For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముద్దుల్లో పడి భోజనం మరిచిపోయేవాళ్లం, సర్వం సమర్పించిప్పటి నుంచే నా పెళ్లానివి #mystory206

"నైనా.. ఒక్కసారి నువ్వు లైఫ్ లో వచ్చాక చచ్చే వరకు నేను నీతోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను. వర్క్ బిజీలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రానా నీపై ప్రేమ లేదని కాదు.ముద్దుల్లో పడి మూడు పూటలా భోజనం మరిచిపోయాం.

|

మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. నన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు అమ్మనాన్నలు. నాకు ఏ కష్టం వచ్చినా అల్లాడిపోయేవారు. అంత బాగా చూసుకునేవారు. నీట్ కోచింగ్ లో భాగంగా నేను ఏడాది పాటు మా ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు నాకు ప్రతి క్షణం నరకంలా ఉండేది.

మొత్తానికి నా చదువు అయిపోయింది. నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఇక పెళ్లి అంటే ప్రతి అమ్మాయికి కాస్త టెన్షన్. నాకు కూడా పెళ్లంటే చాలా భయం. మా ఇంట్లో వాళ్లు ఏ సంబంధం తీసుకొచ్చిన ఏదో వంకతో అబ్బాయిని రిజెక్ట్ చేసేదాన్ని.

జీవితాంతం నన్ను బాగా చూసుకుంటాడా లేదా

జీవితాంతం నన్ను బాగా చూసుకుంటాడా లేదా

నేను జాబ్ చేసే దగ్గర ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతని పేరు నవీన్. నా పేరు నైనా. నవీన్ నన్ను ఒక దేవతలా ట్రీట్ చేసేవాడు. మా అమ్మనాన్నల తర్వాత నన్ను అంత బాగా చూసుకుంది అతనే. కానీ నవీన్ ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నన్ను బాగా చూసుకుంటాడా లేదా నాకు డౌట్ వచ్చేది.

ముద్దుల్లో పడి మూడు పూటలా భోజనం మరిచిపోయేవాళ్లం

ముద్దుల్లో పడి మూడు పూటలా భోజనం మరిచిపోయేవాళ్లం

నేను బోర్ కొడితే నన్ను ఎక్కడ విడిచిపెట్టిపోతాడేమోనని అనిపించేది. వీకెండ్ లో ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం. ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్ రొమాన్స్ లో మునిగితేలేవాళ్లం. ముద్దుల్లో పడి మూడు పూటలా భోజనం కూడా మరిచిపోయేవాళ్లం. అయితే అతనికి కావాల్సినవన్నీ నేను ఇచ్చాను కాబట్టి అతను నన్ను ఎక్కడ విడిచిపెట్టి పోతాడేమోనని భయంగా ఉండేది.

ఏవేవో సందేహాలు మొదలయ్యాయి

ఏవేవో సందేహాలు మొదలయ్యాయి

మొదట మేమిద్దరం ప్రేమ పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. తర్వాత మా ప్రేమ గురించి ఇంట్లో చెబితే ఒప్పుకున్నారు. పెళ్లి కొన్ని రోజులు ఉందనగా నాలో ఏవేవో సందేహాలు మొదలయ్యాయి. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన నన్ను బాగా చూసుకుంటాడా? టార్చర్ చేస్తాడా అని నాలో అనుమానం మొదలైంది.

నా ఫ్రెండ్స్ తో మాట్లాడినిస్తాడా

నా ఫ్రెండ్స్ తో మాట్లాడినిస్తాడా

నాకు స్వేచ్ఛ ఇస్తాడా? పెళ్లి అయిన తర్వాత పబ్స్ కి, పార్టీలకు తీసుకెళ్తాడా లేదా అని భయం వేసేది. అస్సలు నన్ను నా ఫ్రెండ్స్ తో మాట్లాడినిస్తాడా లేదా అని అనిపించేంది. మా అమ్మవాళ్ల దగ్గరకు పంపిస్తాడా లేదా అని అనిపించేది.

