ప్రేమ కథ: విధి ఇద్దరు వ్యక్తులను ఎలా ఒక్కటి చేస్తుంది

Written By: Telugu Samhitha
Subscribe to Boldsky

పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. అయితే భారతీయ వివాహ వ్యవస్థలో పెళ్ళిళ్ళు అన్ని రకాల ఆడంబరాలను ప్రదర్శించడానికి మరియు చూపించడానికి జరుపుకుంటున్నారు. వాస్తవానికి ఒక తండ్రి తన జీవితకాల సంపాదనని తన కుమార్తె కలల విహాహాన్ని కొనుగోలు చేయడానికి ఆదా చేస్తున్నాడు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు.

ఇది మంచి విషయం కావొచ్చు లేదా వివాదాస్పద అంశం కావచ్చు. ఏదేమైనా వాస్తవం ఏమిటంటే భారతీయ వివాహాలు ఒకే రకమైన ఆర్ధిక నేపధ్యం కలిగిన అధిక వ్యక్తులు కలుసుకునే ఒక వేదికగా ఉంటోంది.

How Destiny Connects Two People

ఇటువంటి నేపధ్యంలో వివాహం కాని యువతీ యువకులు తరచుగా ఒకరి వెంట ఒకరు పడుతూ ఉంటారు. ఈ విధంగా ఒక వివాహం ఇతర జంటలను ప్రోత్సహించడంతో ముగుస్తుంది.

ఇదే ఖచ్చితంగా ప్రవళి, మయాంక్‍‍ల విషయంలో జరిగింది. వారి తోబుట్టువుల వివాహం వారి జీవితాలలో ప్రేమను చిగురింపజేసింది. ఒక వివాహం మరొకరి వివాహానికి ఎలా దారితీసింది మరియు ఒక కుటుంబం మొత్తానికి ఎలా పునాదులు వేసారో తెలుసుకోవడానికి చదవండి.

నవ యవ్వన మన్మధుడు మయాంక్

నవ యవ్వన మన్మధుడు మయాంక్

దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకదాని నుండి గ్రాడ్యుయేట్ అయిన మయాంక్ తన జీవితంలో కేవలం రెండు విషయాలపై మాత్రమే దృష్టిపెట్టాడు. అందులో మొదటిది తన కెరీర్ రెండవది అతని శరీరం. అతను వ్యాయామం చేస్తున్నప్పుడు వ్యాయామశాల స్థంభిస్తుంది. అతను చాలా మంది అమ్మాయిలను ఆకర్షిస్తాడు అనేది స్పష్టమైన విషయం. కానీ అతని జీవితంలో అమ్మాయిలకిచ్చే ప్రాధాన్యత చిట్ట చివరి విషయం. అందుకేనేమో అతను ఇప్పటివరకు ఎవరితోనూ డేటింగ్ చేయలేదు.

ముక్కుసూటి యువరాణి ప్రవళి

ముక్కుసూటి యువరాణి ప్రవళి

మరోవైపు ప్రవళి, చాలా ముక్కు సూటిగా ఉండే అమ్మాయి. చాలా మంది స్నేహితులు ఉన్నారు. వీరిలో చాలా మంది అబ్బాయిలు కూడా ఉన్నారు. ఫ్యాషన్ కళాశాలలో ఆమె కళాశాల రోజులు నుండి ఎప్పుడూ ఎవరో ఒక పురుష స్నేహితుడ్ని లేదా స్నేహితులను కలిగి ఉండేది. వాస్తవానికి ఆమెను ఒక్కసారి చుస్తే చాలు అందరూ గుర్తుపెట్టుకునేవారు. చివరగా చెప్పాలంటే ఆమె చాలా అందంగా ఉంటుంది.

గ్రహాలు మీ హృదయ బంధువుని మీతో జతకల్పడానికి ఎలా వక్రీకరిస్తాయి

గ్రహాలు మీ హృదయ బంధువుని మీతో జతకల్పడానికి ఎలా వక్రీకరిస్తాయి

ప్రవళి తన సోదరి వివాహం కోసం కొద్ది నెలలుగా చూస్తూ ఉన్నది. ఈ విధంగా ఎప్పుడయితే తన బావ భరత్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఆమెకు తెలియకుండానే ఆదుర్దా కలిగి తన గుండెల నిండా ఏదో భావాలు నిండిపోయాయి. పెళ్లి కొడుకు కుటుంబంలోని వ్యక్తితో తన జీవితంలో ప్రేమకు ముడిపడుతుందని ఆమె కొంచెమయినా ఉహించ గలదా!

