For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనుక్షణం తలుచుకునేవాడు, నేను మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంటే వచ్చి కౌగిలించుకున్నాడు #mystory214

అనిరుధ్ వెంటనే బైక్ ఆపి అనును కొట్టాడు. సీనియర్ అనిరుధ్ ని కొట్టాడు. ఆ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. తర్వాత అనుక్షణం అనూషనే తలుచుకుంటూ గడిపాడు అనిరుధ్. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంటే వచ్చి..

|

వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. మేమిద్దరం ఒకే రోజు పుట్టాం. మా ఇళ్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. నా పేరు అవంతిక. నా ఫ్రెండ్ పేరు అనిరుధ్. మా ఇద్దరి పేరేంట్స్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరిగా ఉండేవారు. అనిరుధ్ చిన్నప్పటి నుంచి నాతో పాటే చదివాడు. మా ఇద్దరి ఇష్టాలు కూడా ఒక్కటే.

వయస్సు పెరిగే కొద్దీ నాకు వాడిపై ప్రేమ కూడా పెరిగింది. వాణ్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. వాడు కూడా అంతే. టెన్త్ అయిపోయాక ఇద్దరం ఒకే కాలేజీలో జాయిన్ అయ్యాం. అనిరుధ్ కు వాళ్ల నాన్న అప్పాచీ బైక్ కొనిచ్చాడు. మేమిద్దరం రోజూ దానిపై కాలేజీకి వెళ్లి వచ్చేవాళ్లం.

ఎంజాయ్ చేసేవాళ్లం

ఎంజాయ్ చేసేవాళ్లం

అనిరుధ్ కు ఎప్పుడు డబ్బులు అవసరమైనా నన్నే అడిగేవాడు. నా దగ్గరున్న ప్రతి రూపాయి అతని కోసమే ఖర్చు చేసేదాన్ని. ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం. అనిరుధ్ కి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేవాళ్లు కాదు. దాంతో ప్రతి విషయాన్ని నాకే చెప్పేవాడు. నేను కూడా అంతే. నా ప్రతి విషయాన్ని అనిరుధ్ కే చెప్పేదాన్ని.

నాకు మండేది

నాకు మండేది

మా క్లాస్ లో అనిరుధ్ కు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. తనకోసం ఏదైనా చేసే రకం. రోజూ బైక్ పై వచ్చేటప్పుడు నాకు ఆమె గురించే చెప్పేవాడు. నాకు మండేది. సరే ఫ్రెండ్ కదా అని ఏమీ అనేదాన్ని కాదు. అనిరుధ్ అంటే నాకు కూడా చాలా ప్రేమ. వాడికి ఆ విషయం చాలాసార్లు చెప్పాలనుకున్నా కానీ వాడు అస్సలు నేను చెప్పేది పట్టించుకునేవాడు కాదు.

బ్లడ్ డోనేట్ చేశాడు

బ్లడ్ డోనేట్ చేశాడు

అనిరుధ్ ఇష్టపడే అమ్మాయి పేరు అనూష. ఆమె అంటే అతనికి ప్రాణం. తనకోసం ఏదైనా చేసే రకం. ఒకసారి అనూషకు హెల్త్ బాగోలేక బ్లడ్ అవసరమైతే వెంటనే అనిరుధ్ హాస్పిటల్ కు వెళ్లి బ్లడ్ డోనేట్ చేశాడు. ఇక ఆ రోజు నుంచి అనూష కూడా అనిరుధ్ ను ఇష్టపడడం మొదలుపెట్టింది.

ఆ అమ్మాయి ఏదీ అడిగినా కాదనేవాడు కాదు

ఆ అమ్మాయి ఏదీ అడిగినా కాదనేవాడు కాదు

అనూషకు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే దాన్ని నాతో చెప్పి పంపేవాడు అనిరుధ్. నాకు అతనిపై ప్రేమ ఉన్నా అదంతా గుండెల్లో దాచుకుని అతను ఇష్టపడే అమ్మాయి అతనికి దక్కాలని సాయం చేసేదాన్ని. ఆ అమ్మాయి ఏదీ అడిగినా కాదనేవాడు కాదు. ఎందుకురా నీకు ఆ అమ్మాయి అంటే అంత పిచ్చి అని అడిగాను.

