For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాయ్ ఫ్రెండ్ మోజులో పడి నాన్నను చాలా మోసం చేశా, పెళ్లికాకుండానే అన్ని రకాల తప్పులు చేశా #mystory244

|

మా నాన్నకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. నన్ను చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచాడు. అమ్మ కన్నా నాన్నంటే నాకు ప్రాణం. నేనంటే కూడా నాన్నకు చాలా ప్రేమ. నాన్న నాపై ఎప్పుడూ కోప్పడేవాడు కాదు. నేను ఏమీ అడిగినా కాదనేవాడు కాదు.

నేను బాగా చదువుకుని మంచి జాబ్ లో స్థిరపడాలనేది మా నాన్న కోరిక. నన్ను బాగా చదివించారు. నాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా అతను చాలా టెన్షన్ పడేవాడు. నేను కూడా నాన్న మాటను ఎప్పడూ జవదాటలేదు. కానీ నేను బీటెక్ చదివేటప్పుడు నా జీవితంలో మరో అబ్బాయి వచ్చాడు. అతనే అరవింద్.

మరో ప్రపంచాన్ని పరిచయం చేశాడు

మరో ప్రపంచాన్ని పరిచయం చేశాడు

తను నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు మరో ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఎప్పుడూ బుక్స్, లైబర్రీలు, ఎగ్జామ్స్ అంటూ బిజీగా ఉండే నాకు పబ్స్, ట్రిప్స్ వంటివి చాలానే పరిచయం చేశాడు. మేమిద్దరం మొదట స్నేహితులుగానే ఉండేవాళ్లం. కానీ ఒక అబ్బాయి.. అమ్మాయి మధ్య స్నేహం ఎక్కువకాలం ఉండదని నాకు అర్థమైంది.

అతనే ప్రపంచం అయ్యాడు

అతనే ప్రపంచం అయ్యాడు

ఒకరోజు అతను నాకు ప్రపోజ్ చేశాడు. మొదట అతని ప్రేమను నేను నిరాకరించాను. తర్వాత ఒప్పుకున్నాను. ఇక అప్పటి నుంచి నాకు అతనే ప్రపంచం అయ్యాడు. రెండురోజులకొసారి అతనితో బైక్ పై లాంగ్ డ్రైవ్ లకు వెళ్లడం, ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్లడం చేసేవాళ్లం. దాంతో నా చదువంతా అటకెక్కింది.

రోజూ అబ్బాద్దాలు చెప్పేదాన్ని

రోజూ అబ్బాద్దాలు చెప్పేదాన్ని

అరవింద్ నా జీవితంలో రాక ముందు నేను ఎప్పుడూ కూడా నాన్నకు అబద్దం చెప్పింది లేదు. కానీ అతను నా లైఫ్ లోకి వచ్చాక ప్రతి రోజూ అబ్బాద్దాలు చెప్పాల్సి వచ్చేది. నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేదాన్ని. వాటన్నింటికీ కూడా నాన్ననే అప్లై చేసేవారు.

Most Read :రాశుల ప్రకారం వారి సీక్రెట్స్, భయాలు, రహస్యాలు ఇవేMost Read :రాశుల ప్రకారం వారి సీక్రెట్స్, భయాలు, రహస్యాలు ఇవే

హద్దూఅదుపు లేకుండా

హద్దూఅదుపు లేకుండా

నేను చాలా ఎగ్జామ్స్ కు ఏవేవో కారణాలు చెప్పి అస్సలు అటెండ్ కూడా అయ్యేదాన్ని కాదు. అరవింద్ తో బయట తిరిగేందుకు నేను అలా చేసేదాన్ని. హద్దూఅదుపు లేకుండా తిరిగేవాళ్లం. అరవింద్ ధ్యాసలో పడి నా తండ్రి ప్రేమను నిర్లక్ష్యం చేశాను.

ఏం చెప్పినా నమ్మేవాడు

ఏం చెప్పినా నమ్మేవాడు

పాపం మా నాన్న నేను ఏం చెప్పినా నమ్మేవాడు. అరవింద్ ఒళ్లో కూర్చొని ముద్దులుపెట్టుకుంటూ నాన్న నేను చదువుకుంటున్నాను అని చెప్పినా కూడా నమ్మాడు. బీటెక్ పూర్తయ్యాక ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ ఇప్పించాలనుకున్నాడు. కానీ నేను చాలా బ్యాక్‌ లాగ్స్‌ తో బీటెక్ నుంచి కూడా బయటపడలేకపోయాను.

ఏ రోజూ ఒక్క మాట కూడా అనలేదు

ఏ రోజూ ఒక్క మాట కూడా అనలేదు

అయినా డ్యాడీ మాత్రం నన్ను ఏ రోజూ ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పై ఇంట్రెస్ట్ పెట్టడంతో నీ కోర్సులో నెగ్గలేకపోయావు.. నువ్వు తలుచుకుంటే అవన్నీ అయిపోతాయిలే బంగారు అని ప్రోత్సహించాడు. కానీ చదువు పేరుతో నేను చేసినా తప్పులు మా నాన్నకు ఏమీ తెలియవు.