ఆమె మయాంక్‌ను ఎప్పుడు గుర్తించింది

ఆమె మయాంక్‌ను ఎప్పుడు గుర్తించింది

ప్రారంభంలో ప్రవళి కుటుంబం మొత్తం వరుడ్ని స్వాగతించే సమయంలో బిజీగా ఉన్నప్పుడు, ప్రవళి కేవలం తన విధులను నిర్వర్తించే క్రమంలో మయాంక్‌ను గమనించలేదు. తరువాత తన సోదరి అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షిస్తున్న సమయంలో తన DSLR కెమరాలో తన సోదరిని అందంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సరిగ్గా అదే సన్నివేశంలో తన సోదరుడ్ని కూడా DSLR కెమరాలో చిత్రకరించడానికి ప్రయిత్నిస్తున్న ఒక యువకుడ్ని తన మోచేతితో అడ్డు తగులుతూ ప్రయత్న పూర్వకంగా పక్కకు తోసేస్తోంది. ఇది ఆమె యొక్క సభ్యతలేని ప్రవర్తనగా మాత్రమే కాకుండా అతని మీద అయిష్టతను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది.

ప్రేమ పక్షులు, ప్రేమ గీతాలు పాడుకోవడానికి ప్రారంభం

ప్రేమ పక్షులు, ప్రేమ గీతాలు పాడుకోవడానికి ప్రారంభం

మయాంక్ ఆమెను తక్షణమే గమనించాడు. అతను ఆమె ఫోటోగ్రఫీ నైపుణ్యాల ద్వారా ఆకర్షితుడయ్యాడు. ఇప్పటి వరకు మాయాంక్ వివాహాలలో కేవలం తమకు తాముగా మాట్లాడటానికి ప్రయత్నించే అమ్మాయిలని మాత్రమే చూసేవాడు. ఇక్కడ ఒక అమ్మాయి కేవలం అందమైనది మాత్రమే కాదు ఆమెను చూడగానే ఎదో పరవశం అతన్ని ఆవహించినట్లు అనిపించింది. ఆమె ఫోటోలను తీస్తున్న చురుకైన పద్ధతి తన హృదయాన్ని కప్పివేసింది. ఆ సమయంలో అతను ఆ అమ్మాయితో మాట్లాడటానికి తన మనస్సు చేస్తున్న ప్రేరేపణలకు దాసుడయ్యాడు.

ధైర్య మేఘాలు

ధైర్య మేఘాలు

మయంక్ లాంటి వ్యక్తి, ప్రవళి వంటి అమ్మాయితో సాన్నిహిత్యం కోసం ధైర్యం చేయటం అంత సులభం కాదు. కానీ ప్రేమ ఆశీర్వాద బలంతో పొందే శక్తి చాలా అద్భుతం. మరుసటి రోజు ఉదయం తన వదిన (ప్రవళి యొక్క అక్క) కన్యాదాన సమయంలో అతను ప్రవళి వద్దకు వెళ్లి సంభాషణను ప్రారంభించేందుకు ప్రయత్నించాడు.

సమయం అనుకూలంగా లేనప్పుడు

సమయం అనుకూలంగా లేనప్పుడు

ఆమె సహోదరి ఇళ్ళు వదిలి వెళ్తోందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక ప్రవళి హృదయం బద్దలవుతోంది. బహుషా అది ఆమెతో మాట్లాడటానికి అత్యంత ప్రతికూలమైన సమయం. అందుకే ఆమె ప్రతిచర్య చాలా అందంగా అర్థం చేసుకోలేని విధంగా ఉంది. పాపం మయాంక్, ఆమె యొక్క స్పందించని ప్రవర్తన అతని నమ్మకాన్ని విరిచేసింది.

అవగాహనా సమ్మతి

అవగాహనా సమ్మతి

కొన్ని రోజుల తర్వాత మయాంక్ పట్ల తను ప్రవర్తించిన తీరుకు ప్రవళి తనను కలుసుకున్న అందరి సాధారణ అబ్బాయిలు వలె మయాంక్ కాదు అని గ్రహించింది. అతను ఆ రోజు నుండి తనతో మాట్లాడటానికి కూడా ప్రయత్నించలేదు అనే వాస్తవం అతనిని సాధారణ అబ్బాయిల నుండి తన దృష్టిలో వేరుగా ఉంచింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రవళి అతన్ని కోల్పోయాననే భావన తన హృదయంలో ఏర్పరుచుకుంది. అతనితో స్నేహాన్ని కొనసాగించాలని కోరుకుంది.

మళ్ళీ కలుసుకునే ప్రయత్నంలో

మళ్ళీ కలుసుకునే ప్రయత్నంలో

ఆమె ముక్కుసూటిగా, బాహ్యముఖంగా ఉండటం వలన మయాంక్ నంబరు కనుగొనేందుకు ఆమెకు ఎంతో కాలం పట్టలేదు. ప్రవళి యొక్క సోదరి ఇందుకు సహకరించడానికి మరింత సంతోషంగా ఉండేది. ఆ విధంగా ఒక ఆదివారం మధ్యాహ్నం ఆమె అతన్ని కలుసుకోవడంతో పాటుగా అతనితో ఒక సంభాషణ ప్రారంభించింది.

