శృంగారంతో కేలరీలు తగ్గడంతో పాటు ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి

Written By:
Subscribe to Boldsky

శృంగారాన్ని భార్యాభర్తలంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. దీని వల్ల మానసిక, శారీరక ఆనందంతో పాటు ఇంకా చాలానే ప్రయోజనాలున్నాయి. శృంగారం ద్వారా చాలా కేలరీలను ఖర్చు చేయొచ్చు. వ్యాయామం చేసినంతగా కాకపోయినా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా చాలా కేలరీలు ఖర్చు అవుతాయి.

చాలా కేలరీలు

చాలా కేలరీలు

సుమారు అరగంట సేపు ఒక మోస్తరు వేగంతో పరుగెత్తితే సగటున మహిళల్లో 213 కేలరీలు, పురుషుల్లో 276 కేలరీలు ఖర్చు అవుతాయి. శృంగారం మూలంగా మహిళల్లో 69 కేలరీలు, పురుషుల్లో 101 కేలరీలు ఖర్చు అవుతాయి.

మగవాళ్లలో ఎక్కువగా

మగవాళ్లలో ఎక్కువగా

మగవారిలో ఎక్కువ కేలరీలు ఎందుకు ఖర్చవుతున్నాయో తెలుసా? ఆడవాళ్ల కన్నా మగవాళ్లు ఎక్కువ బరువు ఉండటం.. ఆ సమయంలో మగవారు కాస్త చురుకుగానూ ఉండటం వల్ల కూడా వారిలో ఎక్కువగా కేలరీలు ఖర్చు అవుతాయి.

వ్యాయమం కాదు

వ్యాయమం కాదు

నిజానికి శృంగారమనేది వ్యాయామపద్ధతి కాదు గానీ ఇది కూడా కొంతమేరకు వ్యాయామంగా తోడ్పడుతుండటం విశేషం. కేలరీల విషయం పక్కనపెట్టినా కూడా శృంగారంతో మనకు చాలా లాభాలున్నాయి.

మూడ్ బాగుంటుంది

మూడ్ బాగుంటుంది

మానసిక ఆరోగ్యం, మూడ్‌ మెరుగుపడతాయి. కండరాలను వదులుచేసి, హాయిని కలిగించే రసాయనాలు శరీరమంతా సరఫరా అవుతాయి. అంతేకాదు.. నిద్ర కూడా బాగా పడుతుంది. శృంగారం ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ కూడా చాలా విధాలుగా పెంపొందిస్తుంది.

ముద్దు వల్ల కూడా

ముద్దు వల్ల కూడా

ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో కేవలం కొన్ని కేలరీలు ఖర్చవుతాయి. ముద్దు పెట్టుకునే సమయంలో నిమిషానికి సగటున 2 నుంచి 5 కేలరీలు ఖర్చవుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్వాస ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ స్థాయిలో కేలరీలు ఖర్చవుతాయి.

బరువు తగ్గొచ్చు

బరువు తగ్గొచ్చు

శృంగారం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. ఎంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే కేలరీలు ఖర్చు అవడానికి అంత ఎక్కువ అవకాశం వుంది. శరీరంలో కేలరీలు ఎంత ఎక్కువగా ఖర్చయితే లావు తగ్గడానికి అంత ఆస్కారం వుంటుంది.

గుండె ఆరోగ్యం

గుండె ఆరోగ్యం

శృంగారంలో పాల్గొనడం కేవలం కేలరీలు మాత్రమే ఖర్చుకావు.. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారానికి రెండుసార్ల కంటే ఎక్కువగా రతిలో పాల్గొనే మగాళ్లలో హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది.

జలుబు

జలుబు

రొమాన్స్‌ వల్ల రోగాలను తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

ఒత్తిడిని జయించొచ్చు

ఒత్తిడిని జయించొచ్చు

ఆఫీస్ పని లేదా కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడిగా ఉందా..? దీని భావం మీ శృంగార జీవితంపై పడకుండా జాగ్రత్త పడండి. బెడ్రూంలో పార్టనర్‌తో హ్యాపీగా గడపడం వల్ల ఒత్తిడి నియంత్రణలో ఉంటుందని తేలింది.

తలనొప్పి

తలనొప్పి

తలనొప్పిగా ఉందనే సాకుతో ఆమెకు దూరంగా ఉండటానికి ఎప్పుడూ ట్రై చేయకండి. లైంగిక ఆస్వాదన వల్ల ఆక్సిటోన్ హార్మన్ స్థాయిులు ఐదు రెట్లు పెరుగుతాయి. ఫలితంగా నొప్పులు తగ్గుముఖం పడతాయి.

ఇమ్యూనిటీ పెరుగుతుంది

ఇమ్యూనిటీ పెరుగుతుంది

లైంగిక ఆనందాన్ని పొందడం వల్ల భావప్రాప్తి సమయంలో డీహైడ్రో యిపియాండ్రోస్టిరోన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి, కణాలను రిపేర్ చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వారానికి రెండుసార్లు రతిలో పాల్గొన్నవారు కొన్ని వారాలకు ఒకసారి శృంగారాన్ని ఆస్వాదించే వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట.

హృదయ స్పందన రేటు

హృదయ స్పందన రేటు

శృంగారంలో పాల్గొనడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కణాలు, అవయవాలకు తాజా రక్తం అందుతుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, నిస్సత్తువకు కారణమయ్యే పదార్థాలు తొలగిపోతాయి.

రిలాక్స్

రిలాక్స్

సెక్స్‌లో పాల్గొన్న తర్వాత చాలా రిలాక్స్‌‌గా ఫీల్ అవుతారు. రాత్రంతా చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగవుతుంది.

హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి

హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి

రతి క్రీడలో పాల్గొనడం వల్ల ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయిలు పెరగుతాయి. ఫలితంగా కండరాలు, ఎముకలు, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

English summary

how many calories does sex burn

How Many Calories Does Sex Burn