కాటంలో పడ్డ‌ట్టే. మీ ఇద్ద‌రి అనుబంధానికి కూడా ఇది ఏమంత మంచిది కాదు.

అలా చేయ‌డం దీనికి సంకేతం కాదు

అలా చేయ‌డం దీనికి సంకేతం కాదు

మీ భ‌ర్త ఇత‌ర స్త్రీల‌ను చూసినంత మాత్రాన మీరు అందంగా లేర‌ని కాదు. అదే విధంగా మీ పై ఆస‌క్తి పోయిన‌ట్టు కూడా కాదు. మీ తో బ్రేక‌ప్ చెప్పేందుకు సిద్ధ‌ప‌డుతున్నాడ‌న్న‌ది అంత‌క‌న్నా కాదు. మిమ్మ‌ల్ని మోసం చేసి ఇత‌రుల‌తో ప‌డుకోవాల‌ని కాదు.

మ‌గ‌వారి ఆక‌ర్ష‌ణ కాసేపే..

మ‌గ‌వారి ఆక‌ర్ష‌ణ కాసేపే..

మ‌గ‌వారు త‌మ భాగ‌స్వామి కాకుండా ఎవ‌రైనా అంద‌మైన స్త్రీ క‌నిపిస్తే చాలు ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్ పొందుతారు. కొన్ని క్ష‌ణాల సేపు ఆమె ప‌ట్ల ఆక‌ర్షితుడ‌వుతాడు. ఆ కొద్ది సేపు మాత్ర‌మే. దాంతో మ్యాట‌ర్ అక్క‌డితో ఆగిపోతుంది. అలా చూసే స్త్రీ త‌మ‌కు స‌రిపోతారా లేదా అన్న విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. చూడ‌డం వ‌ర‌కే. భార్య‌తో చాలా మంచి సంబంధం ఉన్న కొంద‌రు మ‌గ‌వాళ్లు కూడా ఇలా ప‌రాయి స్త్రీల‌ను చూస్తుంటార‌ని ఓ స‌ర్వేలో తేలింది. ఇంకా చెప్పాలంటే త‌మ‌కు తెలియ‌కుండానే క‌ళ్ల‌న్నీ అంద‌మైన స్త్రీల వైపున‌కు వెళుతుంటాయి.

స‌మ‌స్య‌గా మారితే...

స‌మ‌స్య‌గా మారితే...

మ‌గ‌వాళ్లు త‌మ హ‌ద్దుల‌ను మీరితే మాత్రం స‌మ‌స్యగా మారుతుంది. త‌దేకంగా అలాగే చూస్తే మాత్రం ఇబ్బంది కొని తెచ్చుకున్న‌ట్టే. చాలా దేశాల్లో ఇలా ప‌రాయి స్త్రీల‌ను త‌దేకంగా చూస్తే శిక్ష పొందాల్సి ఉంటుంది. కాబ‌ట్టి మామూలుగా చూసే దానికి త‌దేకంగా చూసేదానికి చిన్న గీత ఉంటుంది. దాన్ని చెరిపేయ‌కుండా చూసుకోవాలి.

ఎలా చెప్తే బాగుంటుంది?

ఎలా చెప్తే బాగుంటుంది?

`మీ భాగ‌స్వామి అలా ఇత‌ర స్త్రీల‌ను చూస్తూ మీకు ప‌ట్టుబ‌డితే అత‌నికి చెప్ప‌డంలో త‌ప్పులేదు. మిమ్మ‌ల్ని ఈ విష‌యం ఆందోళ‌న క‌లిగించేదైతే త‌ప్ప‌కుండా అత‌డితో చ‌ర్చించాలి. ఒక‌సారి అలా చూసి వ‌దిలేస్తే ఫ‌ర్వాలేదు కానీ త‌దేకంగా చూస్తే మాత్రం ఆలోచించాల్సిందే. అలా చేసిన వెంట‌నే మీరు అత‌డికి అలా చేయ‌వ‌ద్ద‌ని సంజ్న చేయ‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో అది మీకు ఎంత బాధ క‌లిగిస్తుందో చెప్పాలి.

మార‌తాడ‌ని ఆశించొచ్చా?

మార‌తాడ‌ని ఆశించొచ్చా?

ఆయ‌న‌లోని ఈ బిహేవియ‌ర్‌లో ఒక్క రోజులోనే మార్పు కోరుకొవడాన్ని ఆశించ‌లేం. ప‌బ్లిక్ ప్లేస్‌లో ఉన్న‌ప్పుడు మీరే ప‌దే ప‌దే గుర్తు చేయ‌డం వ‌ల్ల అత‌డిలో మెల్ల‌మెల్ల‌గా మార్పు రావ‌చ్చు. ఒక సారి చెబితే .. ఇంకోసారి ఆయ‌న ప‌రాయి స్త్రీల‌ను చూసేట‌ప్ప‌డు మీ మాట‌లు గుర్తొచ్చి ఆయ‌న ఆ ప‌ని మానుకోవ‌చ్చు కూడా. డీసెంట్‌గా బిహేవ్ చేయ‌వ‌చ్చు.

కేవ‌లం మ‌గ‌వారే అలా చూస్తారా?

కేవ‌లం మ‌గ‌వారే అలా చూస్తారా?

ఇటీవ‌ల ఒక స‌ర్వేలో తేలిన అంశ‌మేమిటంటే.. కొంద‌రు భ‌ర్త‌లు త‌మ భార్య‌లు కూడా ఇత‌ర అందమైన మ‌గ‌వాళ్లు క‌నిపిస్తే చాలు అలాగే చూస్తుండిపోతార‌ని చెప్పారు. అయితే మ‌గ‌వారితో పోలిస్తే ఆడ‌వారు చాలా త‌క్కువ‌గా ఇలా చేస్తార‌ట‌.

కాబ‌ట్టి భాగ‌స్వామిలో ఎవ‌రో ఒక‌రు ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్ట‌యితే ఇత‌రులు వారిని అర్థం చేసుకొని అల‌వాటు మానేలా చేయాలి. అప్పుడే దంప‌తుల బంధం అనోన్యంగా ఉంటుంది.

English summary

Why Men Look At Other Women

Why men stare at other women? When you go out for shopping, if you have observed your husband checking out other beauties, you feel embarrassed, right?
Story first published: Saturday, October 21, 2017, 16:00 [IST]
Subscribe Newsletter