అరవింద్ తో ఎంజాయ్ చేసేదాన్ని

అరవింద్ తో ఎంజాయ్ చేసేదాన్ని

నేను హైదరాబాద్ లో ఉండి చదువుకుంటూ బ్యాక్ లాగ్స్ అయిపోగొడుతానన్నాను. సరే అన్నారు. నెలనెలా వేల రూపాయలు పంపేవారు. నేను చదువు పేరుతో రోజూ అరవింద్ తో ఎంజాయ్ చేసేదాన్ని. తను రెగ్యులర్ గా నా రూమ్ కు వచ్చేవాడు. ఇద్దరం తనువులు మరిచి తన్మయత్వంతో తేలిపోయేవాళ్లం. పెళ్లికాకుండానే అన్ని రకాల తప్పులు చేశాం.

Most Read :ఏ సమయంలో సెక్స్ చేస్తే నా భార్య బాగా సంతృప్తి చెందుతుంది? ఆ టైమ్ లో మూడ్ బాగుంటుందా?Most Read :ఏ సమయంలో సెక్స్ చేస్తే నా భార్య బాగా సంతృప్తి చెందుతుంది? ఆ టైమ్ లో మూడ్ బాగుంటుందా?

అరవింద్ జల్సాలకే

అరవింద్ జల్సాలకే

మా నాన్న నన్ను గుడ్డిగా నమ్మి నెలనెలా వేలాది రూపాయలు అకౌంట్లో వేసేవాడు. ఆ డబ్బంతా కూడా అరవింద్ జల్సాలకు ఉపయోగించేదాన్ని. చివరకు నాన్నకు నా విషయం తెలిసింది. చాలా బాధపడ్డాడు. నాపై ఎప్పుడూ కోప్పడని నాన్న మొదటి సారి ఉగ్రరూపం దాల్చాడు.

వెంటనే పెళ్లి చేస్తా

వెంటనే పెళ్లి చేస్తా

చదువుగిదువూ ఏమీ వద్దూ.. నీకు వెంటనే పెళ్లి చేస్తానని నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. రాత్రికిరాత్రి నేను అరవింద్ తో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాను. నాన్న పరువు పోయింది. ఊర్లో తలెత్తుకోలేకుండా అయిపోయాడు.

పగ పెంచుకున్నాడు

పగ పెంచుకున్నాడు

చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్న ఆయనే నాపై పగ పెంచుకున్నాడు. నేను చనిపోయాయని ఊర్లో చెప్పాడు. అరవింద్ ను నమ్మి పెళ్లి చేసుకుంటే అతను జాబ్ చేయకుండా ఊరికే తిరిగేవాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులుపడ్డాను. కొన్నాళ్లకు అరవింద్ నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మళ్లీ నాన్ను గుర్తొచ్చాడు.

ఫ్యామిలీని సెట్ చేశాడు

ఫ్యామిలీని సెట్ చేశాడు

నాన్నకు అన్ని విషయాలు చెప్పాను. మళ్లీ ఆయన కరిగిపోయాడు. అరవింద్ కు వార్నింగ్ ఇచ్చాడు. అతనికొక జాబ్ ఇప్పించాడు. మళ్లీ మా ఫ్యామిలీని సెట్ చేశాడు. నాన్న నాపై చూపే ప్రేమకు నేను వెలకట్టలేను. నాన్న ఎప్పుడూ నా మంచే కోరుకున్నాడు. నేను బాగా చదువుకోవాలనుకున్నాడు.

Most Read :ఫోర్ ప్లే చేసుకుంటున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ పురుషాంగంపై అది పోసింది, అల్లాడిపోయాడు, మళ్లీ అదిరాసిందిMost Read :ఫోర్ ప్లే చేసుకుంటున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ పురుషాంగంపై అది పోసింది, అల్లాడిపోయాడు, మళ్లీ అదిరాసింది

ఏ తండ్రిని బాధపెట్టొదు

ఏ తండ్రిని బాధపెట్టొదు

రాంగ్ రూట్లో వెళ్లకూడదనుకున్నాడు. బాగా ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. నాకు ఎప్పుడూ ఏ కష్టం రాకూడదనుకున్నాడు. కానీ నేను నాన్నను అర్థం చేసుకోలేదు. నా బాయ్ ఫ్రెండ్ మోజులో పడి నేను నాన్నను చాలా మోసం చేశాను. నాలాగా ఏ కూతురు కూడా తప్పు చేసి ఏ తండ్రిని బాధపెట్టొదని నా సలహా.

English summary

i fell in love I am cheating my parents

i fell in love I am cheating my parents