మరొకరి పరిస్తితిపై సమీక్ష

మరొకరి పరిస్తితిపై సమీక్ష

మయాంక్ మొదటి సారి ఒక అమ్మాయి కోసం పరితపించినపుడు తన భావాలకు స్పందన లేనందుకు బదులుగా ఇప్పుడు మయాంక్ యొక్క అహం మరింత బాధ పడింది. ఆ రోజు ఆమె అతనితో మాట్లాడలేదని ఆమెతో ఇంకెప్పుడు మాట్లాడకూడదని తన మనసులో అనుకున్నాడు. కానీ గొప్ప వాళ్ళు చెప్పినట్లుగా ఎప్పుడైతే మీరు ప్రేమని పొందుతారో అప్పుడు ఆ ప్రేమ మీలో ఎన్నో మార్పులను కలిగిస్తుంది.

ప్రేమ విహరిస్తున్నప్పుడు

ప్రేమ విహరిస్తున్నప్పుడు

త్వరలోనే సాధారణంగా ఆలస్య రాత్రుల సందేశాలు, ఫోన్ కాల్స్ తో పాటుగా ప్రతీ వారాంతరాలలో ఇద్దరు కలసి సంతోషంగా బయట చక్కర్లు కొడుతూ సంతోషకరమైన ప్రేమ జీవితానికి నాంది పలికారు. ఇద్దరూ కలసి బయటకి వెళ్ళినప్పుడు ఈ జంటని చూసిన వాళ్ళు ఎంతో ముచ్చటపడి అనుకూలమైన కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. ఈ విధంగా వీళ్ళ సంతోషకరమైన ప్రేమ జీవితం మూడు సంవత్సరాలు కొనసాగింది. అంతే కాకుండా ఒకరినొకరు ఎంతో స్వచ్చంగా అర్ధం చేసుకున్నారు.

ప్రేమ విషయం పెద్దలకు చెప్పాల్సిన సమయం

ప్రేమ విషయం పెద్దలకు చెప్పాల్సిన సమయం

మూడు సంవత్సరాల సంతోషకరమైన ప్రేమ జీవితం కొనసాగుతుండగా ప్రవళి తల్లిదండ్రులు ఆమెకి ఒక పెళ్లి సంబంధం చూడటం ప్రారంభించారు. అప్పుడు ఆ జంట ఇరు కుటుంబాలకి తమ ప్రేమ విషయం తెలియజేయడానికి ఇదే సరైన సమయం అని భావించారు. మయాంక్ అత్యంత సంప్రదాయక గుజరాతీ కుటుంబం నుండి వచ్చాడు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని వారిద్దరూ వారి కుటుంబాల నుండి వచ్చే ప్రతిచర్యల గురించి ఆందోళన చెందారు.

ఊహించని ప్రతిచర్య

ఊహించని ప్రతిచర్య

అంచనాలకు విరుద్ధంగా, మాయాంక్ కుటుంబం వారి చిన్న కోడలిగా ప్రవళిని అంగీకరించడానికి మరింత సంతోషంగా ఉన్నారు. ప్రవళి తల్లిదండ్రులు కూడా అదే విధంగా భావించారు. అయితే, ఈ ముడిపడిన సంబంధానికి కుటుంబ సభ్యులలో మిక్కిలి సంతోషంగా ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే అది పాత జంటగా ఉన్న ప్రవళి సోదరి మరియు మయాంక్ సోదరుడు అనే చెప్పాలి.

ఒక గొప్ప రోజు

ఒక గొప్ప రోజు

నేడు, ప్రవళి మరియు మాయాంక్‌లు వివాహంతో ఒక్కటయ్యే సందర్భంలో ఇరు పక్షాల నుండి చాలా మంది కుటుంబ సభ్యులు మరలా కలుస్తారు. బహుశా చరిత్ర మరలా పునరావృతం అవుతుంది. మళ్ళీ ఎవరో ఒకరు వారి నిజమైన ప్రేమను కనుగొంటారు. ఈ విధంగా నాటి తరాల నుండి ఇదే జరుగుతూ ఉంది మరియు అది కొనసాగుతుందని మనము ఆశిద్దాము. మరోవైపు వైవాహిక ఆనందం యొక్క ప్రయాణంలో ఆ మనోహరమైన జంట బయలుదేరుతున్నప్పుడు వారికి అందరి ఆశీస్సులు ఉన్నాయి.

English summary

How Destiny Connects Two People

Love stories with a happy ending is always nice. One such story is when Mayank, a very decent guy, met Pravali, an extrovert. Mayank initially approached Pravali but she denied to speak to him. However, later they realised they have actually met their love of their lives and are soon getting married.
Story first published: Monday, March 5, 2018, 18:30 [IST]