క్షణాల్లో వచ్చి వాలేవాడు

క్షణాల్లో వచ్చి వాలేవాడు

పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే నవీన్ నాపై అలసత్వం చూపించేవాడు. అంతకు ముందు నేను ఎక్కడికైనా రమ్మంటే అక్కడికి క్షణాల్లో వచ్చి వాలేవాడు. కానీ పెళ్లి దగ్గరపడేసరికి అతను మరీ నెగ్లెట్ చెయ్యడం మొదలుపెట్టాడు. పెళ్లి కాకముందే నేను అతనికి అన్నీ సమర్పించాను. అడిగిందల్లా ఇచ్చాను. దీంతో నేను అతనికి చులకన అయిపోయాను.

అదేంటి నైనా అలా అంటున్నావ్

అదేంటి నైనా అలా అంటున్నావ్

మొదట అతను నా వెంట తిరిగేవాడు. నేను ఒక్కసారి అతని ప్రేమను కన్ఫమ్ చేశాక అతని వెంట నేను తిరగాల్సి వచ్చేది. ఇక ఇలా అయితే కాదని ఒక రోజు నవీన్ వాళ్ల ఇంటికి వెళ్లాను. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నవీన్ అన్నాను. ఏమైంది నైనా.. ఏం ప్రాబ్లమ్ అన్నాడు. నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదన్నాను.

అదేంటి నైనా అలా అంటున్నావ్ అన్నాడు. మరి నేను గతంలో ఒక్క మెసేజ్ చేస్తే వందసార్లు నాకు ఫోన్ చేసేవాడివి. నేను ఎక్కడికి అడిగితే అక్కడికి తీసుకెళ్లేవాడివి.. ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదన్నాను.

నువ్వు బోర్ కొట్టావని కాదు

నువ్వు బోర్ కొట్టావని కాదు

"నైనా.. ఒక్కసారి నువ్వు లైఫ్ లో వచ్చాక చచ్చే వరకు నేను నీతోనే ఉండాలని ఫిక్స్ అయ్యాను. వర్క్ బిజీలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రానా నీపై ప్రేమ లేదని కాదు. మునపటి మాదిరిగా నీతో మాట్లాడకపోయినంత మాత్రానా నువ్వు బోర్ కొట్టావని కాదు. నువ్వు మరో కొన్ని రోజుల్లో నా భార్యవు కాబోతున్నావు.. ఒక్కసారి నువ్వు నా జీవితంలో వచ్చాక నీకు ఏ ఇబ్బంది రాకుండా ఉండకూడదని అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాను నైనా."

 అప్పటి నుంచే నా పెళ్లానివి

అప్పటి నుంచే నా పెళ్లానివి

"నువ్వు అడుగు తీసి అడుగు కిందకు పెట్టకుండా ఉండకుండా ఒక కారు, మనమిద్దరం ఏకాంతంగా గడిపేందుకు ఒక బంగ్లా, ఇలా అన్నీ తీసుకోవడంలో బిజీగా ఉండి నిన్ను పట్టించుకోలేదుగానీ నువ్వుంటే ప్రేమ లేక కాదు. నువ్వు ఎప్పుడైతే నమ్మి నాకు సర్వం సమర్పించావో ఆ రోజే మన పెళ్లి అయిపోయింది. అప్పటి నుంచే నా పెళ్లానివి. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నేను ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నాను.

మహరాణిలా చూసుకోవాలని

మహరాణిలా చూసుకోవాలని

నువ్వు మా ఇంటికొచ్చాక నిన్ను మహరాణిలా చూసుకోవాలని అన్ని సిద్ధం చేశాను. నా ప్రాణం ఉన్నంత నైనా తోనే నా జీవితం." అని నవీన్ చెప్పేసరికి నేను అతన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో నాకు తెలిసింది. నిజంగా.. అబ్బాయిల్లో కొందరు ఒక అమ్మాయి అతని నమ్మితే ఆమె కోసం దేనికైనా సిద్ధం అవుతారు. నా నవీన్ కూడా అలాంటోడే.

English summary

i misunderstood my boyfriend but he is genuine person

i misunderstood my boyfriend but he is genuine person
Story first published:Monday, August 13, 2018, 15:48 [IST]
Desktop Bottom Promotion