అవసరాల కోసమే ఉపయోగించుకుంది

అవసరాల కోసమే ఉపయోగించుకుంది

నీకు అది పిచ్చిలా కనిపిస్తుంది అవంతిక... కానీ అనుపై నాకు ఉండేది స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పాడు. అనిరుధ్ ని అనూష కూడా అంతే రీతిలో ప్రేమిస్తుంది అని అనుకునేదాన్ని. కానీ అను అనిరుధ్ ని అస్సలు ప్రేమించలేదు. కేవలం తన అవసరాల కోసమే ఉపయోగించుకుంది.

కలల్లో బతికేవాడు

కలల్లో బతికేవాడు

అనిరుధ్ ఆ అమ్మాయి బర్త్ డే ఉందంటే ఆ ముందు రోజు మొత్తం నిద్రపోకుండా తనకు బర్త్ డే గిఫ్ట్ తయారు చేసే పనిలో ఉండేవాడు. రకరకాల గిఫ్ట్స్ అనుకు ఇచ్చాడు. ఎప్పటికైనా అను తనదే అనుకుని కలల్లో బతికేవాడు. కానీ చివరకు అను మా సీనియర్ తో ఒక రోజు మాకు కనపడింది. ఇద్దరూ బైక్ పై సరసాలాడుకుంటూ కనిపించారు.

అనుక్షణం అనూషనే తలుచుకుంటూ

అనుక్షణం అనూషనే తలుచుకుంటూ

అనిరుధ్ వెంటనే బైక్ ఆపి అనును కొట్టాడు. సీనియర్ అనిరుధ్ ని కొట్టాడు. ఆ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. తర్వాత అనుక్షణం అనూషనే తలుచుకుంటూ గడిపాడు అనిరుధ్. నాకు ఆ అమ్మాయి గురించి మొదటి నుంచి డౌట్ ఉండేది. కానీ అనిరుధ్ నా మాట అస్సలు వినేవాడు కాదు. వాణ్ని మళ్లీ మామూలు మనిషిగా చేసేందుకు నేను చాలా కష్టపడ్డాను. చాలా ఏళ్లకు వాడు కోలుకున్నాడు.

పెళ్లి రేపు ఉండగా పెళ్లి చేసుకుంటా అన్నాడు

పెళ్లి రేపు ఉండగా పెళ్లి చేసుకుంటా అన్నాడు

నేను వాణ్ని ఎంతో ప్రేమించేదాన్ని. ఎన్నోసార్లు వాడికి ఆ విషయం ఇన్ డైరెక్ట్ గా చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోయాడు. చివరకు మా ఇంట్లో నాకు ఒక సంబంధం తీసుకొచ్చారు. నిశ్చితార్థం అయిపోయింది. అప్పుడు ఏడ్చుకుంటూ నన్ను కౌగలించుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. పెళ్లి రేపు అనే ముందు రాత్రి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఈ అబ్బాయిలంతా ఇంతేనా.

పరాయి వాడికి దక్కేంత వరకు పరధ్యానంలో

పరాయి వాడికి దక్కేంత వరకు పరధ్యానంలో

మేము ప్రేమించేటప్పడు మీ మనస్సులోని మాట చెప్పరు. ఇక మీరు ప్రేమించట్లేదని.. ఇంట్లో వారు చూసిన ఎవడో ఒక గొట్టంగాన్ని చేసుకుందామనుకుంటే మీరు వస్తారు. అప్పుడు ప్రతి అమ్మాయికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అందుకే అబ్బాయిలారా.. మిమ్మల్ని ప్రేమించే అమ్మాయిలను ఇష్టపడండి. మీ మనస్సులోని మాట చెప్పి పెళ్లాంగా చేసుకోండి. పరాయి వాడికి దక్కేంత వరకు పరధ్యానంలో ఉండకండి.

English summary

I am engaged but my ex boyfriend hugged me tightly

I am engaged but my ex boyfriend hugged me tightly
Story first published:Wednesday, August 22, 2018, 17:23 [IST]
Desktop Bottom Promotion